జైలర్ బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో అంతా రజనీకాంత్ నుంచి మరో జైలర్ ఆశిస్తున్నారు. ఆ సినిమా తర్వాత వచ్చిన లాల్ సలామ్ మూవీ అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయినప్పటికీ రజనీ రాబోయే చిత్రం వేట్టయన్-ది హంటర్ పై అంచనాలున్నాయి.
దీనికి కారణం లాల్ సలామ్ సినిమా పూర్తిస్థాయిలో రజనీకాంత్ సినిమా కాదు. ఇక రెండో కారణం జైలర్ తర్వాత రజనీకాంత్ మరోసారి పోలీస్ గెటప్ లో చేసిన సినిమా వెట్టయన్. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన ఓ పాట పెద్ద హిట్టయింది. ఇప్పుడు ట్రయిలర్ వచ్చి, సినిమాపై అంచనాల్ని ఇంకాస్త పెంచింది.
వేట్టయాన్ సినిమాలో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపిస్తున్నారు రజనీకాంత్. ఎప్పట్లానే సినిమాలో ఆయన స్టయిల్, యాక్షన్ ఉన్నాయి. కాకపోతే ఇది టీజే జ్ఞానవేల్ సినిమా. పూర్తిగా రజనీకాంత్ స్టార్ డమ్ పై ఆధారపడి తీసిన సినిమా కాదిది. కంటెంట్ ఉన్న సినిమాగా కనిపిస్తోంది ట్రయిలర్ చూస్తుంటే.
“వారంలో ఎన్‌కౌంటర్ జరిగిపోవాలని రావు రమేష్ అంటే, అక్కర్లేదు సార్, మూడే రోజుల్లో డిపార్ట్ మెంట్‌కి మంచి పేరొస్తుంది” అంటూ చెప్పిన డైలాగ్, “నన్ను ఏ పోస్టులో తిప్పికొట్టినా నేను మాత్రం పోలీస్ వాడినే సార్, నా నుంచి వాడిని కాపాడటం ఎవరి వల్లా కాదు” లాంటి రజనీ మార్క్ డైలాగ్స్ కనిపిస్తున్నప్పటికీ.. మొత్తంగా ట్రయిలర్ చూస్తే, సినిమాలో విషయం చాలానే ఉందనే విషయం అర్థమౌతోంది.
అమితాబ్ బచ్చన్, రానా, ఫహాజ్ ఫాజిల్ లాంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న వేట్టయన్ సినిమా దసరా కానుకగా 10న థియేటర్లలోకి వస్తోంది. జైలర్ తర్వాత రజనీ నుంచి వస్తున్న ఫుల్ లెంగ్త్ మూవీ ఇదే. అందుకే ఇది మరో జైలర్ అవుతుందనే అంచనాలున్నాయి.
So this is a weak police story who can’t solve the cases, present the accused to the court and make them punishment by law, but instead who encounters people and gets projected as a hero?
ఆ ఆరవ వాళ్లనేగా పెట్టుకుంటుంది తెలుగు హీరోలు రేపు రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ తీస్తుంది ఆరవ వాళ్ళేగా అప్పుడు రాదా ఆరవ వాసన
Ntr దేవర పాటలు ఆరవ వాసన రావటం లేదా
vc estanu 9380537747
అన్ని సినిమాలు ఒకేలా ఉండవు
Call boy jobs available 9989793850
ఐనా థియేటర్లో చూడం
ఐతే మూసుకుని ఇంట్లో అంట్లు తోముకో
ఎగబడి చూసే వాళ్ళు కోట్లల్లో వున్నారు రజనీకాంత్ కు