నాలుగు కార్పొరేష‌న్ల‌గా గ్రేట‌ర్ హైద‌రాబాద్‌!

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (జీహెచ్ఎంసీ)ను నాలుగు కార్పొరేష‌న్ల‌గా విభ‌జించ‌నున్న‌ట్టు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల‌శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ వివ‌రాలు వెల్ల‌డించారు. హైద‌రాబాద్ జ‌నాభా…

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (జీహెచ్ఎంసీ)ను నాలుగు కార్పొరేష‌న్ల‌గా విభ‌జించ‌నున్న‌ట్టు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల‌శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ వివ‌రాలు వెల్ల‌డించారు. హైద‌రాబాద్ జ‌నాభా 1.50 కోట్ల‌కు చేరింద‌ని ఆయ‌న చెప్పారు. కావున జీహెచ్ఎంసీని నాలుగు కార్పొరేష‌న్ల‌గా విభ‌జించడానికి రంగం సిద్ధ‌మైన‌ట్టు మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి తెలిపారు.

హైద‌రాబాద్‌లో న‌లుగురు మేయ‌ర్ల‌ను చూస్తార‌న్నారు. హైద‌రాబాద్‌ను ప్ర‌పంచం గ‌ర్వించేలా తీర్చిదిద్దుతామ‌న్నారు. న‌గ‌రాన్ని ప్ర‌పంచ ప‌టంలో పెట్టేందుకు రూ.30 వేల కోట్ల‌తో రీజిన‌ల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్‌)ను నిర్మిస్తామ‌ని రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి అన్నారు. మ‌రీ ముఖ్యంగా అమెరికా త‌ర్వాత ఎన్ఎంసీ కంపెనీల హెడ్ క్వార్ట‌ర్స్ హైద‌రాబాద్‌లోనే ఉండ‌నున్నాయ‌న్నారు.

ఇదిలా వుండ‌గా హైద‌రాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒక్క‌టంటే ఒక్క సీటు కూడా రాలేదు. బీఆర్ఎస్‌కు అత్య‌ధికంగా హైద‌రాబాద్‌లోనే సీట్లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

హైద‌రాబాద్‌లో ప‌ట్టు కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. న‌గ‌రంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను త‌మ వైపు లాక్కోవాల‌నే ప్ర‌య‌త్నాలు పూర్తిస్థాయిలో స‌ఫ‌లీకృతం కాలేదు. అయిన‌ప్ప‌టికీ హైద‌రాబాద్‌ను అభివృద్ధి చేసి, ప్ర‌జాభిమానాన్ని చూర‌గొనాల‌నే ఆ పార్టీ ప్ర‌య‌త్నాల్ని అభినందించాల్సిందే.

3 Replies to “నాలుగు కార్పొరేష‌న్ల‌గా గ్రేట‌ర్ హైద‌రాబాద్‌!”

Comments are closed.