జగన్ కంటే చంద్రబాబుకు తొందర ఎక్కువ

ఏ ప్రభుత్వమైనా సరే తాము అసాధ్యాలను సుసాధ్యం చేశామని, ప్రజాసేవలో అద్భుతాలు సృష్టించామని ప్రజల ఎదుట చాటి చెప్పుకోవడానికి ఉత్సాహపడుతుంది. నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించినా, ఇవాళ చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తున్నా..…

ఏ ప్రభుత్వమైనా సరే తాము అసాధ్యాలను సుసాధ్యం చేశామని, ప్రజాసేవలో అద్భుతాలు సృష్టించామని ప్రజల ఎదుట చాటి చెప్పుకోవడానికి ఉత్సాహపడుతుంది. నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించినా, ఇవాళ చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తున్నా.. ఇద్దరి పనితీరులోనూ ఈ విషయంలో మాత్రం తేడా ఉండదు. నిన్న జగన్ చేసిన పని ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా చేస్తారు!

అయితే ఇలా సొంత డబ్బా కొట్టుకునే విషయంలో చంద్రబాబు నాయుడుకు జగన్ కంటే చాలా తొందర ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే నాలుగేళ్ల పాలన పూర్తయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరుతో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రతి ఒక్కరికి చాటి చెప్పాలని పార్టీ ఎమ్మెల్యేలను పురమాయించి పంపారు. చంద్రబాబు నాయుడు 100 రోజులు పూర్తి కాగానే తాము సాధించిన విజయాలను రాష్ట్రమంతా టముకు వేయాలంటూ నాయకులను పురమాయిస్తున్నారు.

చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. 100 రోజుల ప్రభుత్వ కాలంలో సాధించిన విజయాలను గురించి ఇంటింటికి తిరిగి ప్రజలకు తెలియజేయాలని ఆయన పార్టీ వారికి మార్గదర్శనం చేశారు. అలాగే 2029 సంవత్సరం నాటికి తెలుగుదేశం పార్టీని తిరుగులేని అజేయమైన శక్తిగా రూపొందిస్తామని కూడా ఆయన సెలవిచ్చారు.

అంతా బాగానే ఉంది కానీ ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం మొదలెడితే తల బొప్పి కడుతుందని పార్టీ కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం కొన్ని హామీలను ఇప్పటికే నెరవేర్చుకున్నప్పటికీ.. వేటి కోసమైతే ప్రజలు అత్యంత ఆశతో ఎదురుచూస్తున్నారో అలాంటి కీలక హామీలు ఇప్పటిదాకా కార్య‌ రూపం దాల్చలేదు.

సూపర్ సిక్స్ హామీలకు అతీగతీలేదు ఎప్పుడు అవి అమలులోకి వస్తాయనే సమాచారం కూడా ప్రభుత్వ పెద్దలు ఎవరూ చెప్పడం లేదు. అలాగే పార్టీ పరంగా కూడా శ్రేణుల్లో నిరుత్సాహం ఉంది. నామినేటెడ్ పదవుల భర్తీ గురించి ఇప్పటిదాకా పట్టించుకోలేదు. కార్యకర్తలు గంపెడాశలు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు నాయుడు మాత్రం 100 రోజులలోగా నామినేటెడ్ పదవులన్నీ ప్రకటించేస్తాం అని అన్నారు కానీ ఆ గడువు పూర్తయింది తప్ప వారి ఆశలు మాత్రం జరగలేదు.

ఇప్పుడు మళ్లీ కార్యకర్తలను ఇంటింటికి తిరిగి వందరోజుల పురోగతి గురించి చెప్పమని ఆయన పనులు పురమాయిస్తున్నారు. ప్రజల వద్దకు వెళితే సూపర్ సిక్స్ హామీల గురించి నిలదీయడం జరుగుతుందని వాటిలో కనీసం సగమైనా పూర్తి చేసి వెళ్లితే తప్ప మర్యాద దక్కదని.. ఒకసారి ప్రజలు నిలదీయడం మొదలెడితే ప్రభుత్వం 100 రోజులకే భ్రష్టు పట్టిపోయినట్లుగా ప్రజల ఎదుట ఒక ఇంప్రెషన్ ఏర్పడుతుందని పార్టీ కార్యకర్తలు మధనపడుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు ఏ రకంగా ముందుకు వెళతారో వేచి చూడాలి.

11 Replies to “జగన్ కంటే చంద్రబాబుకు తొందర ఎక్కువ”

    1. కుల విద్వేషాన్ని ప్రోత్సహించడం వైసీపీ మద్దతుదారులు ఉపయోగించే తాత్కాలిక వ్యూహం మాత్రమే కాదు, ఇది సమాజంలో తీవ్రమైన విభజనను సృష్టించే ప్రమాదకరమైన చర్య. గత ఎన్నికల్లో ఇది జగన్ మోహన్ రెడ్డికి చాలా నష్టం చేసిందని ప్రజలు స్పష్టంగా చూపించారు. ప్రజలు ఇలాంటి నీచమైన రాజకీయాలకు మోసపోవడానికి సిద్ధంగా లేరు. కూటమికి కేవలం కమ్మలు లేదా కాపులు మాత్రమే కాకుండా, చాలా ఇతర కులాలు, ముఖ్యంగా పెద్ద సంఖ్యలో రెడ్డులు కూడా మద్దతు ఇవ్వడం ఈ సత్యాన్ని మరింత స్పష్టం చేసింది.

      ప్రస్తుతం మనం కలసి పరిశీలించాల్సిన ముఖ్యమైన విషయం — తిరుపతి లడ్డులో నెయ్యి కల్తీ సమస్య. ఇది కేవలం కొన్ని కులాలకు సంబంధించిన విషయం కాదు; ప్రతి భారతీయుడి విశ్వాసం, ఆచారాలు, మనోభావాలను దెబ్బతీసే అంశం. 95% రెడ్డులు సహా, అన్ని కులాలవారు ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది కులం గురించి కాదు, నిజాయితీ, ధర్మం గురించి. ఈ వ్యవహారంలో బాధ్యులెవ్వరైనా సరే, మనం ధైర్యంగా నిలబడి వారి తప్పును ఖండించాలి.

      పవిత్రమైన తిరుపతి లడ్డును కల్తీ చేయడం భక్తుల మనోభావాలకు దెబ్బతీసే చర్య. కులాలకు అతీతంగా ఇలాంటి దారుణ చర్యలను ఖండించాల్సిన సమయం ఇది. కుల విద్వేషం ప్రోత్సహించడం ద్వారా మనం కేవలం విభజనలను సృష్టిస్తాం, కాని సమాజాన్ని ఏకీకృతం చేయలేం. మంచి మానవులుగా ఉండి, కులాలకు అతీతంగా నైతిక విలువలు, సత్యం, న్యాయం కోసం నిలబడాలి.

      కుల విద్వేషం మన సమాజాన్ని నిర్మించదు, అది కేవలం మనల్ని బలహీనంగా చేస్తుంది. కులం ఏదైనా కావచ్చు, కానీ తప్పు ఎక్కడ జరిగినా, అది ఖండించబడాలి.

  1. ఇప్పటికైనా అర్థం చేసుకోండి రా మా 420 సై కో jagan అంటేనే ఆంధ్రప్రదేశ్కు ఒక బ్రాండ్ దుర్మార్గానికి దుష్టత్వానికి

Comments are closed.