ఆశావహులకు షాక్: బ్రహ్మోత్సవాల్లోగా బోర్డు లేనట్లే!

తిరుమల తిరుపతి దేవస్థానాలకు ధర్మకర్తల మండలి యోగం లేకుండానే.. ఈ ఏడాది స్వామివారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. నామినేటెడ్ పదవులు ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు మీన మేషాలు లెక్కిస్తూ ఉండే ధోరణి కారణంగా…

తిరుమల తిరుపతి దేవస్థానాలకు ధర్మకర్తల మండలి యోగం లేకుండానే.. ఈ ఏడాది స్వామివారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. నామినేటెడ్ పదవులు ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు మీన మేషాలు లెక్కిస్తూ ఉండే ధోరణి కారణంగా ఈ పరిస్థితి తలెత్తుతోంది. అధికారంలోకి వచ్చి 110 రోజులు గడచినప్పటికీ కూడా.. ఇంకా టీటీడీకి బోర్డు నియమించడంలో బాబు సర్కారు ప్రదర్శిస్తున్న అలసత్వం ఫలితం ఇది. చంద్రబాబు నాయుడు తీరు మీద ఆయన సొంత పార్టీ నాయకులే గుర్రుమంటున్నారు. పనిచేసిన వారికి పదవులు ఇవ్వాలంటే కూడా చంద్రబాబుకు మనసు ఒప్పదని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రభుత్వం ఇవ్వగల అతిపెద్ద నామినేటెడ్ పదవి తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి అధ్యక్ష స్థానం. ఈ పదవి దక్కడం అనేది మంత్రి పదవికంటే కీలకమైనదిగా ఆధ్యాత్మకి ఆసక్తి ఉన్న రాజకీయ నాయకులు భావిస్తారు. ఛైర్మన్ పదవి మాత్రమే కాదు.., టీటీడీ బోర్డు సభ్యత్వాన్ని కూడా మంత్రి పదవితో సమానంగా భావిస్తారు. అందుకే టీటీడీబోర్డు పదవులకు అంత గిరాకీ ఉంటుంది. సహజంగానే ఈ సారి కూడా సీఎం చంద్రబాబు నాయుడు మీద ఈ పదవి కోసం తీవ్రమైన ఒత్తిడి ఉంది. టీవీ5 ఛానెల్ అధినేత బిఆర్ నాయుడుకు టీటీడీ బోర్డు పదవి కట్టబెడతారనే ప్రచారం చాలా రోజులుగా ఉంది. అయితే నిర్ణయం మాత్రం బయటకు రాలేదు.

నామినేటెడ్ పోస్టులు ఇవ్వడానికి మీనమేషాలు లెక్కిస్తూ ఏళ్లూపూళ్లూ గడిపేయడం అనేది చంద్రబాబునాయుడుకు అలవాటే అని తెలుగుదేశం పార్టీ వర్గాలు గుర్రుమంటున్నాయి. జగన్ హయాంలో పరిస్థితి ఇలా ఉండేది కాదు. జగన్ సీఎం అయిన వెంటనే బాబాయి వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ ఛైర్మన్ గా నియమించేశారు. ఆ తర్వాత కొంత వ్యవధి తీసుకుని బోర్డు మొత్తం భర్తీ చేశారు.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం రోజుల వ్యవధిలో కీలకస్థానాల్లో ఉండే ఐఏఎస్ అధికారులందరినీ మార్చేసి తనకు కావాల్సిన వారిని ఆ స్థానాల్లో నియమించుకున్నారు. అంటే ఆ పని గురించి ఫలితాలకు ముందే కసరత్తు పూర్తి చేసుకుని ఉన్నారన్నమాట. అలాంటిది.. టీటీడీ లాంటి కీలక నామినేటెడ్ పదవుల గురించి ఆలోచన చేయకుండా.. పార్టీకోసం కష్టపడిన త్యాగాలు చేసిన వారిని నిరాశకు గురిచేస్తుంటే ఎలా అనే వాదన కూడా వినిపిస్తోంది.

