రాబోయే సినిమాలు అన్నీ భారీ రేట్లు

దేవర, పుష్ప 2, గేమ్ ఛేంజ‌ర్, విశ్వంభర సినిమాలు ఇప్పటికి ఫిక్స్ అయ్యాయి. ఈ అన్ని సినిమాల థియేటర్ హక్కులు భారీగా చెబుతున్నారు.

రాబోయే నాలుగు నెలలు భారీ సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. దేవర, పుష్ప 2, గేమ్ ఛేంజ‌ర్, విశ్వంభర సినిమాలు ఇప్పటికి ఫిక్స్ అయ్యాయి. ఈ అన్ని సినిమాల థియేటర్ హక్కులు భారీగా చెబుతున్నారు.

ఎన్టీఆర్- కొరటాల శివ- దేవర ఏపీ(సీకెడ్ కాకుండా) హక్కులు 55 కోట్లు చెబుతున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ కావాలి. ఈ రేంజ్‌ కలెక్షన్ రావాలంటే.

బన్నీ- సుకుమార్ పుష్ప 2 సినిమా ఏపీ(సీడెడ్ కాకుండా) హక్కులు 90 కోట్లు కోట్ చేస్తున్నారు. చాలా అంటే చాలా పెద్ద రేంజ్ ఇది. కల్కి మాదిరిగా భారీగా టికెట్ రేట్లు పెంచితే తప్ప ఈ మేరకు వసూళ్లు సాధ్యం కాదు.

యువి – మెగాస్టార్ విశ్వంభర సినిమా ను సింగిల్ పాయింట్ లో హొల్ సేల్ గా అమ్మే ప్రయత్నాలు జ‌రుగుతున్నాయి. ఇది కూడా ఏపీ (సీడెడ్ కాకుండా) 60 కోట్ల వరకు రేటు వుండే అవకాశం వుంది.

అన్నింటితో పోల్చుకుంటే రామ్ చరణ్- శంకర్ గేమ్ ఛేంజ‌ర్ రేటు కాస్త తక్కువ వుండొచ్చు. ఎందుకంటే శంకర్ ప్రస్తుతం సక్సెస్ ట్రాక్ లో లేరు.

మొత్తానికి రాబోయే నాలుగు నెలల్లో భారీ సినిమాలు వున్నాయి. వీటితో పాటే బాబీ- బాలయ్య సినిమా కూడా వుంది. మీడియం సినిమాలు చాలా వున్నాయి. అందువల్ల బయ్యర్లు డబ్బులతో రెడీగా వుంటే సినిమాలు కొనొచ్చు. హిట్ అయితే మంచి లాభాలు చేసుకోవచ్చు.

12 Replies to “రాబోయే సినిమాలు అన్నీ భారీ రేట్లు”

  1. పుష్ప 2 90 కోట్లా?.. వినేవాళ్ళు వెర్రి పుష్పాలు అనుకున్నావు రా… రిలీజ్ చేయడానికి భయపడి చస్తున్నారు నిర్మాతలు..ఆ వెర్రి పుష్పం చేసిన పని తమ కొంప ముంచుతుందేమో అని

Comments are closed.