జగన్ ‘ఏ మాయలో పడ్డారో..’ ఇదిగో క్లారిటీ!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు ఒక్క చాన్స్ ఇవ్వమని అడిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నీరాజనం పట్టారు. ఆయనకు అనల్పమైన మద్దతు ప్రకటించారు. తిరుగులేని విధంగా 151 సీట్లతో ముఖ్యమంత్రిని చేశారు. జగన్మోహన్ రెడ్డి…

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు ఒక్క చాన్స్ ఇవ్వమని అడిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నీరాజనం పట్టారు. ఆయనకు అనల్పమైన మద్దతు ప్రకటించారు. తిరుగులేని విధంగా 151 సీట్లతో ముఖ్యమంత్రిని చేశారు. జగన్మోహన్ రెడ్డి చెడ్డ పరిపాలన అందించారని అనుకోవడానికి వీల్లేదు. చిన్న తేడా ఎక్కడొచ్చిందంటే.. ఆయన- ప్రజలకు ఏది మంచిదని తనకు అనిపించిందో అది చేసుకుంటూ వెళ్లారు! అదే సమయంలో ప్రజలు తననుంచి ఏం కోరుకుంటున్నారనేది పట్టించుకోలేదు. ఫలితం ఇప్పుడు మనం చూస్తున్నదే.

అయితే.. నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ.. ప్రజలు తనను తిరస్కరించారనే వాస్తవాన్ని జీర్ణించుకోకుండా జగన్ ఎన్నికల్లో ఏదో మాయ జరిగిందని మాట్లాడుతుండడం పలువురికి ఆశ్చర్యం కలిగించే సంగతి. మాయ జరగడం కాదు.. ఆయనే ఎవరి మాయలోనో పడ్డారని, అందుకే ఇప్పటికీ వాస్తవాలు గ్రహించడం లేదని.. ప్రజల తీర్పును మించి ఆయనను ఎవ్వరో మాయచేసి బురిడీ కొట్టిస్తున్నారని ప్రజలు అనుకుంటుండేవారు. అలా జగన్ ను మాయచేసి మభ్యపెడుతున్నది ఎవ్వరో కూడా ఇవాళ తేలిపోయింది.

అచ్చంగా జగన్ వల్లించే స్క్రిప్టునే ఇవాళ- ఇన్నాళ్లు ఆయనకు ప్రధాన సలహాదారుగా వ్యవహరించిన పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణారెడ్డి వల్లించడం గమనిస్తే.. జగన్ చుట్టూ ఆవరించి ఉన్న మాయ ఆయనే అనేది సామాన్యులకూ అర్థమవుతుంది.

గుంటూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్త నాయకత్వం బాధ్యతలు స్వీకరించింది. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. జిల్లా అధ్యక్షుడుగా అంబటి రాంబాబు, పార్లమెంటు నియోజకవర్గాల ఇన్చార్జిగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి సజ్జల రామక్రిష్ణారెడ్డి కూడా హాజరయ్యారు. ఆయన తన ప్రసంగంలో ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం ఒక అబద్ధం అన్నట్టుగా ఇప్పటికీ అభివర్ణిస్తుండడం విశేషం.

‘‘ఈ ఎన్నికల్లో ఏదో జరిగింది. మోసం జరిగింది. హిమాలయాల అంత ఎత్తు ఎదిగిన పార్టీ ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది. ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందు నుంచి ప్రజల్లో కూటమి పార్టీల నేతలు ఒక మాయలోకం నిర్మించారు. మోసపూరిత హామీలతో మాయచేశారు. గెలిచిన తర్వాత నాలుగునెలలైనా చంద్రబాబు చేసిందేమీ లేదు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది..’’ అంటూ సజ్జల ప్రసంగం సాగిపోయింది.

ఓడిపోయిన నాటి నుంచి కూడా ప్రజల తీర్పును అర్థం చేసుకోకుండా జగన్ ఇదే మాటలు చెబుతూ వస్తున్నారు. ఆయన ఎవరి మాయలో ఉన్నారో.. ప్రజల వ్యతిరేకతను గుర్తించకుండా ఈ పరిస్థితి తీసుకువచ్చారు.. అని కార్యకర్తలే ఆశ్చర్యపోయారు. నాలుగునెలల తర్వాత కూడా సజ్జల అవే మాటలు చెప్పడాన్ని బట్టి.. సజ్జల మాయలోంచి జగన్ ఇంకా బయటకు రాలేదని కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకా ఇలాగే కొనసాగితే.. పార్టీ మనుగడ మరింతగా ప్రమాదంలో పడుతుందని కూడా కార్యకర్తలు, నాయకులు అభిప్రాయపడుతున్నారు.

