తిరుమ‌ల‌కు వీఐపీలు వ‌స్తే ఆర్భాటాలొద్దు

తిరుమ‌ల‌కు వీఐపీలు వ‌స్తే అధికారులు అన‌వ‌స‌ర‌మైన అర్భాటాలు , వృథా ఖ‌ర్చులు చేయొద్ద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు సూచించారు. తిరుమ‌ల శ్రీ‌వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా తిరుమ‌ల‌కు చంద్ర‌బాబు, ఆయ‌న స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి వెళ్లారు. ద‌ర్శనానంత‌రం…

తిరుమ‌ల‌కు వీఐపీలు వ‌స్తే అధికారులు అన‌వ‌స‌ర‌మైన అర్భాటాలు , వృథా ఖ‌ర్చులు చేయొద్ద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు సూచించారు. తిరుమ‌ల శ్రీ‌వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా తిరుమ‌ల‌కు చంద్ర‌బాబు, ఆయ‌న స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి వెళ్లారు. ద‌ర్శనానంత‌రం ఆయ‌న తిరుమ‌ల‌లో ప‌ద్మావ‌తి అతిథి గృహంలో శ‌నివారం టీటీడీ అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ తిరుమ‌ల‌కు ప్ర‌ముఖులు వ‌చ్చిన‌ప్పుడు హ‌డావుడి క‌నిపించొద్ద‌ని స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇవ్వ‌డం విశేషం. ఇత‌ర రాష్ట్రాలు, దేశాల నుంచి ఎవ‌రైనా భ‌క్తులు వ‌స్తే గౌర‌వించాల‌ని అధికారుల‌కు సూచించారు.

దైవ స‌న్నిధిలో సేవ‌లందిస్తున్న ఉద్యోగులు భ‌క్తుల‌తో దురుసుగా ప్ర‌వ‌ర్తించొద్ద‌ని సీఎం ఆదేశించారు. తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను కాపాడుతూ, టీటీడీ ప్ర‌తిష్ట‌ను పెంచేలా ప్ర‌తి ఒక్క‌రూ జాగ్ర‌త్త‌గా మెల‌గాల‌ని కోరారు.

ఏడు కొండ‌ల‌పై గోవింత నామ‌స్మ‌ర‌ణ త‌ప్ప‌, ఇత‌ర‌త్రా ఏ శ‌బ్దం వినిపించ‌కూడ‌ద‌న్నారు. తిరుమ‌ల‌లో అట‌వీ ప్రాంతాన్ని 72 శాతం నుంచి 80కి పెంచాల‌ని ఆయ‌న ఆదేశించారు. ల‌డ్డూ, అన్న‌ప్ర‌సాదం నాణ్య‌త‌ల‌ను మ‌రింత పెంచాల‌ని ఆయ‌న ఆదేశించ‌డం విశేషం. ఈ ద‌ఫా తిరుమ‌ల‌లో సొంత పార్టీ నాయ‌కులెవ‌రినీ చంద్ర‌బాబు వెంట పెట్టుకోక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కేవ‌లం చంద్ర‌బాబు దంప‌తులు మాత్ర‌మే పూజాది కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు.

9 Replies to “తిరుమ‌ల‌కు వీఐపీలు వ‌స్తే ఆర్భాటాలొద్దు”

  1. “తిరుమ‌ల‌లో అట‌వీ ప్రాంతాన్ని 72 శాతం నుంచి 80కి పెంచాల‌ని ఆయ‌న ఆదేశించారు”

    అల్కడ ఉన్న VIP భక్తులకు మాత్రం 50 % చాలని, అవసరం అయితే జంతువులకు cent భూమి చాలని అర్ధం అవుతుంది.

  2. రాజ్యాంగ పదవిలో ( ప్రెసిడెంట్, cji, పీఎం, సిఎం) వున్న వారికి తప్పించి మిగతా వారికి మామూలు క్యూ లో మాత్రమే దర్శనం పద్ధతి కొనసాగిస్తే మంచిది.

  3. MLA ఎంపీ ల రిఫరెన్స్ తీసి వెయ్యాలి ఎంపీ mla ల కుటుంబం మాత్రమే ఫ్రీ ఉండాలి

    1. అసలు దైవం దగ్గర ఎవరు ఎక్కువకాదు తక్కువకాదు ధర్మాన్ని ఆచరించేవాడే దైవానికి ఇష్టం మొత్తం స్పెషల్ దర్శనాలు డబ్బు దర్శనాలు అధికార దర్శనాలు తీసేసి ఎవరైనా సామాన్య భక్తుడులాగ వెళ్లే విధానాన్నే తీసుకు రావాలి

  4. భక్తుల మనోభావాలను పట్టించుకోక దురుసుగా ప్రకటన చేసింది మీరే బాబు, ఎలాగో వెళ్ళారుగా ఆ కలియుగదైవం కాళ్ళమీద పడండి.

Comments are closed.