వృద్ధనేత: సన్యాసం తర్వాత జ్ఞానోదయం!

సాధారణంగా ఎవరైనా జ్ఞానోదయం అయిన తర్వాత సన్యాసం తీసుకుంటూ ఉంటారు. కానీ ఆ వృద్ధనేత రూటే సెపరేటు. సన్యాసం తీసుకున్న తరువాత ఆయనకు జ్ఞానోదయం అయినట్టుగా కనిపిస్తోంది. ఇంతా కలిపి ఆ సన్యాసం కూడా…

సాధారణంగా ఎవరైనా జ్ఞానోదయం అయిన తర్వాత సన్యాసం తీసుకుంటూ ఉంటారు. కానీ ఆ వృద్ధనేత రూటే సెపరేటు. సన్యాసం తీసుకున్న తరువాత ఆయనకు జ్ఞానోదయం అయినట్టుగా కనిపిస్తోంది. ఇంతా కలిపి ఆ సన్యాసం కూడా ఆయన ఇచ్ఛాపూర్వకంగా తీసుకున్నది కాదు. ఆయనకు బలవంతంగా ఇవ్వబడిందనే చెప్పాలి. పార్టీలు ఆయనను పట్టించుకోవడం మానేశాక, ప్రజలు ఓట్లు వేయకుండా తిరస్కరించేసిన తరువాత ఆయన అనివార్యమైన సన్యాసాన్ని స్వీకరించారు. అది జరిగి కూడా అయిదేళ్లయింది.

సన్యాసంలోని సుఖం బాగా అనుభవంలోకి వచ్చిందేమో.. ఇప్పుడు నా అంతటి అదృష్టవంతుడు లేడు అని సెలవిస్తున్నారు. ఆయన మరెవ్వరో కాదు. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు స్వయానా తోడల్లుడు, ఎంపీ పురందేశ్వరికి భర్త, రాష్ట్రంలోని అన్ని ముఖ్య పార్టీల ముద్రను కూడా తన మీద కలిగి ఉన్న సీనియర్ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు.

ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు నాయుడుకు సహకరించిన తోడల్లుడిగా వెంకటేశ్వరరావుకు ఉన్న గుర్తింపు పెద్దది. అప్పటికి మంత్రి అయినప్పటికీ.. ఆ తర్వాత చంద్రబాబు మార్కు రాజకీయాల్లో ఆయన ఎక్కువ కాలం కలిసి కొనసాగలేకపోయారు. తర్వాత దగ్గుబాటి వారి రాజకీయం రకరకాలుగా మలుపులు తిరిగింది. కొన్నాళ్లు బిజెపిలో కూడా ఉన్నారు. ఆయన భార్య దగ్గుబాటి పురందేశ్వరి కాంగ్రెసు పార్టీలో ఎంపీ అయ్యారు. కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆమె బిజెపిలోకి వచ్చారు. ప్రస్తుతానికి రాష్ట్ర బిజెపి సారథ్యం వహిస్తూ, ఎంపీగా కూడా సేవలందిస్తున్నారు.

కుటుంబం సంగతి ఇలా ఉండగా.. వెంకటేశ్వరరావు పరిస్థితి వేరు. చంద్రబాబుతో సత్సంబంధాలు లేని ఆయన తన కొడుకును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున, గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన పరుచూరు నుంచి ఎమ్మెల్యే చేయాలని అనుకున్నారు. కానీ విదేశీ పౌరసత్వం లాంటి సాంకేతిక అంశాలు అడ్డువచ్చి కొడుకుకు టికెట్ ఇవ్వడం సాధ్యం కాలేదు. దాంతో చివరి నిమిషంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకే టికెట్ ఇచ్చింది. అంతటి సీనియర్ నేత, 2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా జగన్ హవా వెల్లువెత్తినప్పటికీ.. తాను సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించిన పరుచూరు నియోజకవర్గంలో గెలవలేకపోయారు. ఆ తరువాత ఆయన వైసీపీకి కూడా దూరంగానే ఉండిపోయారు. రాజకీయాలకే ఆల్మోస్ట్ దూరం జరిగారు.

తీరా ఇప్పుడు.. కారంచేడులో ఒక కార్యక్రమంలో పాల్గొన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. రాజకీయ సన్యాసం తర్వాత జ్ఞానోదయం అయినట్టుగా.. ‘నేను అదృష్టవంతుడిని. రాజకీయ జంజాటం నుంచి బయటపడ్డా’ అని అంటున్నారు. ‘రాజకీయాల్లో గెలిచిన వాడికంటె ఓడిపోయిన వాడు, ఓడిన వాడికంటె సీటు దక్కని వాడు అదృష్టవంతుడు’ అంటూ వైరాగ్య సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నారు.

మొత్తానికి జగన్ హవా రాష్ట్రంలో వెల్లువెత్తినరోజుల్లో కూడా గెలవలేకపోయిన వెంకటేశ్వరరావు మాటలు.. ఏదో సామెత చెప్పినట్టుగా ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు.

7 Replies to “వృద్ధనేత: సన్యాసం తర్వాత జ్ఞానోదయం!”

  1. మామ మీద తిరుగుబాటు చేసిన అల్లుడు నే ఇన్ని మాటలు అన్నావు అంటే,

    ఏకంగా సొంత తండ్రి , చిన తండ్రి నీ లెపేసిన ప్యాలస్ పులకేశి నీ ఎన్ని మాటలు అంతావో?

    వైఎస్ఆర్ నిజమైన అభిమానులు ఎదురు చూస్తున్నారు వెంకట్ రెడ్డి గారు. కమాన్

    1. నిజం గ మామ మీద తిరుగుబాటు చేసారా????మరి పార్టీ లో మిగతా సహచరులు చంబా వెనుక ఎందుకు వచ్చారు ఇప్పుడు శివసేన లేకపోతె ncp లో వచ్చిన చీలిక ఎండు వల్లనా ???అధినేతల చేసిన పనుల మీద …వాళ్ళ కెపాసిటీ మీద నమ్మకం లేకనే కదా????

Comments are closed.