పుష్ప 2.. క్వాలిటీ వస్తుందా ఈ స్పీడ్ తో..!

ఎన్ని ఏళ్లుగా షూట్ చేస్తున్నా, లాస్ట్ మినిట్ హడావుడి తప్పడం లేదు పుష్ప 2 సినిమాకు. గట్టిగా రెండు నెలలు అంటే 60 రోజులు టైమ్ లేదు. కానీ ఇంకా షూట్ చేస్తూనే వున్నారు.…

ఎన్ని ఏళ్లుగా షూట్ చేస్తున్నా, లాస్ట్ మినిట్ హడావుడి తప్పడం లేదు పుష్ప 2 సినిమాకు. గట్టిగా రెండు నెలలు అంటే 60 రోజులు టైమ్ లేదు. కానీ ఇంకా షూట్ చేస్తూనే వున్నారు. ఇంకెప్పుడు పోస్ట్ ప్రొడెక్షన్ వర్క్ చేస్తారో. ప్రస్తుతానికి అయితే తొలిసగం ఎడిట్ లాక్ అయిందని మీడియాకు లీకులు ఇచ్చారు. ఈ మధ్య ఈ సినిమా కోసం ఒకేసారి మూడు యూనిట్ లు వర్క్ చేశాయి. ఒక్క యూనిట్ లో మాత్రమే దర్శకుడు సుకుమార్ వున్నారు. మిగిలిన రెండు యూనిట్ లు సుకుమార్ అసిస్టెంట్ లు వర్క్ చేశారని తెలుస్తోంది.

ఈ మూడు యూనిట్ లు యానాం, కాకినాడ, రంపచోడవరం, విశాఖ ఇలా పలు చోట్లు చిత్రీకరణ సాగించాయి. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ కట్ రెడీ అయింది కనుక రీ రికార్డింగ్ పని మొదలు కావచ్చు. తరువాత సెకండాఫ్ కట్ లాక్ కావాలి. అలా లాక్ కావాలి అంటే అస్సలు ఇక షూట్ అన్నది వుండకూడదు. అది ఎప్పటికి అన్నది మాత్రం జ‌వాబు తెలియని ప్రశ్న.

అసలే పుష్ప 2 మీద భారీ ప్రెజ‌ర్ వుంది. దేవర కలెక్షన్ల రికార్డులు దాటాలి, యాంటీ ఫ్యాన్స్, తెలుగుదేశం సోషల్ మీడియాను తట్టుకోవాలి. అప్పుడు కానీ సినిమా థియేటర్లలో అనుకున్న ఫీట్ సాధించడం కష్టం అవుతుంది. దేవర సినిమాకు అటు డిజిటల్ మీడియా సపోర్ట్, ఇటు సోషల్ మీడియా సపోర్ట్ బలంగా దొరికింది. కానీ పుష్ప 2 కు అలా దొరుకుతుందా అన్నది అనుమానమే. ఈ విషయంలో బన్నీ స్వంత డిజిటల్ టీమ్ మీద భారీ వత్తిడి తప్పదు. సినిమా విడుదలకు ముందు ఎంత వుంటుందో, విడుదలయ్యాక అంతకు డబుల్ వుంటుంది.

వీటన్నింటిని దృష్టిలో వుంచుకుని పుష్ప 2 క్వాలిటీ వుంటాల్సి వుంటుంది.

8 Replies to “పుష్ప 2.. క్వాలిటీ వస్తుందా ఈ స్పీడ్ తో..!”

Comments are closed.