బాబు చాణక్య తెలివిపై ఉత్తరాంధ్ర తమ్ముళ్ల గుస్సా!

గెలుపు స్పష్టంగా ఉంటే.. చంద్రబాబు నాయుడు తాను స్వయంగా నిర్ణయం తీసుకునే వారేమో. కానీ.. గెలుపు దక్కాలంటే అడ్డదారులు తొక్కాలి, అనేక తప్పుడు, నైతికవిలువల్లేని పనులు చేయాలి, ప్రలోభాలకు పాల్పడాలి.. ఇన్ని వంకర పనులు…

గెలుపు స్పష్టంగా ఉంటే.. చంద్రబాబు నాయుడు తాను స్వయంగా నిర్ణయం తీసుకునే వారేమో. కానీ.. గెలుపు దక్కాలంటే అడ్డదారులు తొక్కాలి, అనేక తప్పుడు, నైతికవిలువల్లేని పనులు చేయాలి, ప్రలోభాలకు పాల్పడాలి.. ఇన్ని వంకర పనులు చేయాల్సి వచ్చే అవసరం స్పష్టంగా కనిపిస్తున్న సమయంలో.. ఆయన నిర్ణయాన్ని తమ్ముళ్ల మీద విడిచి పెట్టేశారు. క్లిష్టమైన పరిస్థితుల్లో నిర్ణయం బాధ్యతను తమ మీద పెట్టడం అంటే.. దానితో ముడిపడి అనేకరకాలుగా తమ మీద భారం పెట్టడమే అని ఉత్తరాంధ్రలోని టీడీపీ సీనియర్ నాయకులు చంద్రబాబు తీరు మీద తమలో తాము గుస్సా అవుతున్నారు.

ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేయాలా లేదా అనే విషయంలో తెలుగుదేశం ఇంకా నిర్ణయం తీసుకోనేలేదు. కాగా, వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ సోమవారం నామినేషన్ వేయబోతున్నారు. టీడీపీ అసలు పోటీ నిర్ణయమే తీసుకోలేదు. చంద్రబాబు చేతులు దులిపేసుకుని, ఉత్తరాంధ్ర నాయకులే నిర్ణయం తీసుకోవాలని చెప్పేశారు. అక్కడి నాయకుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. పోటీచేద్దామని కొందరు, వద్దని కొందరు అంటున్నారు.

కాగా పోటీచేయాలనే నిర్ణయమే ఫైనల్ గా తీసుకుంటే గనుక, అలా సిఫారసు చేసినందుకు వైసీపీ ఓటర్లను తమవైపు ఫిరాయింపజేసే బాధ్యత మొత్తం తమ నెత్తిన వేసేస్తారేమోననే భయం పలువురు నాయకుల్లో ఉంది. అడ్డదారి మంతనాలు చేయాల్సి రావడమే గాకుండా, వైసీపీ ఓటర్లను ప్రలోభపెట్టడానికి భారీగా తాము ఖర్చు పెట్టాలేమో అని భయపడుతున్నారు. ఖర్చును అభ్యర్థి నెత్తిన వేసినప్పటికీ.. ప్రలోభాల పర్వం తమకు తప్పదని వాపోతున్నారు. ఇదొక పరువుతక్కువ వ్యవహారం అవుతుందని అంటున్నారు.

పైగా ఎంతమంది వైసీపీ ఓటర్లను ప్రలోభపెట్టి తెదేపాలోకి తీసుకువస్తే.. ఆ నాయకులు కష్టపడి పనిచేసినట్లుగా.. అలాంటి వారికి ప్రభుత్వం పరంగా ప్రాధాన్యం దక్కుతుందన్నట్టుగా చంద్రబాబు సంకేతాలు ఇస్తున్నారని కూడా వారిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. నాలుగో వంతు బలం మాత్రమే ఉన్న ఎన్నికలో పోటీచేయకపోతే ఏం మునిగిపోతుందని.. ఇలా పార్టీ నాయకులను టెన్షన్ లో పెట్టడం తగదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

7 Replies to “బాబు చాణక్య తెలివిపై ఉత్తరాంధ్ర తమ్ముళ్ల గుస్సా!”

  1. జిఏ ఇలాగే తిక్క తిక్క గా రాస్తూ వుండు, నీవు మరియు ఎమ్.బి.ఎస్ చెత్త గా రాసే కొద్దీ, ఇక్కడ కామెంట్స్ మోడరేట్ చేసే కొద్దీ, జగన్ నోరు విప్పే కొద్దీ, ప్రజలు ’29 లో కూడా జగన్ ను మోడరేట్ చేస్తారు. జస్ట్ వెయిట్ అండ్ సీ.

  2. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి పేరు ఖరారు

Comments are closed.