వైసీపీ నేత ఎస్వీ స‌తీష్‌రెడ్డికి కీల‌క బాధ్య‌త‌లు!

పులివెందుల వైసీపీ నేత, మండ‌లి మాజీ డిప్యూటీ చైర్మ‌న్ ఎస్వీ స‌తీష్‌రెడ్డికి ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఉమ్మ‌డి రాయ‌ల‌సీమ‌, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల వైసీపీ అనుబంధ సంఘాల…

పులివెందుల వైసీపీ నేత, మండ‌లి మాజీ డిప్యూటీ చైర్మ‌న్ ఎస్వీ స‌తీష్‌రెడ్డికి ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఉమ్మ‌డి రాయ‌ల‌సీమ‌, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల వైసీపీ అనుబంధ సంఘాల బాధ్య‌త‌ల్ని స‌తీష్‌రెడ్డికి అప్ప‌గించడం విశేషం. ఇటీవ‌ల స‌తీష్‌రెడ్డిని వైసీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మించిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా అనుబంధ విభాగాల్ని కూడా అప్ప‌గించ‌డంతో వైసీపీ శ్రేణుల్లో హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. సుదీర్ఘ కాలం పాటు పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్సార్ కుటుంబంతో స‌తీష్‌రెడ్డి రాజ‌కీయ పోరాటం చేశారు. ఈ ద‌ఫా ఎన్నిక‌ల సంద‌ర్భంలో వైసీపీలో స‌తీష్‌రెడ్డి చేరారు. ఆయ‌న‌కు పార్టీలో ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఇటీవ‌ల వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డే స్వ‌యంగా స‌తీష్‌రెడ్డికి ఫోన్ చేసి, కీలక బాధ్య‌త‌ల్ని అప్ప‌గించే విష‌య‌మై మాట్లాడిన‌ట్టు తెలిసింది. వైసీపీ అనుబంధ విభాగాల రాష్ట్ర వ్య‌వ‌హారాల్ని ఇంత వ‌ర‌కూ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి చూస్తున్నారు. ఆయ‌న బాధ్య‌త‌ల్ని త‌గ్గించి, స‌తీష్‌రెడ్డికి ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. చెవిరెడ్డికి ఒంగోలు జిల్లా బాధ్య‌త‌లు వుండ‌డంతో అనుబంధ విభాగాల్లో కొన్ని జిల్లాల‌ను వేరు చేసి స‌తీష్‌రెడ్డికి ఇచ్చిన‌ట్టు ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు.

స‌తీష్‌రెడ్డి వివాద ర‌హితుడిగా పేరు పొందారు. ఏ పార్టీలో ప‌ని చేసినా నిబ‌ద్ధ‌త‌తో వ్య‌వ‌హరిస్తార‌నే మంచి పేరు తెచ్చుకున్నారు. స‌తీష్‌రెడ్డికి బాధ్య‌త‌ల్ని అప్ప‌గించ‌డంతో వైసీపీకి రాజ‌కీయంగా ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

11 Replies to “వైసీపీ నేత ఎస్వీ స‌తీష్‌రెడ్డికి కీల‌క బాధ్య‌త‌లు!”

  1. వై చీప్ కీలక పదవుల్లో ఎవరిని పెట్టినా వాళ్ళ పేరు చివర ఆ రెండక్షరాల తోక ఉండాల్సిందేనా 11మోహన్ అన్నియ్యా..

  2. నీ హైప్ నువ్వు..’కీలక బాధ్యతలు’ ఏమున్నాయి ఎంకటి అంత కీలకంగా చేసే పనులు..

  3. పార్టి పదవులు ఇతురలకి

    ప్రబుత్వ పదువులు కాంట్రాక్ట్ లు అన్ని పెద్ది రెడ్డికి

    అన్న కు ముందు చూపు చాలా ఎక్కువ

Comments are closed.