ట్రయిలర్ మారింది.. మూడ్ మారలేదు

దేవర-1 సినిమా నుంచి ఇప్పటికే ఓ ట్రయిలర్ వచ్చింది. దానికి మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో రెండో ట్రయిలర్ కాస్త డిఫరెంట్ గా వస్తుందని అనుకున్నారు చాలామంది. కానీ దేవర-1 రిలీజ్ ట్రయిలర్ కూడా…

దేవర-1 సినిమా నుంచి ఇప్పటికే ఓ ట్రయిలర్ వచ్చింది. దానికి మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో రెండో ట్రయిలర్ కాస్త డిఫరెంట్ గా వస్తుందని అనుకున్నారు చాలామంది. కానీ దేవర-1 రిలీజ్ ట్రయిలర్ కూడా మొదటి ట్రయిలర్ ఛాయల్లోనే వచ్చింది.

సముద్రం ఎరుపెక్కడం, ఆయుధాలు, నరుక్కోవడం… మొదటి ట్రయిలర్ లో చూపించిన ఈ ఎలిమెంట్స్ అన్నీ, కొద్దిసేపటి కిందట వచ్చిన రిలీజ్ ట్రయిలర్ లో కూడా ఉన్నాయి. కాకపోతే సన్నివేశాలు మారాయి.

మొదటి ట్రయిలర్ తో పోలిస్తే, రెండో ట్రయిలర్ లో ఓ ప్రత్యేకత ఉంది. ఫస్ట్ ట్రయిలర్ లో ఎక్కువగా యాక్షన్ ఎలిమెంట్స్ మాత్రమే చూపించగా.. రెండో ట్రయిలర్ లో ఎమోషనల్ కంటెంట్ కూడా చూపించారు. మరీ ముఖ్యంగా దేవర కనిపించకుండా పోయాడనే విషయాన్ని మొదటి ట్రయిలర్ చెప్పగా.. కీలకమైన టైమ్ లో దేవర తిరిగొచ్చినట్టు రెండో ట్రయిలర్ లో చూపించారు.

ఇలా సినిమా కథ, కథనం, మూడ్ పై ఈ 2 ట్రయిలర్స్ తో ప్రేక్షకులకు ఓ అవగాహన కల్పించారు మేకర్స్. సినిమాలో హింస, యాక్షన్ ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని మరోసారి క్లారిటీగా చెప్పారు. మొదటి ట్రయిలర్ లో సాంగ్ బిట్ చూపించగా, ఈసారి దానికి చోటివ్వలేదు. పూర్తిగా ఎమోషనల్ సన్నివేశాల చుట్టూ తిరిగింది రెండో ట్రయిలర్.

మొత్తమ్మీద దేవర-1 రెండో ట్రయిలర్ ఈసారి సరైన అంచనాల్ని సెట్ చేసింది. 27న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా ఆ అంచనాల్ని అందుకుంటుందా లేదా చూడాలి.

4 Replies to “ట్రయిలర్ మారింది.. మూడ్ మారలేదు”

Comments are closed.