పెద్దాయన స్టేట్ మెంట్ ఎవరి మీద?

దేవాలయాల్లోకి రాజకీయాలను తీసుకుని రావద్దు అని కేంద్ర మాజీ మంత్రి సింహాచలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అశోక్ గజపతి రాజు స్టేట్ మెంట్ ఇచ్చారు. పవిత్రమైన దేవాలయాలను అలాగే ఉండనీయాలని కోరారు. ఆయన మాటలలో…

దేవాలయాల్లోకి రాజకీయాలను తీసుకుని రావద్దు అని కేంద్ర మాజీ మంత్రి సింహాచలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అశోక్ గజపతి రాజు స్టేట్ మెంట్ ఇచ్చారు. పవిత్రమైన దేవాలయాలను అలాగే ఉండనీయాలని కోరారు. ఆయన మాటలలో వైసీపీ మీద జగన్ మీద విమర్శలు ఉన్నా ఓవరాల్ గా చూస్తే దేవాలయాల్లోకి రాజకీయాలు ఎందుకని అసహనం వ్యక్తం చేసిన తీరు కనిపిస్తోంది.

ఈ ఏడాది సింహాచలంలో చందనోత్సవం బాగా నిర్వహించామని ఆయన గుర్తు చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంతో కల్తీ జరిగింది అని వార్తలు రావడంతోనే సింహాచలం నెయ్యిని కూడా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. ఆ తరువాత ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు వాటిని సీజ్ చేశారు

ఇపుడు టెంపరరీగా విశాఖ డెయిరీ నుంచి నెయ్యి సప్లైకి ప్రతిపాదించారని అంటున్నారు. అశోక్ కుటుంబం తరాలుగా సింహాచలం దేవస్థానానికి ట్రస్టీలుగా ఉంటున్నారు. ఎపుడూ ఏ చిన్న పొరపాటు జరగలేదు అందుకే పెద్దాయన అంటున్నారు. కల్తీ జరిగిందని ఎపుడైనా విన్నామా అని.

ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో విచారణ జరిపి అసలైన దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఈ విషయంలో తాను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను అని కూడా అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం కంటే టీడీపీ ఈ విషయాల్లో కొన్ని స్టెప్స్ బాగానే తీసుకుంటోందని అంటూనే దేవాలయాలను వాటి మానాన వదిలేయాలని ఆయన కోరడం విశేషం.

పెద్దాయన మాటలు వింటూంటే ఆయన రాజకీయాలకు అతీతంగా ఒక ట్రస్టీ గా తన అభిప్రాయం చెప్పారని అంటున్నారు. జనం కూడా అదే కోరుతున్నారు. ప్రభుత్వాలు ఎవరివి అయినా పార్టీలు ఏవి అయినా దేవాలయాల విషయంలో దూరం పాటిస్తేనే మేలు అని భక్తులు అంటున్నారు. పెద్దాయన నోట కూడా అదే మాట వచ్చింది అని అంటున్నారు.

11 Replies to “పెద్దాయన స్టేట్ మెంట్ ఎవరి మీద?”

  1. ఇప్పుడు ఈయన నీకు పెద్దాయన..

    మన తింగరోడు ఈయన్ని బాధ పెట్టినప్పుడు ? కసాయి చెడ్డి పిచ్చి పిచ్చి మాటలన్నప్పుడు ?

  2. ఇప్పుడు-ఈయన-నీకు-పెద్దాయన..

    మన-తింగరోడు-ఈయన్ని-బాధ-పెట్టినప్పుడు ? కసాయి-చెడ్డి-పిచ్చి-పిచ్చి-మాటలన్నప్పుడు ?

  3. ఎందుకు GA మన అన్నయ్య కు ఇలా వెన్నుపోటు పొడుస్తున్నావ్….ఇప్పుడు అందరూ పెద్దాయన మన అన్నయ్య గురించి ఏమన్నాడో తెలుసుకోవాలనేగా ఈ వెన్నుపోటు ఆర్టికల్….😂😂

Comments are closed.