సూపర్ సిక్స్ ఊసెత్తకుండా గిమ్మిక్కులన్నీ వృథా!

రాజకీయాల్లో 44 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఒక చిన్న లాజిక్ మిస్సవుతున్నారు.

రాజకీయాల్లో 44 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఒక చిన్న లాజిక్ మిస్సవుతున్నారు. తమ ప్రత్యర్ధి ప్రధానంగా ఏ విమర్శతో తమను ఉక్కిరి బిక్కిరి చేయడానికి ప్రయత్నిస్తున్నారో.. ఆ విషయంలో వారికి నోటమాటరాకుండా చేయాలి! ప్రత్యర్థులు ప్రధానంగా డిపెండ్ అవుతున్న ఆరోపణకు అవకాశం లేకుండా చేస్తే.. సగం విజయం దక్కినట్టే. ఆ పాయింట్ ను చంద్రబాబు మర్చిపోయినట్టున్నారు.

ఈ ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు ప్రధానంగా ఇచ్చిన హామీల్లో ‘సూపర్ సిక్స్ హామీలు’ కీలకమైనవి. గెలిచి అధికారంలోకి వచ్చి 110 రోజులు దాటిపోయాయి. చంద్రబాబు నాయుడు దాటి వచ్చిన రోజుల లెక్క బాగానే చెబుతున్నారు. కానీ, తమ సూపర్ సిక్స్ హామీలను నిలబెట్టుకోవడం గురించి మాత్రం పెదవి విప్పడం లేదు. ఇదిగో అదిగో అంటున్నారు. సూపర్ సిక్స్ నెరవేర్చకపోవడం గురించి వైఎస్సార్ కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తున్నప్పటికీ.. చంద్రబాబు స్పందించడం లేదు. ఆమేరకు ప్రభుత్వానికి నష్టం జరుగుతుందనే సంగతి పట్టించుకోవడం లేదు.

సూపర్ సిక్స్ పేరుతో గత ఎన్నికలకు దాదాపు ఏడాది ముందుగానే చంద్రబాబు నాయుడు కొన్ని జనాకర్షక హామీలను ప్రకటించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణావకాశం కల్పిస్తానన్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు కూడా రూ.1500 ప్రతినెలా చెల్లిస్తాం అని కూడా అన్నారు. ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం అని అన్నారు. .. ఇలాంటివి ఉన్నాయి. అయితే కార్యరూపంలోకి మాత్రం రాలేదు.

తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ఎన్నికలకు మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ హామీ ఇచ్చారు గానీ.. అధికారంలోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే అమలు చేసేశారు. ఆ మాటకొస్తే రేవంత్ రెడ్డి సర్కారు మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణావకాశం కల్పిస్తున్నారు.

చంద్రబాబు అంత గొప్ప హామీ కూడా ఇవ్వలేదు. మహిళలకు వారి జిల్లాలో మాత్రమే ఉచిత ప్రయాణం కల్పిస్తాం అన్నారు. ఇప్పటిదాకా దానికి అతీగతీలేదు. పాపం ఆర్టీసీ మంత్రి అధికారంలోకి వచ్చిన నాటినుంచి.. మీడియా ఎదుటకు వచ్చిన ప్రతిసారీ.. త్వరలోనే ఉచిత ప్రయాణం అనే పాట పాడుతున్నారు గానీ.. కార్యరూపం దాల్చడం లేదు.

మహిళలకు రూ.1500 చెల్లింపు గురించి అసలు ప్రభుత్వ పెద్దలు మాట్లాడడం లేదు. చాలా స్ట్రాటెజిక్ గా చంద్రబాబు మహిళలను వంచించినట్లుగా విమర్శలు వస్తున్నాయి. ఒక్క గ్యాస్ సిలిండర్ల విషయంలో మాత్రం ఇన్నాళ్లు మిన్నకుండిపోయి.. ఇప్పుడు దీపావళి నుంచి ఇస్తాం అంటూ చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

మరోవైపు చెత్త పన్ను రద్దు వంటి చిల్లర పనులతో ప్రజలను డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల అమలుపై జగన్ క్రియాశీలంగా గట్టి పోరాటం జరిపినట్లయితే.. చంద్రబాబు ప్రభుత్వ అసమర్థత బండారం బయటపడుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

44 Replies to “సూపర్ సిక్స్ ఊసెత్తకుండా గిమ్మిక్కులన్నీ వృథా!”

    1. ye ra lk 1000 cr scam ani rati chi lo vesi court ki emo 10rs note ani , last ki party funds echina bank accounts emmanttu

      deeni gurunche ye ga matlada dedi

  1. How can you bring this up GA as Kootami is working very hard to divert people’s attention from super six by diverting them with laddoo, declaration and sanathana dharmam.

    1. People voted to kootami as they were fed up with Jagan’s rule not for super six alone… Anna boasted that 99% of the promises has been fulfilled then why did he lose

  2. నవరత్నాలు అని గత 5 ఏళ్ళల్లో ఒక్కటి ఇవ్వలేదు , అది గాక అప్పుచేసి పేదవాడి మీద పన్నులేసి జగన్ రెడ్డి పాలస్ లు కట్టుకున్నాడు ముందు ఆ సంగతి తెలిస్తే అన్ని పథకాలకు డబ్బు వస్తది

  3. Thoo veedi bo..lli..bathuku devudu already

    Bo..lli nichii jeevitantam kullukonettu

    Chesaadu ayina musti..ko..duku…malli

    Tirupati venkanna needed avakulu

    Koosaadu..veddelaa cha..standoff

  4. ఇప్పుడే ర బాబుగారు అధికారంలోకి వచ్చింది, జగన్ లాగా బాబు ఎమన్నా మూర్ఖుడా బలిసినోడా తింగరిగా పనులు చైయ్యటానికి!! ఒకటి రెండు సంవత్సరాలు ఆగండి ఇలా తొందరపడే జగడాలే జగన్ కుడిసిపోయాడు!! అసలు జనాలు పథకాలు చూసి ఓటు వైయ్యలేదు, అసలు పధకాలు అవసరం లేదు అభివృద్ధి జరిగి, జగన్ లాంటి అరాచక పాలనాపొతే చాలు అనుకొన్నారు

    పధకాల దరిద్రం వదిలితే ఆంధ్ర బాగుపడుద్ది, అబద్దమో నిజమో చెప్పి బాబుగారు వచ్చారు. కొంత అభివృద్ధి జరుగుతుంది.

    ప్రజల బాగుకోసం కొన్నిసార్లు కొన్నిమాటలు చెప్పాలి తప్పులేదు,ధర్మ పరిరక్షణకోసం ధర్మరాజే అబద్దం వాడవలసి వచ్చింది, బాబుగారు కుడా ఆంధ్ర, ఆంధ్రప్రజల సర్వతోముఖఅభివృద్ధికి తప్పులేదు. ఎందుకంటే అది ప్రజలమంచికోసమే కదా!! కొంచం ఆలస్యమైన బాబుగారు అన్నిపధకాలు ఇస్తారు, కొంతమంది అనర్హులని ఏరివేసి!!

  5. చిల్లరకి అసపడ్డ వాళ్ళకి చిల్లర దొరుకుద్ధి..అప్పుడప్పుడు కొద్దికొద్దిగా …ఒకేసారి అక్షయపాత్ర దానం చేయడానికిఇనిదేమన్న రెడ్డిగారి హాయమా…సీబీన్ పాలన…

Comments are closed.