ప‌ట్టాభిపై టీడీపీ డేగ క‌న్ను!

టీడీపీ జాతీయ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభిపై మంత్రి నారా లోకేశ్ సీరియ‌స్‌గా ఉన్నార‌ని తెలిసింది. పార్టీ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయ‌ని త‌న‌కు లోకేశ్ క‌నీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వ‌డం లేద‌ని, అలాగే…

టీడీపీ జాతీయ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభిపై మంత్రి నారా లోకేశ్ సీరియ‌స్‌గా ఉన్నార‌ని తెలిసింది. పార్టీ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయ‌ని త‌న‌కు లోకేశ్ క‌నీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వ‌డం లేద‌ని, అలాగే నామినేటెడ్ ప‌ద‌వి రాకుండా అడ్డుకుంటున్నాడ‌ని త‌మ పార్టీ నాయ‌కుల‌కు, మీడియా ప్ర‌తినిధులకు ప‌ట్టాభి ఫోన్ చేసి నిష్టూర‌మాడుతున్నారు. ఈ విష‌యం లోకేశ్ దృష్టికి వెళ్లింది.

క్షేత్ర‌స్థాయిలో ప‌ట్టాభి ప‌ని చేయ‌కుండా, నిత్యం మీడియాలో షో చేస్తూ, పార్టీకి న‌ష్టం వ‌చ్చేలా ప్ర‌త్య‌ర్థుల‌పై నోరు పారేసుకుంటున్నాడ‌ని ప‌ట్టాభిపై లోకేశ్ అస‌హ‌నంగా ఉన్నారు. ప‌ట్టాభి తీరుతో రాజ‌కీయంగా త‌మ‌కు న‌ష్ట‌మే త‌ప్ప‌, ఏ మాత్రం లాభం లేద‌నేది లోకేశ్ భావ‌న‌. అందుకే ప‌ట్టాభిని దూరం పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిసింది. లోకేశ్ అపాయింట్‌మెంట్ ఇవ్వ‌క‌పోవ‌డంపై ప‌ట్టాభి ఊరంతా దండోరా వేస్తూ, త‌న‌లాంటి వాళ్ల‌కే ప‌ల‌క‌క‌పోతే, ఇక సామాన్యుల‌తో యువ నాయ‌కుడు ఏం మాట్లాడ్తార‌నే నెగెటివ్ ప్ర‌చారం చేస్తున్నారు.

లోకేశ్‌పై ప‌ట్టాభి దుష్ప్ర‌చారం ఎక్కువ కావ‌డంతో, ఆ నోట‌, ఈ నోట లోకేశ్ చెవిన ప‌డింది. దీంతో లోకేశ్ ఫైర్ అవుతున్న‌ట్టు తెలిసింది. నామినేటెడ్ ప‌ద‌వుల‌కు సంబంధించి మొద‌టి జాబితాలో ప‌ట్టాభి పేరు లేని సంగ‌తి తెలిసిందే. దీనంత‌టికి లోకేశ్ కార‌ణ‌మ‌ని ప‌ట్టాభి, ఆయ‌న భార్య చంద‌న ఆరోప‌ణ‌.

టీడీపీ జాతీయ అధికార ప్ర‌తినిధి త‌మ అనుకూల చాన‌ల్‌లో కూచుని ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డం వెనుక‌… ప‌ట్టాభి వున్నాడ‌ని లోకేశ్ అనుమానిస్తున్నారు. ఎందుకంటే, త‌న‌తో ప‌ట్టాభి ఆవేద‌న వ్యక్తం చేశాడ‌ని, అలాగే మ‌రికొంద‌రు నాయ‌కులు కూడా మాట్లాడి బాధ‌ప‌డిన‌ట్టు జీవీరెడ్డి చెప్పిన సంగ‌తి తెలిసిందే.

ప‌ట్టాభి పైకి మాత్రం చంద్ర‌బాబు, లోకేశ్ గురించి మంచిగా మాట్లాడుతూ, లోలోప‌ల గోతులు తవ్వుతున్నార‌ని టీడీపీ పెద్ద‌లు అనుమానిస్తున్నారు. వైసీపీ హ‌యాంలో ప‌లుమార్లు దాడుల‌కు గురై, జైలుపాలు అయ్యార‌నే సానుభూతి వున్న‌ప్ప‌టికీ, వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేయ‌డం, సొంత పార్టీ నేత‌ల్ని వెనుక నుంచి రెచ్చ‌గొట్ట‌డాన్ని టీడీపీ పెద్ద‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ప‌ట్టాభిపై ఓ క‌న్నేసి ఉంచాల‌ని టీడీపీ పెద్ద‌లు ఆదేశించార‌ని తెలిసింది.

9 Replies to “ప‌ట్టాభిపై టీడీపీ డేగ క‌న్ను!”

  1. As long as Janasena is there for Kootami, reddi lafuts ekkada vunna emi teda padadu. pattabhi gaadu roju media lo sollu kottadam b**thulu matladam tappa party ki chesindi emundi. vaadiki asalu first priority enduku ivvali.

  2. What is the contribution of pattabhi and GV Reddy excepting sitting ABN with Venkat Krishna? CBN is very experienced and shrewd to release the first lost which is practical

    For that matterant many Jana Sena young spokesmen did lot of filed work in addition to be in media channels. I think Pawan is also informing the details Janasena joining to CBN. So kootami is having good coordination and need not bother about media HALCHAL

Comments are closed.