లగ్జరీలో తగ్గనంటున్న హీరో

డబ్బులు వృధా చేయను. అలా అని లగ్జరీలో నేను తగ్గను. చిన్నప్పట్నుంచి ఎక్కడా తగ్గలేదు, ఇప్పుడూ అంతే.

హీరోలంతా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తారు. వాళ్లు వాడే యాక్ససిరీస్, వాహనాలు, ఉండే ఇల్లు, ఇలా అన్నీ రిచ్ గా ఉంటాయి. ఈ విషయంలో కొంతమంది బయటకు కనిపించరు. అంతమాత్రాన వాళ్లు లగ్జరీలో లేరని కాదు.

ఉదాహరణకు గోపీచంద్ నే తీసుకుంటే, ఈయన చాలా సింపుల్ గా ఉంటాడనేది బయట అభిప్రాయం. కానీ గోపీచంద్ మాత్రం తను చిన్నప్పట్నుంచి లగ్జరీ అంటున్నాడు.

“డబ్బులు వృధా చేయను. అలా అని లగ్జరీలో నేను తగ్గను. చిన్నప్పట్నుంచి ఎక్కడా తగ్గలేదు, ఇప్పుడూ అంతే. కాకపోతే ఓవర్ లగ్జరీకి వెళ్లను. నేను లగ్జరీగా ఉంటాను, నా ఫ్రెండ్స్ ను కూడా బాగా చూసుకుంటాను. ఎందుకంటే ఉన్నది ఒక్క లైఫ్. ఎంజాయ్ చేయాలి కదా.”

ఇలా లగ్జరీస్ విషయంలో తగ్గేదేలే అంటున్నాడు గోపీచంద్. అలా అని హంగుల కోసం వెళ్లను. కాకపోతే ఎదుటివాడికి చూపించడం కోసం డబ్బు ఖర్చు చేయనని.. తన బతుకేదో తను బతుకుతానంటున్నాడు. ఎప్పట్లానే ఈ హీరో, తన తాజా ఫ్లాప్ పై ఓపెన్ గా స్పందించాడు.

“భీమా సినిమాలో ఓ చిన్న బ్లాక్ తేడా కొడుతుందనే అనుమానం నాకు ముందే ఉంది. అది నిజంగానే కొట్టింది. మిగతాదంతా వర్కవుట్ అయినప్పటికీ, నేను అనుకున్న బ్లాక్ తేడా కొట్టడం వల్ల మొత్తం పోయింది. ఇక రామబాణం పోతుందని నాకు ముందే తెలుసు. అది ఫ్లాప్ అవుతుందని చాలా ముందే తెలిసిపోయింది నాకు.”

మరోసారి విలన్ గా నటించే ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు గోపీచంద్. అయితే ప్రభాస్ సినిమాలో విలన్ ఆఫర్ వస్తే మాత్రం చేస్తానని ప్రకటించాడు. ఇతడు నటించిన విశ్వం సినిమా విడుదలకు సిద్ధమైంది.

7 Replies to “లగ్జరీలో తగ్గనంటున్న హీరో”

Comments are closed.