29 Replies to “జగన్ ‘ఏ మాయలో పడ్డారో..’ ఇదిగో క్లారిటీ!”

  1. అంతగా “మాయ” లో పడిపోడానికి..ఈ ముసలోడిలో ఏమి చూశాడో జగన్ రెడ్డి..

    కొంపదీసి.. జగన్ రెడ్డి వీడియోలేమైనా రికార్డు చేసి బ్లాక్మయిల్ చేస్తున్నాడా..?

    హతవిధీ.. చివరికి జగన్ రెడ్డి వీడియోలు కూడా చూడాలా.. మా ఖర్మ కి..

    1. కాదు ఆయన తమ్ముడు అవినాశం వంటింట్లో మరదలితో సరసాల వీడియోలు…

      1. ప్రశ్న కి ప్రశ్న సమాధానం అవదు.. ఇందుకేగా మీరు 11 లో ఆగిపోయి.. పార్టీ మూసేసుకొన్నారు..

    1. పార్టీ పూర్తిగా సంక నాకిపోయాక కూడా ఇంకా మేలుకోకపోతే.. అలాంటోళ్ళనే “కుక్కలు” అంటారు..

  2. మాయ అనేది ఓటమి కాదు, ఓటమి ఎదుర్కోము, అన్నీ గొప్పగా, సవ్యంగా జరుగుతున్నాయి అని మీరు సృష్టించుకున్న మాయ! ఒకపక్క జగన్ బారికాడ్ ల మధ్య బయటకు వెళ్తున్నా సరే అలా మాయ సృష్టించుకున్నారు.

  3. సజ్జల నీ చూస్తే జగన్ టక్కున లేచి నుంచున్ని నమస్కారం అన్నా అని భయంతో వణికిపోతూ వుంటాడు అంట కదా.

    జగన్ నీ అంతగా భయపెట్టే రహస్యాలు, సజ్జలు చేతిలో ఏమున్నాయి?

      1. . అప్పట్లో ఢిల్లీ తాజ్ లో ప్యాలస్ పులకేశి గాడు డ్రాప్ చేసి పిక్ అప్ చేసుకుని తమ కి సిఎం పోస్ట్ కన్ఫర్మ్ చేసుకున్న సంగతెగా ?

        అప్పట్లో నెలకి ఒకసారి బాగళూర్ నుండి ఢిల్లీ ఒక ట్రిప్ కన్ఫర్క్ గా వుండేది.

        ఇప్పుడీ అదే పని వినాశం 3AM కి కాంట్రాక్టు తీసుకుని చేస్తున్నాడు, దాని సంగతేగా!

  4. ఇంట్లో వాళ్ల మాట వినని వారు వీడిలో వాళ్ల మాట వింటారా? 
    ఎదో జాకీ లు వెయ్యటానికి చూస్తున్నావ్ కాని ప్రజలు కి అన్నీ తెలుసు
  5. ఎవడు-మాయ-చేస్తే-వాడి-మాయలో-పడే-చవట-దద్దమ్మ-మనకు-లీడర్-గా-అవసరమారా…

  6. ///ప్రజలకి ఎది మంచిదని తనకు అనిపించిందొ అది చెసుకుంటూ పోయారు!///

    .

    హ! హ!! విమర్సిస్తూ కూడా ఎమి వెనుకెసుకొస్తున్నవ్!

    ప్రజలకి ఎది మంచిదని తనకు అనిపించిందొ అది చెయటం కాదు…… తనకు ఎది మంచిదని అనిపించిందొ అదె ప్రజలకి కూడా మంచిదని అన్న భావన, భ్రమ కలుగ చెయాలి అని చూడటం.

    .

    మద్యం రెట్లు పెంచి డబ్బు చెసుకొని… అదె మద్య నియంత్రణ అని నమ్మించాలి అని చూడటం

    కొత్త ఇసుక పదకం తెచ్చి డబ్బు చెసుకొని… అదె మంచి పదకం అని నమ్మించాలి అని చూడటం

    జనం కి ఇస్టం లెని 3 రాజదానులె వాళ్ళు కొరుకుంటున్నరు అన్నట్టు ప్రచారం చెయటం

    వొటు బంక్ రాజకీయల కొసం సంగ్షెమ పదకాలు ఉంటె చాలు… అబిరుద్ది లెకపొయినా పరవాలెదు… అని జనం ని నమ్మించటం!

    ఇలా చెపుకుంటూ పొతె ఎన్నొ!

Comments are closed.