ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటోలను అసభ్యకరంగా, అభ్యంతరకరంగా కార్టూన్లు వేసి ఇష్టానుసారం వ్యంగ్యాన్ని వ్యక్తపరిచారు! అప్పట్లో కొన్ని వెబ్ సైట్లను పెట్టి మరీ అమరావతి గ్రాఫిక్స్ ను ఆకాశానికెత్తుతూ, జగన్ ను కించపరచడానికి వాడారు! కట్ చేస్తే.. అధికారం చేజారగానే ఆ వైబ్ సైట్లు అడ్రస్ లేవు! సెర్చ్ చేసినా దొరకడం లేవవి!
తెలుగుదేశం ముఖ్య నేత నారా లోకేష్ గైడెన్స్ తో ఒక సోషల్ మీడియా టీమ్ తొలిసారి అప్పట్లో పని చేసింది. ఏపీ రాజకీయానికి అదో కొత్త! సోషల్ మీడియా అంటే ప్రజల అభిప్రాయాలు అనుకునే దశలో… ఒక పెయిడ్ టీమ్ ను పెట్టి తమకు అనుకూలమైన ప్రచారాలను చేసుకున్నారు! అయితే అలాంటివేవీ 2019లో టీడీపీని రక్షించలేకపోయాయి! కనీసం లోకేష్ ను ఎమ్మెల్యేగా గెలిపించలేకపోయాయి!
సోషల్ మీడియాలో తిరుగులేని సైన్యం ఉందనుకున్న పవన్ కల్యాణ్ కూడా రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలే అయ్యారు! అయితే సోషల్ మీడియా ఎవ్వరినీ గెలిపించలేదు, ఓడించలేదు అనే ధ్యాస ఏ పార్టీకీ లేదు! ఏది చేసినా దాంట్లో పరాకాష్టకు చేరడం తెలుగుదేశం పార్టీకి అలవాటే!
ఈ క్రమంలో వైఎస్ జగన్ ప్రభుత్వం నుంచి ఇంటి స్థలం, అమ్మఒడి పథకం లబ్ధి పొందిన ఒక సాధారణ మహిళ తన ఆనందాన్ని వ్యక్తం చేయడాన్ని కూడా తెలుగుదేశం సోషల్ మీడియా వర్గం సహించలేకపోయింది! మారుపేర్లతో, మారు కులాల పేర్లతో సోషల్ మీడియా అకౌంట్లను నడిపించుకునే దివాళాకోరు బ్యాచు ఒక మహిళ ఆత్మహత్యకు కారణమైంది!
ఆమెను విపరీతంగా ట్రోల్ చేసి.. ఇద్దరు చిన్నారులను అనాథలుగా మార్చారు. ఇందులో ఇప్పటికే బోలెడన్ని వివాదాస్పద పోస్టులతో వార్తల్లో నిలిచిన స్వాతి చౌదరి, అజయ్ చౌదరి సజ్జా పేర్లు ఈ వేధింపుల్లో ప్రముఖంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే సదరు తెలుగుదేశం యాక్టివిస్టులు, వీరాభిమానులు ఆ మహిళను వేధిస్తూ తాము పెట్టిన పోస్టులను డిలీట్ చేసి పలాయనం చిత్తగించినట్టుగా ఉన్నారు.
ఎవరో ఒక లబ్ధిదారు తన ఆనందాన్ని వ్యక్తం చేస్తే, ఆమె వీడియోలు వైరల్ గా మారితే.. సహించలేక ఆమెను దూషించి, మనశ్శాంతి లేకుండా చేసి, ఆమె ఆత్మహత్య చేసుకునేంత వరకూ తీసుకెళ్లేంత స్థాయిలో వీరి రాక్షసత్వం చేరిందంటే .. పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు! మరణించిన మహిళల పిల్లల రోధన మనసున్న ఈ మనిషినైనా కలిచి వేస్తుంది. అయితే వీరాభిమాన ముసుగులో ఉచ్ఛనీఛాలను మరిచిన వాళ్లను తప్ప!