హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి సర్కారు.. నీటివనరులను ఆక్రమించుకుని చేపట్టిన నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తూ ముందుకు సాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కూల్చివేతలకు గురవుతున్న భవనాలను కోల్పోతున్న వారికి తప్ప.. రేవంత్- హైడ్రా కాంబినేషన్ లో జరుగుతున్న కూల్చివేతలకు సర్వత్రా ప్రజామోదం వ్యక్తం అవుతోంది. అలా నష్టపోతున్న వారిలో కూడా డివైడ్ టాక్ ఉంది.
చెరువులను, నదులను ఆక్రమించి ఫాం హౌస్లు, కన్వెన్షన్ సెంటర్లు కట్టుకున్న సంపన్నులు సహజంగానే గుర్రుమంటున్నారు. అదే సమయంలో మూసీ నదీతీరం, పరీవాహక ప్రాంతంలో ఇళ్లు కోల్పోయిన పేదల్లో అదేస్థాయి వ్యతిరేకత లేదు. వారందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించిన తర్వాతే కూల్చవేతలు చేపడుతూ.. ప్రజాగ్రహానికి దారితీయకుండా సర్కారు జాగ్రత్త పడుతోంది. ఇలాంటి నేపథ్యంలో.. రేవంత్ రెడ్డి సర్కారు చేపడుతున్న ఈ యజ్ఞానికి నైతికబలం అందించే పరిణామం చోటుచేసుకుంది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన కేవీపీ రామచంద్రరావుకు కూడా మూసీ నదీతీరంలో ఫాం హౌస్ ఉంది. రేవంత్ అందరి ఆస్తులు, నిర్మాణాల మీదికి విరుచుకుపడుతున్నట్టుగానే.. కేవీపీ ఫాంహౌస్ ను కూడా కూల్చివేస్తారా? లేదా, ఆయన తమ కాంగ్రెసు పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు గనుక, ఢిల్లీ హైకమాండ్ వద్ద కూడా పరపతి ఉన్న నాయకుడు గనుక వదిలేస్తారా? అనే ప్రచారాలు సాగుతున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో కేవీపీ రామచంద్రరావు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ కు ఒక లేఖ రాశారు. కూల్చివేతల విషయంలో తన పట్ల ఎలాంటి మినహాయింపు దృష్టి అక్కర్లేదని, కాంగ్రెస్ పార్టీ నేతను గనుక తనను ప్రత్యేకంగా చూడవద్దని, సాధారణ పౌరుడి విషయంలో చట్టం ఎలా ఉంటుందో అలాగే తన పట్ల కూడా వ్యవహరించాలని కోరారు.
మీరు- నేను కలగజేసుకోకుండా చట్టం తన పని తాను చేసుకుపోనిద్దాం. తన ఫాంహౌస్ ను చట్ట ప్రకారమే నిర్మించాను గానీ.. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఉన్నట్టు తేలితే మార్క్ చేయండి.. నిర్మాణం అక్రమమని తేలితే తానే తన సొంత ఖర్చుతో కూల్చివేయిస్తానని కేవీపీ రామచంద్రరావు ముందుకు రావడం విశేషం.
మూసీ నది బఫర్ జోన్ విషయంలో రేవంత్ ప్రభుత్వం చాలా దూకుడుగా, నిర్మొగమాటంగా వ్యవహరిస్తోంది. సంపన్నులు ఆస్తులు, కన్వెన్షన్ సెంటర్లు కూల్చివేసినప్పుడు మద్దతు ప్రకటించిన బిజెపి కూడా, మూసీ పేదల ఇళ్లు కూల్చివేస్తోంటే.. వ్యతిరేకిస్తోంది. వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయిస్తుండడాన్ని మర్చిపోతున్నది.
కాగా రేవంత్ ప్రయత్నానికి నైతిక మద్దతు ఇచ్చేలాగా కాంగ్రెసు పార్టీ సీనియర్ అయిన కేవీపీ రామచంద్రరావు.. పారదర్శకంగా మార్కింగ్ చేయిస్తే.. 48 గంటల్లో తన ఫాంహౌస్ ను తానే కూలగొట్టిస్తానని అనడం ప్రభుత్వానికి నైతిక బలమే. కేవీపీ ఫాంహౌస్ ను కూడా కూల్చేస్తే అయినవారి విషయంలో పక్షపాతం చూపించకుండా రేవంత్ సర్కారు ముందుకు సాగుతున్నదనే మంచి పేరు వారికి దక్కుతుంది.
Call boy jobs available 9989793850
అంటే కేవీపీ మాటలు ప్రజల మాటలు అన్న మాట, రేవంత్ రెడ్డి కి గొప్ప సపోర్టర్ అయిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పెదవి విరిచేసాక కూడా మీ మీడియా తల్లి కాంగ్రెస్ కి భలే చిడతలు వాయిస్తుంది.
vc estanu 9380537747
Revantu anna di mark chesaaru kaani koolachaledu
Government is making Hyderabad like earth-quake hit area and war-ravaged city. We cant imagine the agony and miserable state of innocent people who lost their houses built with their hard-earned life long saving money