మీ రాజకీయాల కోసం నా పేరు వాడొద్దు – రకుల్

“కేటీఆర్ బాధ పడలేక, డ్రగ్స్ కేసు వల్ల ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు గబగబా పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ తలకాయ నొప్పి మాకెందుకురా…

“కేటీఆర్ బాధ పడలేక, డ్రగ్స్ కేసు వల్ల ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు గబగబా పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ తలకాయ నొప్పి మాకెందుకురా బాబూ అంటూ ఇంకో ఇద్దరు హీరోయిన్లు కూడా గబగబా పెళ్లిళ్లు చేసుకున్నారు.”

సమంతపై మంత్రి కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అదే స్టేట్ మెంట్ లో ఆమె మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ పేరు కూడా ప్రస్తావించింది. పైన ఇచ్చిన స్టేట్ మెంట్ అదే.

ఇప్పుడీ స్టేట్ మెంట్ పై రకుల్ ప్రీత్ స్పందించింది. కొండా సురేఖ స్టేట్ మెంట్ ను ఖండిస్తూనే, రాజకీయాల కోసం తన పేరు వాడొద్దని విజ్ఞప్తి చేసింది.

“నేను రాజకీయాలకు దూరం, నాకు ఏ వ్యక్తి లేదా పార్టీతో ఎలాంటి సంబంధం లేదు. మీ పొలిటికల్ మైలేజీ కోసం నా పేరును వాడుకోవద్దు. నటుల్ని రాజకీయాలకు దూరంగా పెట్టింది. రాజకీయ లబ్ది కోసం, హెడ్ లైన్స్ కోసం వాళ్లపై కట్టుకథలు సృష్టించవద్దు.”

ఇలా తన పేరును ప్రస్తావించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది రకుల్. బాధ్యాతాయుతమైన పదవిలో ఉన్న ఓ మహిళ, మరో మహిళపై దారుణమైన, దుర్మార్గమైన నిరాధార ఆరోపణలు చేయడం చాలా బాధ కలిగించిందని అంటోంది రకుల్.

హుందాగా వ్యవహరించాలనే ఉద్దేశంతో తామంతా నిశ్శబ్దంగా ఉన్నామని, దాన్ని తమ చేతకానితనంగా భావించొద్దని అంటోంది. సమంతకు క్షమాపణలు చెప్పిన కొండా సురేఖ, రకుల్ విషయంలో మాత్రం ఇంకా స్పందించలేదు.

21 Replies to “మీ రాజకీయాల కోసం నా పేరు వాడొద్దు – రకుల్”

  1. ఇది నిజమే , ఇచ్చి పోచుకునే ధోరణిలో ఎదో చేసారు. కానీ దానికి కాంగ్రెస్ లాభం పొందాలను కోవడం తప్పు. ఇక్కడ అతనితో వెళ్లిన నటీమణుల పేర్లు రాకుండా కేటర్ మీద ఫోకస్ పెడితే బాగుంటుంది, అలా కష్టమే. ఆ టేప్ లతో కేటర్ ని బ్లాక్ మెయిల్ చెయ్యడం , లేకపోతె నటీమణులని బ్లాక్మెయిల్ చెయ్యడం ఒకటే ముందు వున్న మార్గం.

    రేవంత్ ఆ రెండు కాకుండా మూడో దారి ఎంచుకున్నాడు.

  2. ఇది నిజమే , ఇచ్చి పోచుకునే ధోరణిలో ఎదో చేసారు. కానీ దానికి కాంగ్రెస్ లాభం పొందాలను కోవడం తప్పు. ఇక్కడ అతనితో వెళ్లిన నటీమణుల పేర్లు రాకుండా కేటర్ మీద ఫోకస్ పెడితే బాగుంటుంది, అలా కష్టమే. ఆ టేప్ లతో కేటర్ ని బ్లా/ క్ మెయిల్ చెయ్యడం , లేకపోతె నటీమణులని బ్లా/ క్మె/యిల్ చెయ్యడం ఒకటే ముందు వున్న మార్గం.

    రేవంత్ ఆ రెండు కాకుండా మూడో దారి ఎంచుకున్నాడు.

  3. Dear Raja Garu,

    When you find yourself accusing others of preaching, I implore you to pause and reflect deeply on how utterly subservient you have become to Jagan Mohan Reddy. For an educated person, it is truly disheartening to witness such blindness, where you choose to see only the faults in the party you oppose, while turning a blind eye to the grievous wrongs committed by the one you support. Have you ever pondered upon the manner in which Jagan treated his own sister, or how he accumulated such vast wealth in such a short span of time? He plays a duplicitous game, presenting himself as both Hindu and Christian, merely to sway votes in his favor.

    Perhaps you, or your family, may have converted to another faith, but your forebears were undoubtedly Hindus. Is there no sense of shame in disregarding this heritage? It is baffling that you seem more concerned with Jagan Mohan Reddy’s political fortunes than with the grave issue of Lord Venkateswara’s sacred laddu being adulterated. Your disregard for the sanctity of other religions in your blind loyalty is truly lamentable.

    Take a moment to ask yourself with sincerity: can you not condemn wrongdoing, irrespective of who commits it? Are you truly unaware of the fraudulent deeds of Jagan? And when questioned on these matters, is your only defense to deflect by asking, “What about Chandrababu?” This avoidance of truth is unbecoming. Instead of evading, I urge you to confront the facts with honesty and integrity.

    Think seriously, and reflect upon where your true loyalties should lie.

  4. అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా వ్యవహరించడం తీరా తమ బాగోతాలు బయటపడినప్పుడు సన్నాయి నొక్కులు ఈ రాజకీయ నాయకులకు అలవాటు.

    ఆమధ్య శ్రియ శరణ్ అనే నటికి ఓ రాజకీయ నాయకుడికి సంబంధం ఉందని వార్తలు వచ్చాయి.

Comments are closed.