సినిమా నిర్మాణాలకు ఓటీటీ కోత!

టాలీవుడ్ లో సినిమా నిర్మాణాలు రికార్డు స్థాయిలో జ‌రుగుతుంటాయి. శాటిలైట్ సీజ‌న్, హిందీ డబ్బింగ్ మార్కెట్ సీజ‌న్ తరువాత ఓటీటీ వచ్చింది. ఓటీటీ వచ్చిన కొత్తలో కూడా విపరీతంగా ప్రొడక్షన్ లు పెరిగాయి. కానీ…

టాలీవుడ్ లో సినిమా నిర్మాణాలు రికార్డు స్థాయిలో జ‌రుగుతుంటాయి. శాటిలైట్ సీజ‌న్, హిందీ డబ్బింగ్ మార్కెట్ సీజ‌న్ తరువాత ఓటీటీ వచ్చింది. ఓటీటీ వచ్చిన కొత్తలో కూడా విపరీతంగా ప్రొడక్షన్ లు పెరిగాయి. కానీ ఈ సంబరం ఎంతో కాలం నిలబడలేదు. ఓటీటీ సంస్థలు పన్నే కార్పొరేట్ మాయాజాలంలో తెలుగు ఇండస్ట్రీ ఇరుక్కుపోయింది. శాటిలైట్ అదాయం పడిపోయింది ఓటీటీ కారణంగానే. ఇక మిగిలింది హిందీ డబ్బింగ్. అది కూడా ఈ మధ్య తగ్గింది. మరోపక్క సినిమా నిర్మాణ వ్యయం బాగా పెరిగిపోయింది. నాన్ థియేటర్ అదాయం చూసి హీరోలు రెమ్యూనిరేషన్లు పెంచేసారు. దీని వల్ల తప్పనిసరిగా ఓటీటీ మీద అధారపడాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇప్పుడు మెలమెల్లగా ఓటీటీ సంస్థలు తమ వలను బిగిస్తున్నాయి. అన్నీ కలిపి అయిదారు ఓటీటీ సంస్థలు మాత్రమే వున్నాయి. అన్నింటికి కలిపి ఏడాదికి మహా అయితే వంద సినిమాల లోపే కావాలి. మన దగ్గర 150 సినిమాల వరకు తయారవుతాయి. మరి మిగిలిన వాటి పరిస్థితి ఏమిటి? ఓక్కో ఓటీటీ సంస్థతో ఒక్కో మోస్ట్ హ్యాపనింగ్ బ్యానర్లు అన్నీ ఒక్కొ ఓటీటీ సంస్థతో సంబంధాలు ఏర్పరుచుకున్నాయి. ఈ సంస్థలు ఏ కాంబినేషన్ తో సినిమా సెట్ చేసుకున్నా రోజుల్లో ఓటీటీ డీల్ అయిపోతుంది. మిగిలిన వాటికి అలా కుద‌ర‌దు.

ఇదంతా నిన్న మొన్నటి వరకు పరిస్థితి. ఇప్పుడు అలాంటి మోస్ట్ హ్యాపనింగ్ సంస్థలకు కూడా ఓటీటీ సంస్థలు అంక్షలు పెడుతున్నట్లు తెలుస్తున్నాయి. ఏడాదికి నాలుగయిదు సినిమాలకు మించి తీసుకోలేమనే సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ మోస్ట్ హ్యాపనింగ్ ప్రొడక్షన్ హవుస్ ల దగ్గర ఇప్పుడు డజ‌ను వరకు దర్శకులు రెడీగా వుంటున్నారు. అది మైత్రీ కావచ్చు, సితార, హారిక హాసిని కావచ్చు, దిల్ రాజు కావచ్చు. నాన్ థియేటర్ భరోసా వుంటే ఒకేసారి అరడజ‌ను ప్రాజెక్ట్ లు సెట్ మీదకు తీసుకెళ్ల గల సత్తా వుంది వీళ్లందరికీ.

కానీ అలాంటి భరోసా లేనపుడు, విడుదల స్లాట్ లు కూడా ఓటీటీ నిర్ణయాల మీద అధారపడినపుడు సినిమాలు తీసి ఏం చేయాలి. అందుకే తమ దగ్గర వున్న దర్శకులు, కాంబినేషన్లలో క్రేజీ వాటిని గ్రేడింగ్ చేసి, మిగిలినవి బెంచ్ మీద వుంచుతున్నారు. వచ్చే ఏడాదికి ఓటీటీల వ్యవహారం ఇంకెలా మారుతుందో తెలియదు. ఓటీటీ లేకుండా సినిమాను విడుదల చేయగల ప్లానింగ్, సత్తా లేకుంటే ఇబ్బందే.

దిల్ రాజు- అనిల్ రావిపూడి- వెంకటేష్ సినిమాను వీలయినంత బడ్జెట్ ప్లానింగ్ తో తీసి, ఓటీటీ మినహా మిగిలిన అదాయంతో బ్రేక్ ఈవెన్ సాధించి, విడుదల చేయాలనే ప్రయత్నంలో వున్నారు. ఓటీటీ అయితే ఓకె. లేదన్నా ఓకె. ఇలాంటి ప్రయోగం చేయగలిగే సత్తా, సబ్జెక్ట్ మీద నమ్మకం వున్నపుడు ఓటీటీ సంస్థల అటలు కడతాయి. లేదంటే ఓటీటీ కట్టకు టాలీవుడ్ కట్టుబడాల్సి వస్తుంది.

6 Replies to “సినిమా నిర్మాణాలకు ఓటీటీ కోత!”

  1. వీళ్లు ఎన్ని ప్లాన్లు, ఎన్ని ప్రయోగాలు చేసినా మేం థియేటర్లో చూడం,

    మేం ఓటిటిలోనే చూస్తాం

    1. 3bhk, 2.5 bhk and 4bhk apartment owners/tenants aithe, intlo nee 80k rupees petti home theatre cheyinchukuntunnaru…konni families last 4 years theatre ki vacchindi only Kalki film ki

Comments are closed.