కర్మ సిద్ధాంతాన్ని నమ్మండి – పూనమ్

అంతా కర్మ సిద్ధాంతాన్ని నమ్మాలని కోరుతోంది పూనమ్ కౌర్. ఎవరైతే కర్మను నమ్ముతారో, వాళ్లు ఇతరులకు హాని చేయరని, వాళ్ల జీవితాల్ని నాశనం చేయరని చెబుతోంది. Advertisement పూనమ్ కౌర్ ఏ పోస్టు పెట్టినా…

అంతా కర్మ సిద్ధాంతాన్ని నమ్మాలని కోరుతోంది పూనమ్ కౌర్. ఎవరైతే కర్మను నమ్ముతారో, వాళ్లు ఇతరులకు హాని చేయరని, వాళ్ల జీవితాల్ని నాశనం చేయరని చెబుతోంది.

పూనమ్ కౌర్ ఏ పోస్టు పెట్టినా అందులో పరోక్షంగా చాలా అర్థాలుంటాయనే సంగతి తెలిసిందే. ఇప్పుడీ కర్మ కాన్సెప్ట్ ను కూడా ఆమె అదే కోణంలో తీసుకుందనే విషయం అర్థం అవుతోంది. కొన్ని రోజులుగా లడ్డూ ఇష్యూపై పోస్టులు పెడుతున్న పూనమ్.. మనం చేసే కర్మలే మనకు భవిష్యత్తులో ఎదురవుతాయంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించింది.

మరోవైపు తన వ్యక్తిగత జీవితంపై కూడా స్పందించింది. తను ఇప్పటివరకు ఎవ్వరి నుంచి ఎలాంటి లబ్ది పొందలేదని చెబుతోంది. తనపై రకరకాల రాతలు రాశారని, తను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి తట్టుకొని నిలబడ్డానని అంటోంది.

“నేను ఇప్పటికీ కఠినమైన ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నాను. నేను అనుభవిస్తున్న దారుణ పరిస్థితుల్ని మీరు అస్సలు ఊహించలేరు. చాలామంది ఊహించుకుంటున్నట్టు నాకు ఎలాంటి లగ్జరీల్లేవు. ఎవ్వరి నుంచి ఇప్పటివరకు ఎలాంటి లగ్జరీ నేను పొందలేదు. ఇప్పటివరకు ఒక్క లబ్జి కూడా పొందలేదు. నాపై రాసిన రాతలన్నీ నాన్సెన్స్. ఇంత జరిగినా నేను నిలబడ్డాను. ఎందుకంటే, నేనేంటో నాకు తెలుసు. తప్పు చేయలేదని నాకు తెలుసు. నేను సరైన టైమ్ లో సరైన పని చేస్తున్నాను.”

జీవితంలో సరైన వ్యక్తుల్ని ఎంపిక చేసుకోవడం కీలకం అంటోంది పూనమ్.తప్పులు చేయడం సహజమని, ఆ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని మన చుట్టూ సరైన వ్యక్తులు ఉండేలా జాగ్రత్త పడాలని సూచిస్తోంది.

మన చుట్టూ రాజకీయాలు మాట్లాడేవాళ్లు ఉంటే మనం అలానే తయారవుతామని.. అదే మన చుట్టూ ఆధ్యాత్మికత గురించి చెప్పేవాళ్లుంటే మనకు అదే భావన కలుగుతుందని అంటోంది. దర్శకుడు త్రివిక్రమ్ పై ఆమె నేరుగా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

5 Replies to “కర్మ సిద్ధాంతాన్ని నమ్మండి – పూనమ్”

  1. కర్మ ఎవరిని వదలదు కాస్త టైం పడుతుంది కర్మఫలం అనుభవించవలసిందే..

Comments are closed.