తిరుమల సిఫారసు హోదాకోసం నాయకుల ఆరాటం!

ఎమ్మెల్యేలుగా ఎన్నికైతే ఆయా నాయకులకు అనేక ప్రత్యేక అధికారాలు దఖలు పడతాయి. కొన్ని హక్కులు అధికారికంగా వస్తాయి.. చట్టంలో రాజ్యాంగంలో ఎక్కడా లేకపోయినప్పటికీ.. అనేక రకాల అధికారాలను వారు అప్రకటితంగా అనుభవిస్తూ ఉంటారు. అలా…

ఎమ్మెల్యేలుగా ఎన్నికైతే ఆయా నాయకులకు అనేక ప్రత్యేక అధికారాలు దఖలు పడతాయి. కొన్ని హక్కులు అధికారికంగా వస్తాయి.. చట్టంలో రాజ్యాంగంలో ఎక్కడా లేకపోయినప్పటికీ.. అనేక రకాల అధికారాలను వారు అప్రకటితంగా అనుభవిస్తూ ఉంటారు. అలా ఎమ్మెల్యేలు అనుభవించే రకరకాల విశేష అధికారాల్లో తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి సిఫారసు లేఖలు ఇవ్వడం కూడా ఒకటి.

ఇలాంటి సిఫారసు లేఖలు ఇవ్వడం ద్వారా.. తమ అనుచరగణాన్ని బలోపేతం చేసుకునే నాయకులు కొందరుంటారు. సిఫారసు లేఖల్ని దళారీలకు అప్పగించి వ్యాపారం చేసుకుంటూ, ప్రతి లేఖను వేల నుంచి లక్షల రూపాయల వరకు ధరకట్టి అమ్ముకుంటూ ప్రతినెలా ఇబ్బడిముబ్బడిగా సొమ్ముచేసుకుంటూ ఉండేవారు కొందరుంటారు.

అలాగే సిఫారసు లేఖల్ని అత్యంత పెద్ద పారిశ్రామికవేత్తలకు, బడాబాబులకు ఇవ్వడం ద్వారా.. వారి ప్రాపకం సంపాదించి.. వారి ద్వారా అనుచిత మార్గాలలో తాము ఎదగడానికి వాడుకునే వారు కొందరుంటారు. ఇలా తిరుమల దర్శనానికి సిఫారసు లేఖలను నాయకులు రకరకాలుగా వాడుతూ ఉంటారు.

అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. తిరుమలలో సిఫారసు లేఖల వ్యవహారాన్ని పూర్తిగా ఆపు చేయించింది. సిఫారసు అధికారాల విషయంలో కొత్త విధానం తీసుకురావాలని చూస్తోంది.

ఇలా ఉండగా తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలకు సిఫారసు లేఖలు ఇచ్చే అధికారం లేకపోవడం పట్ల అక్కడి స్పీకరు గడ్డం ప్రసాద్ కుమార్ బాధపడుతున్నట్టుగా ఉంది. ఆయన హైదరాబాదులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి.. తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లెటర్లకు తిరుమలలో విలువ ఇచ్చేలా చూడాలని కోరారు. దీనికి చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగా స్పందించినట్టు వార్తలు వస్తున్నాయి.

అయితే తమాషా ఏంటంటే.. ఇప్పటిదాకా ఏపీలోని ఎమ్మెల్యేలకు కూడా ఇంకా సిఫారసు ఉత్తరాల దందాకు సంబంధించిన అధికారాలు ఇవ్వలేదు. పాపం ఇప్పటికే రెండు నెలల దందా కోల్పోయామని కొందరు ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతున్నారు. అనుచరులకు కూడా దర్శనసదుపాయం ఇవ్వలేకపోతున్నామని పలువురు అంటున్నారు.

గతంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఒకరు సిఫారసు లేఖను అమ్ముకున్నట్టుగా విజిలెన్సు వారి దాడుల్లో దొరికిపోయి నానా రభస అయిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. మరి చంద్రబాబు ఇలాంటి దందాలు సాగకుండా ఎలాంటి పటిష్టమైన నిబంధనలతో సిఫారసులకు మళ్లీ తెర ఎత్తుతారో వేచిచూడాలి.

3 Replies to “తిరుమల సిఫారసు హోదాకోసం నాయకుల ఆరాటం!”

  1. “నల్ల ‘పిర్రల బర్రె” Tirumala లో Darsana యాపారం చేసి వేల కోట్లు సంపాదించి.. ఇప్పుడు ఫారిన్ వీధుల్లో

    టూరిస్ట్ గా పి’ర్రలు చూపిస్తూ బిజీ గా ఉన్న బర్రె

Comments are closed.