విడాకుల్లో రాజకీయ కుట్ర లేదు – సమంత

తన విడాకుల్లో ఎలాంటి రాజకీయ కుట్ర లేదని స్పష్టం చేసింది సమంత. పరస్పర అంగీకారంతో, సామరస్య పూర్వకంగా నాగచైతన్య, తను విడిపోయినట్టు ఆమె వెల్లడించించింది. తమ విడాకుల విషయాన్ని ప్రైవేట్ గా ఉంచాలనే నిర్ణయం,…

తన విడాకుల్లో ఎలాంటి రాజకీయ కుట్ర లేదని స్పష్టం చేసింది సమంత. పరస్పర అంగీకారంతో, సామరస్య పూర్వకంగా నాగచైతన్య, తను విడిపోయినట్టు ఆమె వెల్లడించించింది. తమ విడాకుల విషయాన్ని ప్రైవేట్ గా ఉంచాలనే నిర్ణయం, తప్పుడు విశ్లేషణలకు దారితీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

నాగచైతన్య- సమంత విడాకుల వ్యవహారాన్ని మహిళా మంత్రి కొండా సురేఖ లేవనెత్తిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ విడాకులు తీసుకోవడానికి కేటీఆరే కారణమని, ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారా చైతూ- సమంత విడాకులకు కేటీఆర్ కారణమయ్యారని ఆమె విమర్శించారు.

ఈ కామెంట్స్ ను ఇప్పటికే నాగార్జున తిప్పికొట్టగా, ఇప్పుడు సమంత కూడా స్పందించింది. దయచేసి తన పేరును రాజకీయాలకు దూరంగా ఉంచాలని, తానెప్పుడూ రాజకీయాలకు అతీతంగానే ఉంటానని, అలానే కొనసాగాలనుకుంటున్నానని తెలిపింది.

“స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి పని చేయడానికి, స్త్రీలను సమానంగా చూడని పరిశ్రమలో మనుగడ సాగించడానికి, నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం, బలం కావాలి. కొండా సురేఖ గారూ, ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నాను, దయచేసి దీనిని చిన్నచూపు చూడకండి. ఒక మంత్రిగా మీ మాటలకు చాలా విలువ ఉందనే విషయం మీకు తెలుసనే అనుకుంటున్నాను. వ్యక్తుల గోప్యత పట్ల బాధ్యతగా, గౌరవంగా ఉండాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను.”

ఇలా కొండా సురేఖ వ్యాఖ్యల్ని ఖండించింది సమంత. ఇకనైనా తనను, తన విడాకుల వ్యవహారాన్ని రాజకీయాలకు అతీతంగా చూడాలని ఆమె కోరింది.

13 Replies to “విడాకుల్లో రాజకీయ కుట్ర లేదు – సమంత”

  1. కొన్ని మనము చూడకపొయినా ఎంటొ చెప్పగలం

    వాజెపాయ్ నితివంతుడా అంతె అనుమానాం లెదు …అది ఎలాగొ మనకు తెలియదు

    అందులొ అనుమానాం లెదు..మనము చూడలెదు అయినా …బిహార్ గడ్డి నెత అవినితిపరుడు

    అలాగె .. నీ విడాకులు నీకు కొవ్వు ఎక్కువ అయ్యె జరిగాయ్ అనెది సత్యం

  2. Mallee vesesindi, aada mundadanni ane card vadesindi.

    Congress ante veesametthu manchi abhiprayam kuda ledu kanee konda surekhagaru mariyu prastutha prabhuthvam konni teaser audios, photos lantivi vadilithe ekkada dongalakkade gupchup, sambarbuddi!

    Nagarjuna bath enduku kuv kuv annayante, hydra veella building okati koolchesindi kada, naa varakaithe ade karanam. Ledante, eepatiki Revantha daggara kuda games adesevadu.

    Revant reddy ante naaku koddiga abhimanam. Manaspoorthiga baga pani chestadu, rashtraniki chakkati governance istadani aasistunna!

  3. ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ personal life మీద నీచమైన articles రాసిన మీకు ఇప్పుడు ఏం రాయాలో అర్థం కావట్లేదా GA….

  4. ఈమె తనంతట తానే తెలంగాణా చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా పని చేసినట్లు గుర్తు, తెరాస కాలంలో!

Comments are closed.