తొలిముసలం పిఠాపురంలోనే పుడుతోందా?

సాధారణంగా అయితే కూటమి ధర్మం పాటిస్తూ.. ఈ ఎన్నికల్లో డైరక్టరు పోస్టులను కూడా రెండు పార్టీలు కలిసి పంచుకుని ఉంటే చాలా బాగుండేది.

కూటమి పార్టీల మధ్య ఐక్యత అయిదేళ్ల పాటు సుస్థిరంగా ఉంటుందా లేదా? అనే సందేహాలు ప్రజల్లో చాలానే ఉన్నాయి. ఏదో ఒకనాటికి వీరి ఐక్యతలో ముసలం పుట్టక తప్పదని, అయితే ఆ ముసలం ఎప్పుడు పుడుతుందో అని ఆలోచిస్తున్న వారు కూడా ఉన్నారు. అయితే కూటమి ఐక్యతకు ప్రమాదకరంగా పరిణమించగల తొలిముసలం.. సాక్షాత్తూ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనే పురుడుపోసుకోవడం గమనార్హం. ఇక్కడ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీలు పరస్పరం తలపడుతున్నాయి.

పిఠాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు కు అయిదు డైరక్టర్ల పోస్టులకు ప్రస్తుతం ఎన్నికలు జరగబోతున్నాయి. సాధారణంగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటుందో.. ఆ పార్టీకి చెందిన వారినే అయిదుగురు డైరక్టర్లుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేది ఆనవాయితీ. దీనికి తగినట్టుగా.. ఇప్పుడు జరగబోతున్న ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ దూరంగా ఉండిపోయింది. అయితే అధికార కూటమిలోని తెలుగుదేశం, జనసేన పార్టీలు రెండూ కూడా తమ తమ ప్యానెల్స్ గా అయిదుగురు వంతున అభ్యర్థులను డైరక్టర్ల పోస్టులకు పోటీకి దింపాయి. ఈ రెండు పార్టీల మధ్య ముఖాముఖీ పోరు జరిగే అవకాశం కనిపిస్తోంది.

అయిదు పోస్టులకు గాను మొత్తం 18 మంది నామినేషన్లు వేశారు. వీరిలో ఆరుగురు ఉపసంహరించుకోగా, 12 మంది మిగిలారు. తెలుగుదేశం, జనసేన పార్టీలు మాత్రం ఇంకా వెనక్కి తగ్గడం లేదు. జనసేన పార్టీ తరఫున రాజమండ్రి ఎంపీ తంగెళ్ల ఉదయశ్రీనివాస్ సారథ్యం వహిస్తూ అయిదుగురిని ఎంపికచేసి నామినేషన్లు వేయించారు. అదే సమయంలో తెలుగుదేశం తరఫున పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, పవన్ కారణంగా అన్యాయానికి గురై ఇప్పటిదాకా కనీసం ఎమ్మెల్సీ పదవిని కూడా పొందలేక ఎదురుచూస్తున్న వర్మ ఆధ్వర్యంలో అయిదుగురు నామినేషన్లు వేశారు.

ఈ ఇరువురి మధ్య సయోధ్య ఎప్పటికి కుదురుతుందో అర్థం కావడం లేదు. 12 మంది బరిలో ఉండడంతో అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు కూడా పూర్తయింది. 6వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఆలోగా.. కొందరు వెనక్కు తగ్గుతారా? లేదా… జనసేన టీడీపీ బలాబలాలు తేల్చుకుంటాయా తెలియదు.

సాధారణంగా అయితే కూటమి ధర్మం పాటిస్తూ.. ఈ ఎన్నికల్లో డైరక్టరు పోస్టులను కూడా రెండు పార్టీలు కలిసి పంచుకుని ఉంటే చాలా బాగుండేది. రాష్ట్రవ్యాప్తంగా వీరి ఐక్యతకు హాని లేదనే సంకేతాలు వెళ్లి ఉండేవి. కానీ.. ఈ అర్బన్ బ్యాంకు ఎన్నికలతో రెండు పార్టీల మధ్య ముసలం పుట్టినట్టే కనిపిస్తోంది.

