బాబు గారూ..! నింద రాకూడదంటే ఇలా చేయాలి!!

చంద్రబాబు నాయుడు సర్కారు కొత్త మద్యం విధానాన్ని తీసుకువచ్చింది. ఈనెల 12 నుంచి కొత్త విధానం ప్రకారం మద్యం షాపులు ప్రారంభం కానున్నాయి. 11వ తేదీన టెండర్లను తెరిచి ఖరారు చేస్తారు. అయితే జగన్…

చంద్రబాబు నాయుడు సర్కారు కొత్త మద్యం విధానాన్ని తీసుకువచ్చింది. ఈనెల 12 నుంచి కొత్త విధానం ప్రకారం మద్యం షాపులు ప్రారంభం కానున్నాయి. 11వ తేదీన టెండర్లను తెరిచి ఖరారు చేస్తారు. అయితే జగన్ సర్కారు నడిపిన విధానంలో కాకుండా.. లిక్కర్ షాపులను ప్రెవేటు వ్యక్తులకు అప్పగించాలని చంద్రబాబు ప్రభుత్వపు కొత్త పాలసీలో నిర్ణయించారు.

ఇలా ప్రెవేటు వ్యక్తులకు లిక్కర్ షాపులను అప్పగించడం అంటే.. అధికార పార్టీ వారికే అవన్నీ దక్కుతాయనే అనుమానం ప్రజలకు వస్తుంది. అయినవారికి దోచిపెట్టడానికే ఇలాంటి విధానం తీసుకువస్తున్నారని అంతా అంటారు. అయితే ఇలాంటి నింద పడకుండా ఉండాలంటే.. చంద్రబాబు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

లిక్కర్ వ్యాపారంలో లాభాల మార్జిన్ విపరీతంగా ఉంటుంది గనుకనే.. అదంతా ప్రెవేటు వ్యక్తుల పాలు కాకుండా ఉండడానికి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. లిక్కర్ షాపులన్నింటినీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించే వ్యవస్థను తీసుకువచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగాల రూపంలో పలువురికి ఉపాధి కల్పించారు. ఏతావతా.. ప్రభుత్వానికి ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ఈ రకంగా వ్యాపారాన్ని ప్రభుత్వం కిందికే తీసుకురావడం వల్ల ప్రభుత్వానికి లాభమే తప్ప న‌ష్ట‌మేమి లేదు.

అయితే, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ప్రతి నిర్ణయమూ తప్పుడు నిర్ణయమే అని ప్రచారం చేయడంలో మాత్రమే తన ప్రభుత్వం మనుగడ ఉంటుందని నమ్ముతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వ రంగంలో లిక్కర్ షాపులను కూడా ప్రెవేటీకరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వారికి దోచిపెట్టడానికి ఇది ఒక దగ్గరి మార్గంగా ఎంచుకుంటారనడంలో సందేహం లేదు. నిజానికి పార్టీ వాళ్లు సంపాదించుకోకపోతే ఎలా? అని కూడా వారు వాదించవచ్చు. కానీ.. ఒక్క పని చేయకపోతే ప్రభుత్వం నిందలు భరించాల్సి వస్తుంది.

కొత్త మద్యం విధానంలో షాపుల నుంచి తీసుకునే ఫీజుల మొత్తం.. జగన్ ప్రభుత్వ హయాంలో వస్తుండిన నెలసరి ఆదాయం కంటె ఎక్కువగా ఉంటే చాలు. చంద్ర సర్కారు ఎవరికి ఎంత దోచిపెట్టినా జనం పెద్దగా పట్టించుకోరు. ప్రభుత్వాదాయానికి గండిపడలేదు కాబట్టి.. విధానాన్ని హర్షిస్తారు. పైగా లిక్కర్ వ్యాపారంలో ప్రతి ఏటా సాధారణంగా అమ్మకాలు పెరుగుతూ ఉంటాయి. ఆ అంచనాతోనే.. ప్రభుత్వం కూడా తాము నిర్ణయించిన ఫీజులను ఏటా పది శాతం పెంచేలా విధానం రూపొందించింది.

ఈ ప్రకారం చూసినప్పుడు.. గత ఏడాది నవంబరులో రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ వ్యాపారం ద్వారా ఎంత ఆదాయం ప్రభుత్వానికి లభించిందో.. ఈ ఏడాది నవంబరు వాటా ఫీజుల మొత్తం అంతకంటె ఎక్కువగా ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వం చిత్తశుద్ధితో కొత్త విధాన రూపకల్పన చేసిందని అనుకోగలం. లేనిపక్షంలో కేవలం కార్యకర్తలు దోచుకోవడం కోసమే ఈ విధానం అనే నింద వారికి తప్పదు.

15 Replies to “బాబు గారూ..! నింద రాకూడదంటే ఇలా చేయాలి!!”

    1. మీ వాడికి కొద్దిగా తాగించు, పిచ్చ పిచ్చగా మాట్లాడుతున్నాడు, పిచ్ఛ తగ్గుద్ది

  1. వరద బాధితులని ఆదుకోలేక EVM ప్రభుత్వం చేతులెత్తేసింది !!

    బాధితుల్ని ఆదుకోవాలి అంటే మనసు ఉండాలి.

    ఈ ప్రభుత్వం దోపిడీ కోసమే ఉంటుంది.

    6 లక్షల వరద బాధితుల్ని ఆదుకోలేని ఈయన ని సిగ్గు లేకుండా Administrator & Visionary అంటాం.

    నిన్నటి వరకు ఉన్న Search Option ఈ రోజు తీసేసింది.

    సహాయం అందిందా లేదా అని , అసలు బాధితులుగా register అయ్యామా లేదా అనేది చూసుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేసింది ఈ దుర్మార్గపు ప్రభుత్వం.

    Volunteer లు ఉంటే ఇంటి ఇంటికి తెచ్చిన ఇచ్చిన సాయం ఎక్కడ నుంచి కలెక్టర్ ఆఫీసు కి వెళ్లి పడిగాపులు కాసినా దొరకని సాయం.

    ఇది జగన్ ప్రభుత్వానికి & EVM ప్రభుత్వానికి ఉన్న తేడా

    నిన్నటి screeshot ఇది. ఈ రోజు లేదు.

    ఈ రోజు ఉన్న screen మీరే చూడండి.

    vipatthunirdharana.apssdc.in

  2. నీ నీలి పేపర్ బాబు గారు చదవరు , సో బెటర్ వెళ్లి జగన్ కి 11 నుంచి కనీసం 12 పైన 18 లోపు సీట్స్ ఎలా వస్తాయి అనేది ట్రై చేయి ఒకే నా

  3. “లిక్కర్ వ్యాపారంలో లాభాల మార్జిన్ విపరీతంగా ఉంటుంది గనుకనే.”..is that why Jagan allowed only cash in the fake guise of govt taking over instead of private…

    wah wah..what a fake build up GA..extra payment

Comments are closed.