భారతీయుడిపై తిరుగుబాటు?

భారీ అంచనాల మధ్య తెరకెక్కింది భారతీయుడు-2 సినిమా. సినిమా సెట్స్ పై ఉంటుండగానే దీనికి పార్ట్-3 కూడా ప్రకటించి, షూటింగ్ కూడా పూర్తిచేశారు. కేవలం పోస్ట్ ప్రొడక్షన్ మాత్రమే పెండింగ్. Advertisement అన్నీ అనుకున్నట్టు…

భారీ అంచనాల మధ్య తెరకెక్కింది భారతీయుడు-2 సినిమా. సినిమా సెట్స్ పై ఉంటుండగానే దీనికి పార్ట్-3 కూడా ప్రకటించి, షూటింగ్ కూడా పూర్తిచేశారు. కేవలం పోస్ట్ ప్రొడక్షన్ మాత్రమే పెండింగ్.

అన్నీ అనుకున్నట్టు జరిగితే భారతీయుడు-2 రిలీజైన 2 నెలల గ్యాప్ లోనే భారతీయుడు-3ను కూడా మార్కెట్లోకి తీసుకురావాలనేది ప్లాన్. కానీ అనుకున్నదొక్కటి, అయినదొక్కటి.

భారతీయుడు-2 సినిమా డిజాస్టర్ అయింది. తెలుగులోనే కాదు, తమిళ్ లో కూడా ఈ సినిమా పరిస్థితి ఇదే. బయ్యర్లు నిండా మునిగిపోయారు. అయినప్పటికీ వాళ్లలో ఏదో మూల ఆశ. భారతీయుడు-3 వస్తోంది కాబట్టి, తమ నష్టాల్ని ఆ మూవీతో భర్తీ చేస్తారనేదే ఆ ఆశ.

ఇప్పుడా ఆశ లేకుండా పోయింది. భారతీయుడు-3 సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తుందంట. వచ్చే ఏడాది ప్రారంభంలో నెట్ ఫ్లిక్స్ లో డైరక్ట్ గా ఈ సినిమాను స్ట్రీమింగ్ కు పెడతారనే టాక్ నడుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ అంతలోనే బయ్యర్లు భగ్గుమంటున్నారు. అయినకాడికి ఓటీటీకి అమ్ముకొని విడుదల చేస్తే, చేతులు కాల్చుకున్న తమ పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు.

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన భారతీయుడు-2 సినిమాకు వంద కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్టు చెబుతున్నారు. తెలుగులో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీలక్ష్మీ మూవీస్ రిలీజ్ చేశాయి. తెలుగు సంగతి పక్కనపెడితే, తమిళ్ లో ఈ సినిమాను డైరక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తే, మరో పెద్ద వివాదం రేగడం ఖాయం.

5 Replies to “భారతీయుడిపై తిరుగుబాటు?”

  1. ఎన్టీఆర్ బయోపిక్ లకు కూడా ఇలాగే రాసారు, మొదటి పార్ట్ నష్టాలు, రెండో దాంట్లో తీరుతాయి అని buyer లు ఆశ పడుతుంటే వేరేవాళ్లకి ఇస్తారు అన్నట్లు, తీరా మొదటి పార్ట్ కంటే ఘోరం గా రెండోది utter ఫ్లాప్ అయింది!

    1. కానీ బ్లాక్ ని వైట్ చెయ్యాలి అనే తాపత్రయం ముందు ఇలాంటి ఉదంతాలు ని ఎవరు గుర్తు పెట్టుకుంటారు సర్

Comments are closed.