వేట్టయ్యన్.. రెండు వైరుధ్యాలు

దర్శకుడు టిజె జ్ఞాన్ వేల్. జై భీమ్ సినిమా అందించారు. ఓ టిపికల్ పాయింట్ తీసుకుని సీరియస్ సినిమాను నడిపిన తీరు చూసి జ‌నం అహో అన్నారు. ఇప్పుడు రెండో సినిమా వేట్టయ్యన్. Advertisement…

దర్శకుడు టిజె జ్ఞాన్ వేల్. జై భీమ్ సినిమా అందించారు. ఓ టిపికల్ పాయింట్ తీసుకుని సీరియస్ సినిమాను నడిపిన తీరు చూసి జ‌నం అహో అన్నారు. ఇప్పుడు రెండో సినిమా వేట్టయ్యన్.

రజ‌నీ. అమితాబ్, ఫాజిల్, రానా… నాలుగు భాషల నుంచి నలుగురు పెద్ద నటులు. కచ్చితంగా కమర్షియల్ లెక్కలు చూసుకోవాలి. ఇలాంటి స్టార్ కాస్ట్ తో జ్ఞాన్ వేల్ ఏం చేస్తారు అనుకున్నారు అంతా. టీజ‌ర్ వచ్చింది. కానీ పెద్దగా ఇంప్రెస్ గా లేదు. కానీ ఇప్పుడు ట్రయిలర్ వచ్చి క్లారిటీ ఇచ్చింది. దర్శకుడు జ్ఞాన్ వేల్ మళ్లీ సరైన సబ్జెక్ట్ నే ఎన్నుకున్నారు అని

న్యాయం అన్యాయం అయిపోయినపుడు ఏం చేయాలి.. అన్యాయాన్ని అన్యాయంతొ ఢీకొనాలా? లేక న్యాయంగానే పోరాడి న్యాయాన్ని గెలిపించాలా?

అన్యాయం జ‌రిగింది. ప్రజ‌లు అవేశంగా వున్నారు. తక్షణ న్యాయం కావాలంటారు. వారి అవేదన, అవేశం అలాంటివి. వెంటనే తన స్టయిల్ న్యాయం అందించాడు ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ రజ‌నీ. దీని మీద కమిషన్ విచారణాధికారి అమితాబ్. ఇలా న్యాయం కోసం అన్యాయం చేయడం సరికాదనే విధానం అతనిది. వీరి మధ్యలో దొంగగా ఫాజిల్, విలన్ గా రానా. వీటన్నింటి నడుమ సంఘర్షణ.

అంటే జ్ఞాన్ వేల్ తొలి హిట్ తరువాత ఏమీ మారిపోలేదు. వాణజ్య‌ పంథాలోనే తన చెప్పాలి అనుకున్న, చేయాలనుకున్న సైద్ధాంతిక చర్చ తెరమీదకు తెచ్చాడు. అయితే ఎంత ఎంగేజింగ్ గా చెప్పాడు. కమర్షియల్ ఎలిమెంట్ లు యాడ్ చేయడం అన్నది ప్లస్ అయిందా, మైనస్ అయిందా అన్నది సినిమా వస్తే తెలుస్తుంది. మరో వారంలో విడుదలవుతోందీ సినిమా.

5 Replies to “వేట్టయ్యన్.. రెండు వైరుధ్యాలు”

Comments are closed.