అసలే కెరీర్ అంతంతమాత్రంగా ఉంది. ఇలాంటి టైమ్ లో ఏ హీరోయిన్ అయినా వచ్చిన అవకాశాల్ని ఒడిసి పట్టుకుంటుంది. పనిలోపనిగా ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. కానీ ఇక్కడో హీరోయిన్ మాత్రం తెలివితేటలు చూపిస్తోంది.
తన దగ్గరకు ఓటీటీ ఆఫర్లతో వచ్చే మేకర్స్ ను మభ్య పెడుతోంది, సినిమా చేద్దామని ఊరిస్తోంది. ఈ మధ్య ఓ మేకర్ వెబ్ సిరీస్ ఐడియాతో ఈ హీరోయిన్ ను సంప్రదించాడు. ఫిమేల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్.
ఈ ముద్దుగుమ్మకు కథ బాగా నచ్చింది. కానీ ఓటీటీకి చేయడానికి ఆమెకు ఇష్టం లేదు. అలా అని కథను వదులుకోవడానికి కూడా ఇష్టపడలేదు. దీంతో నెల రోజుల పాటు తిప్పించి.. ఆ వెబ్ సిరీస్ ను సినిమాగా చేద్దామని ప్రపోజల్ పెట్టింది.
సినిమాకు కావాల్సిన హంగులు, ఎలిమెంట్స్ అన్నీ ఆ కథలో ఉన్నాయని.. వెబ్ సిరీస్ ను రెండున్నర గంటల సినిమాగా మార్చి చేద్దామంటే వెంటనే కాల్షీట్లు ఇస్తానని ఊరించింది. అయితే రెమ్యూనరేషన్ మాత్రం తగ్గించనని, తనకు 75 లక్షలు ఇవ్వాలని కండిషన్ పెట్టింది.
కానీ వాస్తవం ఏంటంటే.. ఆ కథ సినిమాగా పనికిరాదు. బి, సి సెంటర్లలో అస్సలు ఆడే స్టఫ్ కాదు. ఇవన్నీ ఆలోచించే వెబ్ సిరీస్ వైపు మొగ్గుచూపారు. కానీ ఈ హీరోయిన్ కు మాత్రం వెబ్ లో చేయడం ఇష్టం లేదు. అందుకే ఇలా సినిమా చేద్దామంటూ కలరింగ్ ఇస్తోంది.
అదేదో చేయనని డైరక్ట్ గా చెప్పేస్తే సరిపోతుంది కదా.. ఇలా తిప్పించుకోవడం ఎందుకు? తనే చేస్తానని ఊరించడం ఎందుకు?
Neeku vunna thelivi thetalu vallaku levule G. A 🤐🤐🤐🤐👌👌😇😇
Vc estanu 9380537747