జానీ మాస్టర్ జైలుకు వెళ్లనక్కర్లేదా?

లైంగిక వేధింపుల కేసులో, పోక్సో చట్టం కింద అరెస్టై, ప్రస్తుతం జ్యూడీషియల్ రిమాండ్ లో ఉన్న జానీ మాస్టర్ కు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ మధ్యంతర బెయిలే, రెగ్యులర్…

లైంగిక వేధింపుల కేసులో, పోక్సో చట్టం కింద అరెస్టై, ప్రస్తుతం జ్యూడీషియల్ రిమాండ్ లో ఉన్న జానీ మాస్టర్ కు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ మధ్యంతర బెయిలే, రెగ్యులర్ బెయిల్ గా మారుతుందని, అతడి తరఫు న్యాయవాదులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈనెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు. తిరు సినిమాలో ఓ పాటకు జానీ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులకు జాతీయ అవార్డ్ వచ్చింది. అది అందుకునేందుకు ఢిల్లీ వెళ్లేందుకు అనుమతి కోరుతూ, మధ్యంతర బెయిల్ కోరాడు జానీ మాస్టర్.

దీనికి కోర్టు అంగీకారం తెలిపింది. 10వ తేదీ ఉదయం 10 గంటలకు కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. అయితే ఇదే మధ్యంతర బెయిల్, రెగ్యులర్ బెయిల్ గా మారే అవకాశం ఉందంటున్నారు అతడి లాయర్లు.

పోలీస్ కస్టడీ ముగిసిన వెంటనే రెగ్యులర్ బెయిల్ కు దరఖాస్తు చేశారు. అయితే కేసు కీలక విచారణలో ఉన్నందుకు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కోరడంతో, రెగ్యులర్ బెయిల్ పై విచారణను 7వ తేదీకి వాయిదా వేశారు.

జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ లో ఉంటుండగానే, 7వ తేదీన అతడికి రెగ్యులర్ బెయిల్ కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు లాయర్లు. అయితే మరికొంతమంది మాత్రం పోక్సో చట్టం కింద అరెస్ట్ అయిన వ్యక్తులకు ఇంత త్వరగా బెయిల్ రావడం కష్టమని అభిప్రాయపడుతున్నారు.

10 Replies to “జానీ మాస్టర్ జైలుకు వెళ్లనక్కర్లేదా?”

  1. మహా నటులైన ఎన్టీఆర్ కి ఇవ్వలేదు.

    ఏఎన్నార్ కి ఇవ్వలేదు.

    ఎస్వీఆరూ కు ఇవ్వలేదు.

    కొన్ని సినిమాల్లో వారు అద్భుతం అనే రీతిలో నటన ప్రదర్శించారు.

    అవార్డులు రావాలంటే ఏమి చెయ్యలో చెప్పకనే చెబుతోంది ఈ మధ్య అవార్డు గ్రహీతలను చూస్తే.

Comments are closed.