పవన్ కల్యాణ్ కు తెలియకుండా.. ఇలాంటి వ్యవహారం జరగదని, తమ పార్టీ స్వతంత్రంగా ఎదగాలనే సంకేతాలు పంపడానికే ఆయన ఈ విధంగా చేయించి ఉండొచ్చునని పలువురు అంచనా వేస్తున్నారు.

17 Replies to “తొలిముసలం పిఠాపురంలోనే పుడుతోందా?”

  1. మెట్లు కిందనుండి పైకి కడగడం ..ఎంటి సామి

    పై నుండి రా సామి కడగడం

    నువ్వు చాలా extra లు చెస్తున్నావ్

    1. పేరు మార్చుకో నీకు ఎలాగూ చేతకాదు చేసేవాల్లకి పేర్లు జగన్ లాంటి లంజాకొడుకు 🐏 లా వున్నావ్

    2. గుడి కి మెట్ల పూజ అలాగే చేస్తారు రవిశంకర్ గారు, పై నుండి కిందకి కడగరు, క్రింద నుండి పైకి ఒక్కొక్కటీ కడిగి,అలంకరిస్తు పైకి వస్తారు

  2. నువ్వు సనాతన దర్మం మాట్లడద్దు

    మొదటి అమె ను వదిలెసి ..రెండొ అమెతొ సహజివనం

    2009 లొ ఎలెక్షన్ కొసం రెండొ అమెను పెళ్ళి చెసుకున్నావ్

    రెండొ అమెను అర్దంత్రంగా వదిలెసి మూడు అమెను చెసుకున్నావ్

    మూడు కాదు 33…. పీళ్ళిల్లు చెసుకొ అబ్యంత్రం లెదు

    చెసుకున్న విదానం కరెక్టా ? ..గర్వం ఈగొ ..నన్నెవడు ప్రశ్నిస్తాడు అని….

    మీ అన్న జగన్ కు దండం పెడితె తెగా ఫీల్ అయ్యావు ..

    మరి నువ్వు వదిలెసిన అ మహిళల పరిస్తితి ఎంటి ..వాళ్ళ ఫీలింగ్ ఎంటి..ఫీలింగ్స్ నీకెనా ?

    1. వదిలేసిన మహిళలు మీ ఇంటికి వచ్చి మోర పెట్టుకున్న్నరా. ..వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బానే బ్రతుకుతున్నారు…కానీ మనమే ఒకడిని పైకి లేపడానికి ఇంకోడి జీవితం లోకి దూరిపోతాం ఇలా

  3. రాజమండ్రి ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్…??

    ఆయన కాకినాడకు ఎంపీ రా బాబు.. రాజమండ్రి కి కాదు…

  4. వారి మాటల్లోనే…….

    వీడు ఎంత, వీడి స్థాయి ఎంత, చిటికెన వేలు మీద వెంట్రుక,.

    అసలు వీడి రీడర్షిప్, వ్యూయర్షిప్ ఎంత? వీడి ఆర్టికల్ వల్ల ఎంత ప్రభావం ఉంది, ఏదో టైంపాస్ వెబ్ ఎడిషన్, ఇలాంటి వాటికి ప్రభావితం అయ్యే మనుషులు, ఎవరు లేరు, అందులోనూ వర్మ ఎక్కడ ఎలా నడుచుకోవాలో తెలిసిన వ్యక్తి, మధ్యలో ఎవడో ఒకడు దూరి ఏదో రాస్తే నిజం అనుకునే వారు లేరు

  5. ఎప్పుడు ఎవరు కొట్టుకొంటారో అని సాక్షి పేపర్ కీ నీకు ఆసక్తి

    ఇలాంటి న్యూస్ మీకు మాత్రమే సాధ్యం

Comments are closed.