ప‌వ‌న్ స‌భ‌కు టీడీపీ గైర్హాజ‌ర్‌!

తిరుప‌తిలో ఉప ముఖ్య‌మంత్రి ఇవాళ వారాహి డిక్ల‌రేష‌న్ స‌భ నిర్వ‌హించ‌నున్నారు. ఈ స‌భ ఎంతో ముఖ్య‌మైంద‌ని జ‌న‌సేన నాయ‌కులు చెబుతున్నారు. స‌నాత‌న ధ‌ర్మాన్ని ప‌రిర‌క్షించుకోవాల‌నే ప్ర‌తి ఒక్క‌రూ స‌భ‌కు రావాల‌ని జ‌న‌సేన విస్తృతంగా ప్ర‌చారం…

తిరుప‌తిలో ఉప ముఖ్య‌మంత్రి ఇవాళ వారాహి డిక్ల‌రేష‌న్ స‌భ నిర్వ‌హించ‌నున్నారు. ఈ స‌భ ఎంతో ముఖ్య‌మైంద‌ని జ‌న‌సేన నాయ‌కులు చెబుతున్నారు. స‌నాత‌న ధ‌ర్మాన్ని ప‌రిర‌క్షించుకోవాల‌నే ప్ర‌తి ఒక్క‌రూ స‌భ‌కు రావాల‌ని జ‌న‌సేన విస్తృతంగా ప్ర‌చారం చేస్తోంది. అయితే ఈ స‌భ త‌మ పార్టీ సొంత విష‌య‌మ‌న్న‌ట్టుగా జ‌న‌సేన వ్య‌వ‌హ‌రిస్తోంది. స్థానిక టీడీపీ, బీజేపీ నాయ‌కులు అంటీముట్ట‌న‌ట్టుగా న‌డుచుకుంటున్నారు.

దీంతో వారాహి డిక్ల‌రేష‌న్ స‌భ‌కు టీడీపీ నాయ‌కులు వెళ్ల‌డంపై అనుమానాలున్నాయి. పిల‌వ‌ని పేరంటానికి తామెందుకు వెళ్తామ‌ని టీడీపీ నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. త‌మ‌తో సంబంధం లేకుండా జ‌న‌సేన బ‌ల‌ప‌డే ఎత్తుగ‌డ‌లో భాగంగానే వారాహి డిక్ల‌రేష‌న్ స‌భ నిర్వ‌హిస్తోంద‌ని టీడీపీ నాయ‌కులు సందేహిస్తున్నారు. తిరుమ‌ల ప‌ర్య‌ట‌న నిమిత్తం వ‌చ్చిన ప‌వ‌న్‌ను ఇంత వ‌ర‌కూ టీడీపీ నాయ‌కులు క‌ల‌వ‌నే లేద‌ని జ‌న‌సేన నాయ‌కులు చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో వారాహి డిక్ల‌రేష‌న్ స‌భ ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఈ స‌భా వేదిక‌పై ఎవ‌రెవ‌రికి చోటు ద‌క్కుతుంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. దీన్ని బ‌ట్టి కూట‌మి నేత‌ల ప్రాధాన్యత ఏంటో తెలుస్తుంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఒక్కో స‌మ‌యంలో ఒక్కో ర‌కంగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని కూట‌మి నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. ప్ర‌స్తుతానికి ఆయ‌న ఎవ‌ర్నీ ప‌ట్టించుకునే ఆలోచ‌న‌లో లేర‌ని జ‌న‌సేన నాయ‌కులు అంటున్నారు.

స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ కోసం నిర్వ‌హిస్తున్న స‌భ అని, ఎవ‌ర్నీ బొట్టు పెట్టి పిల‌వ‌ర‌ని, ఎవ‌రికి వారుగా రావాల‌ని జ‌న‌సేన నాయ‌కులు చెబుతున్నారు. ఈ ప‌రిణామాలు కూట‌మిలో లుక‌లుక‌లకు దారి తీసే ప్ర‌మాదం వుంది. ఇప్ప‌టికిప్పుడు అస‌మ్మ‌తి బ‌య‌ట‌ప‌డ‌న‌ప్ప‌టికీ, రానున్న రోజుల్లో ప్ర‌తిదీ ప‌రిగ‌ణ‌లోకి వ‌స్తుంద‌నే మాట వినిపిస్తోంది.

10 Replies to “ప‌వ‌న్ స‌భ‌కు టీడీపీ గైర్హాజ‌ర్‌!”

  1. It seems his intension is that World Hindu people should follow him and his ideals of Hindu dharma and sanaathana the way he is following (for the time-being as long as he is in politics). Later if he changes his principles, then the entire Hindu community also should change as advised by him.

