సమ్మర్ స్పెషల్ ‘వీరమల్లు’

ఈ ఏడాది చివర్లోనే హరిహర వీరమల్లు పార్ట్-1 థియేటర్లలోకి వస్తుందని మేకర్స్ గతంలో ప్రకటించారు. అయితే పవన్ తో పని అంత ఈజీ కాదనే విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఈ సినిమాకు కొత్త…

ఈ ఏడాది చివర్లోనే హరిహర వీరమల్లు పార్ట్-1 థియేటర్లలోకి వస్తుందని మేకర్స్ గతంలో ప్రకటించారు. అయితే పవన్ తో పని అంత ఈజీ కాదనే విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఈ సినిమాకు కొత్త విడుదల తేదీ ఎనౌన్స్ చేశారు.

హరిహర వీరమల్లు సినిమాను వచ్చే ఏడాది మార్చి 28న సమ్మర్ ఎట్రాక్షన్ గా విడుదల చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు. ఇదే కనుక జరిగితే పవన్ చేస్తున్న 3 సినిమాల నుంచి ముందుగా థియేటర్లలోకి వచ్చేది ఈ సినిమానే.

ఎందుకంటే.. ఓజీ సినిమా అడ్వాన్స్ గా ఉన్నప్పటికీ.. మార్చి లోపు విడుదల చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఏడాది డిసెంబర్ వరకు స్లాట్స్ ఫుల్ అయ్యాయి. జనవరి బాక్సాఫీస్ ఆల్రెడీ నిండిపోయింది. ఫిబ్రవరిలో రిలీజ్ చేద్దామనుకుంటే, మార్చిలో హరిహర వీరమల్లు సినిమా డేట్ ప్రకటించారు.

సో.. ఓజీ అయినా, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అయినా హరిహర వీరమల్లు పార్ట్-1 థియేటర్లలోకి వచ్చిన తర్వాతే రిలీజ్ అవుతాయన్నమాట. అన్నట్టు పవన్ ఈ సినిమాకే ముందుగా కాల్షీట్లు కేటాయించాడు.

11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్.. సెట్స్ పైకి వస్తాడా రాడా అనే అనుమానాలున్నాయి. వాటిని పటాపంచలు చేస్తూ, దీక్షతోనే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు పవన్. బెజవాడలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈరోజు ఉదయం 7 గంటల నుంచే షూటింగ్ మొదలైనట్టు యూనిట్ తెలిపింది.

7 Replies to “సమ్మర్ స్పెషల్ ‘వీరమల్లు’”

  1. విజయవాడ లో పవన్ లాంటి స్టార్ షూటింగ్ అంటే సూపర్. hats off to Pavan dedication. మంత్రి బాధ్యతలు + షూటింగ్. Multi tasking at its peak

  2. విజయవాడ లో పవన్ లాంటి స్టార్ షూటింగ్ అంటే సూపర్. hats off to Pavan dedication. మంత్రి బాధ్యతలు + షూటింగ్. Multi tasking at its peak

  3. విజయవాడ లో పవన్ లాంటి స్టార్ షూటింగ్ అంటే సూపర్. hats off to Pavan dedication. మంత్రి బాధ్యతలు + షూటింగ్. Multi tasking at its peak

Comments are closed.