ఓజీ మీద దేవర ఎఫెక్ట్

ఓజీ సినిమాకు నిర్మాత దానయ్య కొత్త రేట్లు చెబుతున్నట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 150 కోట్లు కోట్ చేస్తున్నట్లు బోగట్టా.

ఓజీ.. పవన్ కళ్యాణ్- సుజిత్ కాంబినేషన్ సినిమా, డివివి దానయ్య నిర్మించే ఈ సినిమా మీద విపరీతమైన బజ్‌ వుంది. పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక్క ఇరవై రోజులు డేట్స్ ఇస్తే ఈ సినిమా పూర్తయిపోతుంది. ప్రస్తుతం హరి హర వీరమల్లుకు ఓ పది రోజులు డేట్ లు ఇచ్చారు. త్వరలో ఓజీకి కూడా ఇస్తారని తెలుస్తోంది. ఎప్పటికి పూర్తవుతుందో.. ఎప్పుడు విడుదల చేస్తారో అన్నది పక్కన పెడితే ఈ సినిమాకు వున్న క్రేజ్ మేరకు బిజినెస్ అంకెలు కూడా వున్నాయి.

నిన్న మొన్నటి వరకు ఓజీ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల హక్కుల రేటు నిర్మాత దానయ్య 110 కోట్ల వరకు చెబుతూ వచ్చారని తెలుస్తోంది. దేవర సినిమా రెండు రాష్ట్రాల హక్కులు 120 కోట్లకు అమ్మిన సంగతి ఇక్కడ గమనించాలి. ఇప్పుడు దేవర విడుదలయింది. ఒక్క నైజాంలోనేె 40 కోట్ల వరకు కేవలం మూడు రోజుల్లో వసూలు చేసిందని యూనిట్ ప్రకటించింది. విశాఖ ఏరియాకు 12 కోట్ల వరకు వసూలు చేసిందని ప్రకటించారు. అంటే మూడు రోజుల్లోనే ఈ నెంబర్లు అంటే మొత్తం వసూళ్లు ఏ మేరకు వుంటాయి. నైజాం అరవై కోట్లు దాటుతుందేమో? ఏపీ కూడా 60 నుంచి 70 కోట్లు వుంటుందేమో.

అందుకే ఓజీ సినిమాకు నిర్మాత దానయ్య కొత్త రేట్లు చెబుతున్నట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 150 కోట్లు కోట్ చేస్తున్నట్లు బోగట్టా. పవన్ కళ్యాణ్, జ‌నసేన, కూటమి, సుజిత్ కాంబినేషన్ క్రేజ్‌ ఇవన్నీ కలిసి సినిమాను దేవర కన్నా పెద్ద హిట్ చేస్తాయని, అందువల్ల 150 కోట్ల వసూళ్లు చాలా ఈజీ అని నిర్మాత దానయ్య బలంగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. కానీ దేవర రెండు రాష్ట్రాల హక్కులు 120 అంటేనే చాలా మంది షాక్ అయ్యారు. ఇప్పుడు ఓజీ 150 అంటే ఇంకెంత షాక్ అవుతారో?

5 Replies to “ఓజీ మీద దేవర ఎఫెక్ట్”

      1. Ento kamma ga den.ginchu.kuno edhi evari M tho, prapanchaniki antha telusu. Hey Madhava hey Govindha, DNA tho evaridhi match avutundho evaru evaridhi M kudustuntaru cheppa. Ra

Comments are closed.