టాలీవుడ్ కు కళ తెచ్చిన ఆగస్ట్15

ఈసారి ఆగస్ట్ 15, టాలీవుడ్ కు కూడా పండగ తీసుకొచ్చింది. మంచి వీకెండ్, లాంగ్ వీకెండ్. దీంతో సినిమాలేవీ తగ్గడం లేదు. ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. చిన్న-పెద్ద సినిమాలనే తేడా లేవు. అన్నీ విపరీతంగా ప్రచారం…

ఈసారి ఆగస్ట్ 15, టాలీవుడ్ కు కూడా పండగ తీసుకొచ్చింది. మంచి వీకెండ్, లాంగ్ వీకెండ్. దీంతో సినిమాలేవీ తగ్గడం లేదు. ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. చిన్న-పెద్ద సినిమాలనే తేడా లేవు. అన్నీ విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. చాన్నాళ్ల తర్వాత మార్కెట్లో సినిమా కళ కనిపిస్తోంది. జనాలు సినిమాల గురించి మాట్లాడుకోవడం వినిపిస్తోంది. మొన్నటివరకు ఈ ట్రెండ్ లేదు. గడిచిన 2 రోజులుగా ఆగస్ట్ 15 సినిమాల ఫీవర్ ఊపందుకుంది.

తంగలాన్ – వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ అంటూ తెగ తిరిగేస్తున్నాడు హీరో విక్రమ్. హీరోయిన్ మాళవిక మోహనన్ ను వెంటేసుకొని మరీ తెలుగు రాష్ట్రాలు చుట్టేస్తున్నాడు. రెస్టారెంట్లలో టిఫిన్ చేస్తున్నాడు, కుర్రాళ్లతో కలిసి డాన్స్ చేస్తున్నాడు. తన సినిమా ప్రమోషన్ కోసం ఇంతలా ఎప్పుడా తెలుగు మార్కెట్ పై విక్రమ్ ఫోకస్ పెట్టలేదు.

డబుల్ ఇస్మార్ట్- పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రచారం చేయకపోయినా, ముంబయిలో ఓ ఈవెంట్ చేశారు. వరంగల్, హైదరాబాద్ లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇంటర్వ్యూలు, చిట్ చాట్ లు దీనికి అదనం.

మిస్టర్ బచ్చన్ – పక్కా లోకల్. ఎలాంటి పాన్ ఇండియా ప్లాన్స్ లేవు. పూర్తిగా తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ ను ఫోకస్ చేసి తీసిన సినిమా. మాస్ మసాలా రవితేజ మార్క్ మూవీ. ఇప్పటికే ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. సాంగ్స్ హిట్టవ్వడం వీళ్లకు ప్లస్ అయింది. అదనంగా హీరోయిన్ తో డాన్సులు, ప్రీ-రిలీజ్ ఫంక్షన్లు.

ఆయ్ – పేరుకు చిన్న సినిమా అయినా ప్రచారంలో అస్సలు తగ్గడం లేదు. బన్నీ వాసు ప్రమోషన్ కోసం గట్టిగా ఖర్చు పెడుతున్నాడు. స్వయంగా తనే ఇంటర్వ్యూలిస్తూ, వినూత్నంగా పబ్లిసిటీ చేస్తూ సినిమాను లైమ్ లైట్లో ఉంచుతున్నాడు. మరీ ముఖ్యంగా ఈ సినిమాకు సోషల్ మీడియా ప్రమోషన్ ట్రెండీగా, ఆకట్టుకునేలా సాగుతోంది. బన్నీ వాసు వల్ల ఈ సినిమా రేంజ్ పెరిగింది.

ఇలా ఆగస్ట్ 15కు వస్తున్న సినిమాలన్నీ వేటికవే ప్రచారంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రచారం చేస్తున్నాయి. ప్రమోషన్స్ లో ఏది ముందుంది, ఏది వెనకబడింది అనే చర్చకు కూడా తావులేకుండా దూసుకుపోతున్నాయి. ఇక మిగిలింది ఈ సినిమాల ఫలితాలే.

6 Replies to “టాలీవుడ్ కు కళ తెచ్చిన ఆగస్ట్15”

Comments are closed.