ఊహించని విధంగా సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. నిన్న రాత్రి ఆయనకు ఉన్నట్టుండి కడుపు నొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేశారు. దీంతో అభిమానులు ఆందోళన చెందారు. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్యులు ప్రకటించారు.
కడుపు నొప్పితో బాధపడుతున్న రజనీకాంత్ కు వైద్యులు సర్జరీ చేశారు. లోవర్ అబ్డామినల్ లో చిన్న స్టంట్ వేశారు. ఆపరేషన్ విజయవంతమైందని, మరో 2-3 రోజుల్లో రజనీని డిశ్చార్జ్ చేస్తామని ప్రకటించారు. ఇదే విషయాన్ని రజనీకాంత్ భార్య లత కూడా ధృవీకరించారు.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తున్నారు రజనీకాంత్. మరోవైపు వెట్టయాన్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రచారంలో కూడా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించినట్టు తెలుస్తోంది.
2016 నుంచి రజనీకాంత్ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. విక్రమసింహా షూటింగ్ టైమ్ లో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కబాలి, 2.O షూటింగ్స్ టైమ్ లో కూడా ఆయన హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఒక దశలో ఆయన పూర్తిస్థాయి చికిత్స కోసం సింగపూర్ వెళ్లి, చాలా రోజులు అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు కూలీ సినిమా టైమ్ లో ఆయన మరోసారి అనారోగ్యం పాలయ్యారు.
Call boy jobs available 9989793850
Call boy works 9989793850
vc available 9380537747