4వ తేదీన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఆల్రెడీ 110 రోజులు గడిచాయి. ఇప్పటిదాకా నామినేటెడ్ పోస్టుల గురించి పట్టించుకోలేదు. కనీసం బ్రహ్మోత్సవాలు మొదలయ్యేలోగా టీటీడీ బోర్డు ఏర్పాటుచేస్తారని అంతా అనుకున్నారు. ఆశావహులు ఎదురుచూస్తున్నారు. అయినా చంద్రబాబు పోకడ చూస్తే అసలు బోర్డును వేసే వాతావరణం కనిపించడంలేదు. అందుకే బాబు తీరుపై అలసత్వంపై పార్టీ శ్రేణులు గుర్రుమంటున్నాయి.

11 Replies to “ఆశావహులకు షాక్: బ్రహ్మోత్సవాల్లోగా బోర్డు లేనట్లే!”

  1. ఆలా అర్హత ని చూడకుండా ఆశావహులు అందరికి పప్పు బెల్లాలు లా పదవులు పంచినందుకే ఇప్పుడు పాలస్ లో ఈగలు తోలుకో వలసి వస్తుంది…

  2. వీకెండ్ సెలవును సండే (ఆదివారము )నుంచి ఫ్రైడే (శుక్రవారంకి ) మార్చాలి .

    మన దేశంలో ఆదివారం సెలవు ఇది బ్రిటిష్ వారి కాలంలో క్రైస్తవ సమాజం సెలవు దినంగా పాటిస్తున్నారు ..300 ఏళ్లుగా ఇది జరుగుతుంది ..దీని వలన క్రైస్తవ సమాజానికి మాత్రమే ఉపయోగం .భారత దేశం హిందువు సమాజం మనం ఎందుకు ఆదివారం సెలవు దినం పాటించాలి .!

  3. వీకెండ్ సెలవును సండే (ఆదివారము )నుంచి ఫ్రైడే (శుక్రవారంకి ) మార్చాలి .

    మన దేశంలో ఆదివారం సెలవు ఇది బ్రిటిష్ వారి కాలంలో క్రై స్త వ సమాజం సెలవు దినంగా పాటిస్తున్నారు ..300 ఏళ్లుగా ఇది జరుగుతుంది ..దీని వలన క్రై స్త వ సమాజానికి మాత్రమే ఉపయోగం .భారత దేశం హిందు సమాజం మనం ఎందుకు ఆదివారం సెలవు దినం పాటించాలి .!

  4. వీకెండ్ సెలవును సండే (ఆదివారము )నుంచి ఫ్రైడే (శుక్రవారంకి ) మార్చాలి .

    మన దేశంలో ఆదివారం సెలవు ఇది బ్రిటిష్ వారి కాలంలో క్రై స్త వ స మా జం సెలవు దినంగా పాటిస్తున్నారు ..300 ఏళ్లుగా ఇది జరుగుతుంది ..దీని వలన క్రై స్త వ స మా జా ని కి మాత్రమే ఉపయోగం .భారత దేశం హిం దు వు స మా జం మనం ఎందుకు ఆదివారం సెలవు దినం పాటించాలి .

  5. వీకెండ్ సెలవును ఆదివారము నుంచి శుక్రవారంకి మార్చాలి .

    మన దేశంలో ఆదివారం సెలవు ఇది బ్రిటిష్ వారి కాలంలో క్రై*స్త*వ స మా జం సెలవు దినంగా పాటిస్తున్నారు ..దీని వలన క్రై స్త వ స మా జా ని కి మాత్రమే ఉపయోగం .భారతదేశం హిం దు స మా జం మనం ఎందుకు ఆ ది వారం సెలవు దినం పాటించాలి

Comments are closed.