టీడీపీకి త‌ల‌నొప్పిగా మారిన ఎమ్మెల్యే!

ఒక‌వేళ క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకున్నా, ఏదో ఒక‌టి వాగుతూ మ‌రింత న్యూసెన్స్ క్రియేట్ చేస్తాడ‌ని టీడీపీ అధిష్టానం త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతోంద‌ని స‌మాచారం.

టీడీపీకి తిరువూరు ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీ‌నివాస‌రావు త‌ల‌నొప్పిగా మారారు. కూట‌మి 100 రోజుల పాల‌న పూర్తి చేసుకుంది. ఇంత త్వ‌ర‌గా అధికార పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఎమ్మెల్యేను భ‌రించ‌లేం బాబోయ్‌, ఇన్‌చార్జ్‌ను నియ‌మించాల‌ని, లేదంటే పార్టీ స‌ర్వ‌నాశ‌నం అవుతుంద‌ని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడిపై టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస్‌కు ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం.

అంతేకాదు, ఇటీవ‌ల ఎమ్మెల్యే వేధింపులు తాళ‌లేక ఆత్మ‌హ‌త్య య‌త్నానికి పాల్ప‌డి, చికిత్స పొందుతున్న ఆస్ప‌త్రి ఎదుట ఎమ్మెల్యే వైఖ‌రిని నిర‌సిస్తూ టీడీపీ ద్వితీయ శ్రేణి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న‌కు దిగ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. చిట్టేల స‌ర్పంచ్ తుమ్మ‌ల‌ప‌ల్లి శ్రీ‌నివాస‌రావును బ‌ట్ట‌లూడ‌దీసి కొడ‌తాన‌ని ఎమ్మెల్యే బ‌హిరంగంగా హెచ్చ‌రించ‌డంతో ఆయ‌న భార్య మ‌న‌స్తాపం చెంది, బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చెందాల‌ని ప్ర‌య‌త్నించ‌డం క‌ల‌క‌లం రేపింది.

ఎమ్మెల్యే తీరు మొద‌టి నుంచి వివాదాస్ప‌ద‌మే. ఎన్నిక‌ల‌కు ముందు కూడా కొలిక‌పూడిని భ‌రించ‌లేమ‌ని, ఆయ‌న్ను మార్చాల‌ని చంద్ర‌బాబును వేడుకున్నా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. ఇప్పుడాయ‌న్ను ఎమ్మెల్యేగా జీర్ణించుకోలేకున్నామ‌ని, ఇష్టానురీతిలో నోరు పారేసుకుంటున్నార‌ని టీడీపీ శ్రేణులు వాపోతున్నాయి. ఆడ‌, మ‌గ అనే తేడా లేకుండా బూతులు తిడుతున్నార‌ని ల‌బోదిబోమంటున్నారు.

ఎమ్మెల్యే స్థానంలో ఇన్‌చార్జ్‌ను నియ‌మించాల్సిందే అని టీడీపీ శ్రేణులు ప‌ట్టుప‌ట్ట‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికే రెండు, మూడు సార్లు చంద్ర‌బాబు పిలిపించుకుని హెచ్చ‌రించినా , ఖాత‌రు చేయ‌న‌ట్టు తెలిసింది. ఇదే రీతిలో కొలికపూడి వ్య‌వ‌హ‌రిస్తే మాత్రం తిరువూరులో టీడీపీ నామ‌రూపాల్లేకుండా పోతుంద‌ని నేరుగా పార్టీ అధ్య‌క్షుడికే ఫిర్యాదు చేయ‌డం, ప‌రిస్థితి తీవ్ర‌త‌ను తెలియ‌జేస్తోంది. వివాదాస్ప‌ద కామెంట్స్‌తో నిత్యం వార్త‌ల్లో నిల‌వాల‌ని కొలిక‌పూడి భావిస్తుంటార‌ని సొంత పార్టీ నాయ‌కులు అంటున్నారు.

కొలిక‌పూడిపై ఫిర్యాదులు వెల్లువెత్త‌డంతో ఏం చేయాలో టీడీపీ అధిష్టానానికి దిక్కుతోచ‌డం లేదు. ఒక‌వేళ క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకున్నా, ఏదో ఒక‌టి వాగుతూ మ‌రింత న్యూసెన్స్ క్రియేట్ చేస్తాడ‌ని టీడీపీ అధిష్టానం త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతోంద‌ని స‌మాచారం. ఒక మీడియాధిప‌తి కోటాలో కొలిక‌పూడికి టికెట్ ఇచ్చిన‌ట్టు అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి. రాజ‌కీయాల‌తో ఏ మాత్రం సంబంధం లేని వాళ్ల‌కు టికెట్ ఇస్తే, ఇట్లే వుంటుంద‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

5 Replies to “టీడీపీకి త‌ల‌నొప్పిగా మారిన ఎమ్మెల్యే!”

  1. ఇన్ని క్రిమినల్పి కేసులు, రకరకాల పిర్యాదులు వచ్చిన ja*** మీద ఏమి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు? పార్టీ ని అవినాష్ హ్యాండోవర్ చేసుకుంటే బెటర్ ఏమో అని పులివెందుల ప్రజలు అనుకుంటున్నారుట !!

  2. ఆ మ్మెల్యే ఓర చూపు చూస్తేనే వికారంతో వాంతులు అవుతాయి..అల్లాంటిది లైంxగిక వేధింపులు అంటే ఇక ఒళ్ళంతా acid పెట్టి కడుక్కోవాలి.

Comments are closed.