Advertisement

Advertisement


Home > Movies - Movie News

రవితేజ సరసన ఛాన్స్.. కానీ రాత్రికి రాత్రే..!

రవితేజ సరసన ఛాన్స్.. కానీ రాత్రికి రాత్రే..!

వారసత్వాన్ని పక్కనపెడితే, బయట నుంచి వచ్చే నటీనటులకు ఇండస్ట్రీలో అవకాశాలు అంత ఈజీగా రావు. అందం ఉంటుంది, నటించే సత్తా ఉంటుంది. కానీ ఎందుకో ఛాన్సులు రావు. ఇలాంటి బాధను తను కూడా అనుభవించానంటోంది హీరోయిన్ దివి.

మోడలింగ్ నుంచి యాక్టింగ్ కు వచ్చిన తనకు లెక్కలేనన్ని తిరస్కరణలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చింది. మరీ ముఖ్యంగా రవితేజ సినిమా కోసం ఎంపిక చేసి, రాత్రికిరాత్రి తొలిగించారని చెప్పుకొని బాధపడింది.

"నన్ను మొహం మీదే తిరస్కరించిన సందర్భాలున్నాయి. నేను సన్నగా ఉన్నానని ఒకరు రిజెక్ట్ చేశారు. మరొకరు నేను లావుగా ఉన్నానని రిజెక్ట్ చేశారు. సన్నగా మారమంటారు, మారితే రిజెక్ట్ చేస్తారు. వీటికంటే ఘోరం ఏంటంటే..  రీసెంట్ గా ఓ సినిమాలో నేను సెలక్ట్ అయ్యాను. అది రవితేజ సినిమా. రవితేజ పక్కన లీడ్ క్యారెక్టర్ నాది. ఇంకో 5 రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవుతుందనగా రాత్రికి రాత్రి నన్ను మార్చేశారు."

ఇలా తనకు ఎదురైన చేదు అనుభవాల్ని బయటపెట్టింది దివి. ఎన్నో ఆఫీసులు తిరిగానని.. ఒక దశలో తనపై తనకు నమ్మకం కూడా పోయిందని అంటోంది.

"చాలా ఆఫీసులు తిరిగాను, ఎన్నో ఆడిషన్స్ ఇచ్చాను, చాలామంది రిజెక్ట్ చేశారు. ఫోన్ చేస్తామంటారు, ఇంటికెళ్లిన తర్వాత కాల్ రాదు. బాత్రూమ్ లో షవర్ పెట్టుకొని, నోరు మూసుకొని ఎన్నోసార్లు ఏడ్చాను. బెడ్ పై దిండు కవర్ చేసుకొని చాలాసార్లు ఏడ్చాను. అమ్మానాన్నలకు తెలిస్తే బాధపడతారు, తిడతారని చెప్పేదాన్ని కాదు."

కెరీర్ లో ఇంకా నిలదొక్కుకోకముందే ట్రోలింగ్ చేస్తున్నారని, ఓ పాటలో డాన్స్ సరిగ్గా చేయలేదని భారీగా ట్రోల్ చేశారని, ఓ నటిపై ఎందుకంత నెగెటివ్ గా వ్యవహరిస్తున్నారో తనకు ఇప్పటికీ అర్థం కావట్లేదని అంటోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?