తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి చాలా ప్రతిష్టాత్మకమైనది. ఈ పదవి కోసం ఎంతో మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి ఈ పదవి ఎపుడూ ఉత్తరాంధ్ర జిల్లాలకు దక్కలేదు. గోదావరి జిల్లాల దాకానే వచ్చి ఆగిపోయింది.
దాంతో ఈసారి అయినా ఉత్తరాంధ్రకు దక్కుతుందా అన్న చర్చకు తెర లేస్తోంది. ఈ కీలక పదవి కోసం టీడీపీకి చెందిన సీనియర్ నేత మాజీ ఏపీ ప్రెసిడెంట్ కిమిడి కళా వెంకట్రావు పేరు పరిశీలనలో ఉందని వార్తలు అయితే వస్తున్నాయి. ఆయన 1983 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. టీడీపీలో సీనియర్ నేతగా ఉన్నారు.
ఈసారి గెలిచి మంత్రి అవుదామని అనుకున్నారు. కానీ అది జరగలేదు. దాంతో ఆయనకు ఈ పదవి ఇస్తారని ప్రచారం సాగుతోంది. బీసీ కాపు నేతగా ఉన్న కళాకు ఈ పదవిని ఇవ్వడం ద్వారా ఉత్తరాంధ్రలో మరింత పట్టు సాధించవచ్చునని రానున్న కాలంలో విజయనగరం జిల్లా రాజకీయాల్లో కూడా టీడీపీ మరింత పటిష్టం అవుతుందని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారంట.
టీటీడీ బోర్డు మెంబర్ పదవిని శ్రీకాకుళం జిల్లాకు చెందిన కూన రవికుమార్ కి ఇస్తారని మరో ప్రచారం సాగుతోంది. ఆయన కూడా మంత్రి పదవిని ఆశించారు. బలమైన బీసీ నేతగా ఉన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ కి ఎస్టీ చైర్మన్ పదవి ఇస్తారని కూడా ప్రచారంలో ఉంది. ఇలా మూడు జిల్లాల నుంచి ముగ్గురుకీ న్యాయం చేస్తారు అని అంటున్నారు.
ఒకవేళ ఈ ప్రచారమే నిజమైతే ఉత్తరాంధ్ర తమ్ముళ్ల పంట పండినట్లే అని అంటున్నారు. కీలక పదవులు ఇప్పటికే కొన్ని ఉత్తరాంధ్ర కు దక్కాయి. అయితే మరిన్ని పదవులు కట్టబెట్టడం ద్వారా ఉత్తరాంధ్రలో సైకిల్ స్పీడ్ ని ఇంకా పెంచాలన్నదే పసుపు పార్టీ పెద్దల వ్యూహం అని అంటున్నారు.
Call boy works 8341510897
Vc estanu 9380537747
He is not suitable candidate, better to give that post to some non political person.
ప్రవచనకారులైన చాగంటి, గరికపాటి లాంటివాళ్ళకి ఇస్తే ప్రభుత్వం ఇమేజ్ పెరుగుతుంది పబ్లిక్ లో….
పనికి రాని సొల్లు కబుర్లు చెప్పే వాళ్ళకి ఇస్తే అంతే . కోతి కి కొబ్బరికాయ ఇచ్చినట్టే . అంత పెద్ద వ్యవస్తని నిర్వహించాలంటే ఆషామాషీ కాదు.
You need organization skills and financial and budgeting experience. These two are just talkers nothing else and also they want to be on safe side. Christianity is spreading in AP but both never care about that.btw Chaganti praised KCR like a king he lost there itself. KCR did the biggest corruption ever