జానీ మాస్టర్ కేసు.. తెరపైకి సుకుమార్

మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలపై అరెస్టై, పోలీసు విచారణను ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ కేసు, రోజురోజుకు ట్విస్టులు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్, విశ్వక్ సేన్…

మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలపై అరెస్టై, పోలీసు విచారణను ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ కేసు, రోజురోజుకు ట్విస్టులు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్, విశ్వక్ సేన్ పేర్లు తెరపైకి రాగా.. తాజాగా దర్శకుడు సుకుమార్ పేరు ప్రస్తావనకొచ్చింది.

పోలీసు విచారణలో జానీ మాస్టర్ సుకుమార్ పేరును ప్రస్తావించినట్టు తెలుస్తోంది. మహిళపై లైంగిక వేధింపులకు సంబంధించి పోలీసు విచారణలో భాగంగా పలు కీలక విషయాలు వెల్లడించాడు జానీ మాస్టర్.

కొన్ని రోజుల కిందట సి.కల్యాణ్ అనుమానం వ్యక్తం చేసినట్టుగానే, జానీ మాస్టర్ కూడా తనపై ఏదో కుట్ర జరుగుతోందనే అనుమానాన్ని వ్యక్తం చేశాడు. అంతేకాదు.. తను బాధితురాల్ని వేధించలేదని, బాధితురాలే తనను మానసికంగా వేధించిందని పోలీసులకు తెలిపాడు జానీ.

ఇదే ఇష్యూకు సంబంధించి దర్శకుడు సుకుమార్ దగ్గర తను పంచాయితీ పెట్టానని పోలీసులకు వెల్లడించాడు. ఆమె వేధింపులు భరించలేక, విషయాన్ని సుక్కూ దగ్గరకు తీసుకెళ్లానని, ఆయన బాధితురాలితో మాట్లాడాడని, అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదని ఆరోపించాడు జానీ మాస్టర్. దీంతో ఈ కేసుకు సంబంధించి పోలీసులు, సుకుమార్ ను కూడా విచారిస్తారనే ప్రచారం సాగుతోంది.

బాధితురాలు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా విచారణ జరిపారు పోలీసులు. స్టేట్ మెంట్ లో ప్రతి ఆరోపణను జానీ మాస్టర్ ఖండించినట్టు తెలుస్తోంది. పెళ్లి చేసుకోవాలంటూ బాధితురాలు తరచుగా తనను వేధించేదని, కొన్నిసార్లు బెదిరింపులకు కూడా పాల్పడిందని జానీ మాస్టర్ ఆరోపించాడు.

నా భర్త బంగారం..

మరోవైపు తన భర్త జానీ మాస్టర్ బంగారం అంటూ వెనకేసుకొచ్చారు భార్య ఆయేషా. నేరం అంగీకరించినట్టు మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తన భర్తను ఈ కేసులో అక్రమంగా ఇరికించారని, తెరవెనక ఏదో పెద్ద కుట్ర జరుగుతోందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. రిమాండ్ లో ఉన్న తన భర్తకు ఇష్టమైన భోజనం అందించడానికి పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆయేషా.. ఈ మొత్తం వ్యవహారం వెనక ఓ పెద్ద హీరో ఉన్నాడనే కథనాలపై స్పందించడానికి నిరాకరించారు. తను ఏదో చెబితే, మీడియా ఇంకేదో రాస్తోందని, అందుకే ఈ అంశంపై స్పందించనని ఆమె అన్నారు.

రేపటితో జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ ముగిసిపోతుంది. విచారణలో జానీ మాస్టర్ వెల్లడించిన అంశాలతో అతడ్ని మరోసారి కోర్టు ముందు ప్రవేశపెడతారు పోలీసులు. జ్యూడీషియల్ రిమాండ్ ను పొడిగించమని కోరుతారు. అటు జానీ మాస్టర్ తరఫు లాయర్, ఇప్పటికే బెయిల్ పిటిషన్ కు అప్లయ్ చేసి ఉన్నారు. జానీ మాస్టర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది కాబట్టి.. అతడికి ఇంత త్వరగా బెయిల్ వస్తుందా రాదా అనేది అనుమానంగా మారింది.

6 Replies to “జానీ మాస్టర్ కేసు.. తెరపైకి సుకుమార్”

  1. Are Ratri youtube lo Madhavilatha interview comments choosi, Jani master thappu undi, siksha padadam khayam. Kaneesam 10 samvatsaralu guarantee ani anukonnane. Srushtini entha bhadha pettado ee vedhava ani jaali paddane. Inthaloki ee twist enti GA?

  2. పాపం మన అన్నయ్య వెధవ ఇనప్పుడల్లా నీకు జానీ మాస్టర్ గుర్తుకు వస్తాడు….అంతేనా diversion GA..😂😂

Comments are closed.