అబ్బా… ఒక సంస్కారి హిత‌వు!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌ల స్థాయి దాటి ప‌ర‌స్ప‌రం దూష‌ణ‌ల వ‌ర‌కూ వ‌చ్చి చాలా కాల‌మైంది. ఇందులో టీడీపీ, వైసీపీ నాయ‌కులు ఎవ‌రికి వారే తోపు. టీడీపీ అధికార ప్ర‌తినిధి ఆనం వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి ఎంత సంస్కార‌వంతుడో…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌ల స్థాయి దాటి ప‌ర‌స్ప‌రం దూష‌ణ‌ల వ‌ర‌కూ వ‌చ్చి చాలా కాల‌మైంది. ఇందులో టీడీపీ, వైసీపీ నాయ‌కులు ఎవ‌రికి వారే తోపు. టీడీపీ అధికార ప్ర‌తినిధి ఆనం వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి ఎంత సంస్కార‌వంతుడో ఏపీ రాజ‌కీయాల‌ను ప‌రిశీలిస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ తెలుసు. వైఎస్ జ‌గ‌న్ స‌తీమ‌ణి భారతి, ఆర్కే రోజా త‌దిత‌రుల‌పై వివిధ సంద‌ర్భాల్లో ఆయ‌న చేసిన కామెంట్స్ నాగ‌రిక స‌మాజం అస‌హ్యించుకునేలా వుండేవ‌ని ప్ర‌త్య‌ర్థులు వాపోయేవారు.

ఇక వైఎస్ జ‌గ‌న్ గురించి ఆయ‌న నోటికి హ‌ద్దూఅదుపూ వుండేది కాదు. ఇదో ప‌బ్లిసిటీ స్టంట్‌. టీడీపీ పెద్ద‌ల్ని ఆక‌ర్షించేందుకు జ‌గ‌న్‌ను నీచంగా మాట్లాడ్డం అల‌వాటు చేసుకున్నారాయ‌న‌. ఇలాంటి మ‌హానుభావుడు తాజాగా స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడికి హిత‌వు చెప్ప‌డం చ‌ర్చనీయాంశ‌మైంది.

స్పీక‌ర్‌గా బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర్వాత మొద‌టిసారిగా అయ్య‌న్న‌పాత్రుడు తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వెళ్లారు. ద‌ర్శ‌నానంత‌రం గుడి ఎదుట మీడియాతో మాట్లాడుతూ గ‌త ఐదేళ్ల‌లో కొంత మంది రాక్ష‌సుల చేతుల్లో రాష్ట్రం న‌ష్ట‌పోయింద‌ని విమ‌ర్శించారు. దోపిడీ జ‌రిగింద‌ని, అభివృద్ధి కుంటుప‌డింద‌ని ఆయ‌న ఆరోపించారు.

తిరుమ‌ల‌లో రాజ‌కీయాలు మాట్లాడ్డంపై ఆనం వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డికి బాధ క‌లిగింది. దీంతో అయ‌న ఎక్స్ వేదిక‌గా ఒక పోస్టు పెట్టారు.

“సర్ మీరు అంటే నాకు చాలా ఇష్టం గౌరవం కూడా. దయచేసి తిరుమలలో రాజకీయాలు వద్ద‌ని నా విన్నపం” అంటూ ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం. చంద్ర‌బాబు సీఎంగా బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర్వాత మొద‌టిసారి తిరుమ‌ల వెళ్లిన‌ప్పుడు రాజ‌కీయాలు మాట్లాడారు. అప్పుడు కూడా ఇదే రీతిలో బాబుకు హిత‌వు చెప్పి వుంటే, ఇప్పుడు అయ్య‌న్న మాట్లాడేవారు కాదేమో అన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

24 Replies to “అబ్బా… ఒక సంస్కారి హిత‌వు!”

  1. TDP అయినా వద్దు అని ఆనం చెప్పారు. దానిని హర్షించకుండా ఎమిటి రా ఈ పిచ్చి రాతలు.

    .

    TDP అయితె చాలు దెనైయినా నీచంగా రాయగల సామర్ద్యం నాకు ఉంది అంటావా?

  2. “నల్ల ‘పిర్రల బర్రె” Tirumala లో Darsana యాపారం చేస్తూ గుడి బయట బూతు రాజకీయ కామెంట్స్ చేసేది.. ఇప్పుడు ఏకడ ఆ బర్రె??

  3. “నల్ల ‘పిర్రల బర్రె” Tirumala లో Darsana యాపారం చేస్తూ గుడి బయట బూ’తు రాజకీయ కామెంట్స్ చేసేది.. ఇప్పుడు ఏకడ ఆ బర్రె??

  4. Kootami lo Reddies are secondary citizens. Anam should realize that. Jaffa Jagan party chesina arachakaalaki Reddies ki Kootami offices loki entry ivvadame ekkuva.

    1. tdp anni kulaladi andaridi babu garu andariki manchi platform ga cheseru anduke nellore itara prantalanunchi anekamandi reddy nayakulu tama political platform ga tdp ni enchukonnaru varandariki dhanyavadalu

      1. Anni kulalu kootami lo vunnai kaani reddies maatram secondary citizens. Adi pakka. Vaalu poyina ayidu samvatsaralu chesina atiki asalu kootami loki entry ivvadame ekkuva. Neeku vallu istham ayithe poyi valla boots naaku. Kootamiki aa avasaram ledu. Reddies ke vere dikku leka Kootamini pattuku veladutunnaru.

  5. ఆనం ఎంత సంస్కారవంతుడో ఏపి రాజకీయాలను పరిశీలిస్తున్న ప్రతి ఒక్కరికీ తెలుసు అన్నావు కదా

    మరి రోజా, అంబటి, వల్లభనేని, కొడాలి, వీ.సా రెడ్డి వీళ్ళు ఎంత సంస్కారవంతులో కూడా చెప్పు great andhra

  6. ఇంకోటి చెప్పటం మర్చిపోయా.. నీ(.)లి పార్టీ అన్న పేరుకి సార్థకత తీసుకురావడం కోసం నీ(.)లి చిత్రాలు విడుదల చేస్తున్న జగనన్న మంత్రులు కార్యకర్తలకు ధన్యవాదాలు. దువ్వాడ కి స్పెషల్ థాంక్స్

Comments are closed.