    1. ప్రియమైన రాజా గారు,

      మీరు లేదా మీ కుటుంబం మతం మార్చుకున్నారా అనేది అసలు సమస్య కాదు. మతం మార్చుకోవడం ప్రతి ఒక్కరి వ్యక్తిగత హక్కు, మనిషి తన మనసుకు అనుసరించి తన విశ్వాసాన్ని ఎంచుకునే స్వేచ్ఛ కలిగి ఉంటాడు. మనమంతా ఒకటే – మతం మారిన పైన, మనిషి మనసు మంచిగా ఉండటం, మనుషుల పట్ల గౌరవంగా వ్యవహరించడం ముఖ్యం.

      మతం మారడం ఎవరికి అభ్యంతరం కాదు, అది ఒక్కో వ్యక్తి స్వేచ్ఛ. మీరు మతం మార్చుకుని, కొత్త మతాన్ని ప్రేమించడంలో తప్పు లేదు. కానీ, మీరు అనుసరిస్తున్న మతాన్ని గౌరవించడం ఎంత ముఖ్యమో, అదే రీతిగా ఇతర మతాలను కూడా గౌరవించడం మానవతా ధర్మం. హిందూ మతాన్ని, హిందూ భావాలను విమర్శించడం అనేది మానవతా విలువలకు విరుద్ధం. ఇది కేవలం మతం కాదు, కొన్ని కోట్ల మంది మనోభావాలు, వారి సంస్కృతి, వారిదైన జీవనశైలి. ఈ విలువలను కించపరచడం అసలు సరైనది కాదు.

      జగన్ మోహన్ రెడ్డి లాంటి నాయకులు రాజకీయ లబ్ధి కోసం మతాలను కలపడం చేస్తున్నారు. కానీ, మీరు ఒక వ్యక్తిగా, హిందూ మతాన్ని కించపరచడం ద్వారా ఏం సాధిస్తారు? మీరు ఏమిటి అనే విషయం మీ మతంతో నిర్ణయించబడదు, అది మీ మనసు, మీ చర్యలు, మీరు ఇతరులను ఎలా గౌరవిస్తారనే దానిపైన ఆధారపడి ఉంటుంది.

      మీ పూర్వీకులు హిందువులే, ఆ విషయాన్ని గౌరవించడం మీ బాధ్యత. మీరు మతం మారినపుడే, అది మీరు తీసుకున్న స్వేచ్ఛాత్మక నిర్ణయం, దానికి ప్రతిఘటన లేదు. కానీ, మరొక మతాన్ని కించపరచడం, హిందూ భావాలను అవమానించడం చాలా దిగజారిన చర్య. హిందూ మతం ప్రతినిధి కాదు, అది మనుషుల హృదయాల్లో ఉండే విశ్వాసం. ఒక మనిషిగా, మీరు ఇతరుల విశ్వాసాలను గౌరవించాల్సిన అవసరం ఉంది.

      మీరు ఏ మతాన్ని అనుసరించినా, మానవత్వాన్ని, సత్యాన్ని, గౌరవాన్ని ప్రదర్శించడం ముఖ్యమైనది. మనందరమూ ఒక సమాజంలో జీవిస్తున్నప్పుడు, పరస్పర గౌరవం అవసరం. హిందూ భావాలను అవమానించడం వల్ల మీ వ్యక్తిత్వానికి ఎలాంటి ఉన్నత స్థానం దక్కదు. మీకు ఆలోచనల మార్పు వస్తే, మీరు మంచి వ్యక్తిగా మారతారు.

      మతం మారడం మనిషి స్వేచ్ఛ, కానీ ఇతరుల విశ్వాసాలను కించపరచడం ఒక నీచపు చర్య. మనం మన మతాన్ని గౌరవించాలి, అదే సమయంలో ఇతరుల మతాలను కూడా గౌరవించడం మనిషిగా ఉండే కనీస బాధ్యత. కాబట్టి, మేధావిగా ఆలోచించి, సత్యం, గౌరవం, మానవత్వం ఈ మూడు విలువలను జీవితంలో పట్టుకోండి

  2. సభకు వచ్చి , మీ పిల్లలని కూడా మన పవన్ కలయన్ గారి లాగా, క్రిస్టైనిటీ లోకి పంపండి. మా హిందువుల మోఖానా ఒక డిక్లరేషన్ కాగితం కొట్టండి. మాకు హిందువులు అక్కరలేదు, కాగితాలు చాలు.

Comments are closed.