మరో 4 రోజుల్లో నటి నాలుగో పెళ్లి?

పెళ్లిళ్లు, పెటాకులకు కేరాఫ్ అడ్రస్ గా మారిన వనిత విజయ్ కుమార్ నాలుగో పెళ్లికి రెడీ అవుతోందా? అవుననే అంటున్నారు చాలామంది. ఈ మేరకు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ ఫొటో, ఈ…

పెళ్లిళ్లు, పెటాకులకు కేరాఫ్ అడ్రస్ గా మారిన వనిత విజయ్ కుమార్ నాలుగో పెళ్లికి రెడీ అవుతోందా? అవుననే అంటున్నారు చాలామంది. ఈ మేరకు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ ఫొటో, ఈ అనుమానాలకు మరింత తావిస్తోంది. ఇదే కనుక నిజమైతే, జీవితంలో వనిత విజయ్ కుమార్ కు ఇది నాలుగో పెళ్లి.

మొదట ఆమె నటుడు ఆకాష్ ను పెళ్లి చేసుకుంది. ఐదేళ్ల వైవాహిక బంధంలో ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. ఆ బంధం వీగిపోయింది. ఆ తర్వాత ఆనంద్ జయదర్శన్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడింది. ఇతడితో కూడా ఐదేళ్లు కాపురం చేసి విడిపోయింది.

ఆ తర్వాత ఫొటోగ్రాఫర్ పీటర్ పాల్ ను పెళ్లాడింది. 2020 జూన్ లో ఘనంగా పెళ్లి చేసుకుంది ఈ జంట. అయితే హనీమూన్ నుంచే వీళ్ల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయి. పీటర్ పాల్ పచ్చి తాగుబోతు అనే విషయాన్ని దాచిపెట్టాడని వనిత ఆరోపించింది. హనీమూన్ టైమ్ తో గోవాలో తెగ తాగాడని, చెన్నై వచ్చేవరకు తాగుతూనే ఉన్నాని, ఇంట్లోకి తీసుకురావడానికి మనుషులు కావాల్సి వచ్చిందని వాపోయింది.ఆ వెంటనే పీటర్ కు దూరమైంది.

అలా 3 పెళ్లిళ్లు పెటాకులు అవ్వడంతో జీవితంలో తోడు లేకుండా పోయింది. ఇన్నాళ్లకు వనిత విజయ్ కుమార్ కు తోడు దొరికినట్టు తెలుస్తోంది. అతడి పేరు రాబర్ట్. కోలీవుడ్ లో కొరియోగ్రాఫర్. గమ్మత్తైన విషయం ఏంటంటే.. పీటర్ పాల్ తో పెళ్లికి ముందు రాబర్ట్ తో వనిత డేటింగ్ లో ఉన్నట్టు ప్రచారం జరిగింది. కానీ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తూ, పీటర్ ను పెళ్లి చేసుకుంది.

మళ్లీ ఇన్నాళ్లకు రాబర్ట్ తెరపైకొచ్చాడు. 43 ఏళ్ల వనిత-రాబర్ట్ పెళ్లి చేసుకుంటారనే పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే మరికొంతమంది మాత్రం దీన్నొక పబ్లిసిటీ స్టంట్ గా కొట్టి పారేస్తున్నారు.

ఎందుకంటే.. వనిత-రాబర్ట్ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. దాని పేరు మిస్టర్ అండ్ మిసెస్. ఈ సినిమాతోనే వనిత పెద్ద కూతురు జోవిక కూడా తెరకు పరిచయమౌతుందనే ప్రచారం సాగుతోంది. ఈ సినిమా ప్రచారం కోసమే “సేవ్ ది డేట్ – అక్టోబర్ 5” అనే క్యాప్షన్ తో పోస్టర్ రిలీజ్ చేసి ఉంటారని కొందరు అనుమానిస్తున్నారు.

20 Replies to “మరో 4 రోజుల్లో నటి నాలుగో పెళ్లి?”

Comments are closed.