వైసీపీ ఆఫీసు అక్కడ… నేతలేమో ఇక్కడ

విశాఖలో వైసీపీ సొంతంగా ఒక ఆఫీసుని నిర్మించింది. అది విశాఖకు అయిదారు కిలోమీటర్ల దూరంగా శివారు ప్రాంతంలో ఉంది. సిటీ మధ్యలో అయితే లేదు. పార్టీ అధికారంలో ఉన్నపుడు అంత దూరం కార్లలో టూ…

విశాఖలో వైసీపీ సొంతంగా ఒక ఆఫీసుని నిర్మించింది. అది విశాఖకు అయిదారు కిలోమీటర్ల దూరంగా శివారు ప్రాంతంలో ఉంది. సిటీ మధ్యలో అయితే లేదు. పార్టీ అధికారంలో ఉన్నపుడు అంత దూరం కార్లలో టూ వీలర్స్ తో వెళ్ళిన నేతలు పవర్ పోగానే అక్కడికి వెళ్ళడం మానుకున్నారు.

ఎవరికి వారు సొంత ఆఫీసులను సిటీలోనే ఏర్పాటు చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వైసీపీ ఎంపీ అభ్యర్ధి బొత్స ఝాన్సీ కోసం విశాఖలో తీసుకున్న ఆఫీసుని ఇపుడు శాసనమండలిలో విపక్ష నేత హోదాలో బొత్స సత్యనారాయణ వాడుకుంటున్నారు. ఆయన విశాఖ వస్తే అక్కడే పార్టీ వ్యవహారాలు చూస్తున్నారు.

మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ కూడా అక్కడికే వెళ్ళి మీడియా సమావేశాలు పెడుతున్నారు. విశాఖ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నాయన మాత్రమే దూరంగా ఉన్న ఆఫీసుకు వెళ్తున్నారు. పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని ఆ ఆఫీసే వైసీపీకి కేంద్ర కార్యాలయంగా మారుతుందని భావించారు. దానికి తగినట్లుగా డిజైన్లు వేసి అంతస్తులను నిర్మించారు. తీరా చూస్తే పార్టీ భారీ ఓటమి చెందింది. దాంతో పార్టీ ఆఫీసుకు కూడా కళ తప్పింది. జిల్లా ఆఫీసుగా కూడా ఇపుడు ఎవరూ పరిగణించి అక్కడకు వచ్చే సందర్భం లేకుండా పోయిందని అంటున్నారు.

మీడియా కూడా పార్టీ పవర్ లో ఉండడంతో అంత దూరం వెళ్లేవారు. ఇపుడు ప్రతిపక్షం కాబట్టి మీడియా ఉన్న చోటనే మీటింగులు పెట్టుకోవాల్సి వస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు. విశాఖలో వైసీపీ తరఫున నోరు విప్పే కొందరు నేతలు కూడా పార్టీ ఆఫీసుకుని వెళ్లకపోవడంతో రానున్న రోజులలో మళ్లీ సిటీలో అద్దె ఆఫీసును చూసుకుంటారా అని పార్టీలో తర్కించుకుంటున్నారు.

11 Replies to “వైసీపీ ఆఫీసు అక్కడ… నేతలేమో ఇక్కడ”

  1. అసలు జగన్ ఎక్కడ? సీబీఎన్ ప్రజల కోసం వరదల్లో కష్టపడేది చూసి జగన్ కు చలి జ్వరం వొచ్చి ముసుగేసుకుని పడుకునాడంటగా , ’29 లో కూడా ఓడిపోతామనే భయంతో?

Comments are closed.