విశాఖ శాఖ లోకేష్ దేనా?

విశాఖ జిల్లాకు మంత్రి ఎవరూ లేరు. ఏపీలో మెగా సిటీగా ఉంది. వైసీపీ ప్రభుత్వం కూడా రెండోసారి విస్తరణలో రెండు మంత్రి పదవులనూ అనకాపల్లి జిల్లాకే అప్పగించింది. విశాఖకు ఆనాడు మంత్రి పదవి ఎందుకు…

విశాఖ జిల్లాకు మంత్రి ఎవరూ లేరు. ఏపీలో మెగా సిటీగా ఉంది. వైసీపీ ప్రభుత్వం కూడా రెండోసారి విస్తరణలో రెండు మంత్రి పదవులనూ అనకాపల్లి జిల్లాకే అప్పగించింది. విశాఖకు ఆనాడు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని టీడీపీ కూడా విమర్శించింది.

అదే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా అదే జరిగింది. దాని మీద లోలోపల కుమలడమే తప్ప తమ్ముళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. అయితే నారా లోకేష్ మాత్రం మంత్రిగా విశాఖకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన నెలలో కనీసం రెండు మూడు రోజులు విశాఖలో గడిపేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

దాంతో విశాఖ శాఖ కూడా ప్రత్యేకంగా లోకేష్ తీసుకున్నారా అని పార్టీ లోపలా బయటా అంతా తర్కించుకుంటున్నారు. లోకేష్ వచ్చిన ప్రతీసారీ పార్టీ ఆఫీసులో ఉంటున్నారు. పార్టీ నేతలతో మాట్లాడుతున్నారు. వారి మంచి చెడ్డలను చూస్తున్నారు.

ప్రజా దర్బార్ ని కూడా నిర్వహిస్తూ స్థానికుల నుంచి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఆకస్మిక తనిఖీలు తన శాఖ తరఫున చేపడుతున్నారు. ఈ విధంగా లోకేష్ విశాఖకు వస్తూ పోతూ మంత్రి లేరు అన్న లోటుని తీరుస్తున్నారు.

పార్టీలోని ఆశావహులు తమ బాధలను చెప్పుకుంటున్నారు. తమకు న్యాయం చేయమని వారు కోరుతున్నారు. వారి వినతులను వింటున్నారు. భరోసా ఇస్తున్నారు, హామీలు ఇస్తున్నారు. వివిధ వర్గాలకు చెందిన సంఘాలు నాయకులు వచ్చి చెప్పుకుంటున్న సాధక బాధకాలను కూడా ఆయన ఆలకిస్తున్నారు. దీనిని చూసిన వారు విశాఖకు వేరే మంత్రి లేరన్న చింత ఎందుకు లోకేష్ చేతిలోనే విశాఖ శాఖ ఉంది అని అంటున్నారు. అదే నిజమనిపించేలా నారా లోకేష్ విశాఖ పర్యటనలు తరచుగా చేస్తూ వస్తున్నారు.

6 Replies to “విశాఖ శాఖ లోకేష్ దేనా?”

  1. అదే మన జగన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు.. సంవత్సరానికి ఒక సారి విశాఖ వెళ్ళేవాడు..

    వాడికి మూడొచ్చిన ప్రతి సారి.. నీకు ఆర్టికల్ లేస్తుంది…

    జగన్ రెడ్డి విశాఖ టూర్.. ప్రతిపక్షాలకు వణుకు..

    జగన్ రెడ్డి విశాఖ పర్యటన.. ఆందోళనలో ప్రతిపక్షాలు..

    జగన్ రెడ్డి విశాఖ టూర్ .. టీడీపీ కి గడ్డుకాలం..

    ఎంత సొల్లు రాసెటోడివి.. ఇప్పుడు పాపం.. 11 సీట్లతో ప్రతిపక్ష హోదా అడుక్కొంటున్నాడు..

    1. ఇంకోటి మర్చిపోయారు వచ్చిన ప్రతిసారి ఇచ్చే ఎలేవేషన్స్ కి రియాల్టర్స్ (చాల వరకు ఎంవీవీ బినామీ లు) గజం కి ఇంత లెక్కన పెంచి ఆల్రెడీ ఇల్లు స్థలాలు కొనేదానికి అడ్వాన్స్ ఇచ్చినోళ్ళకి చుక్కలు చూపించేవాళ్ళు…విశాఖ లో స్థలం కొనాలి అనే మిడిల్ క్లాస్ వాళ్ళకి చుక్కలు చూపించారు …పర్టికులర్ గ విశాఖ లో వైచిపి స్వీప్ ఐపోడానికి మెయిన్ రీసన్ ఇదే

Comments are closed.