ఫ‌లితాల‌ను మార్చేశారు.. కాంగ్రెస్ వాద‌న‌!

హ‌ర్యానా ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై కాంగ్రెస్ పార్టీ అనుమానాల‌ను వ్య‌క్తం చేస్తూ ఉంది, అనుమానాల‌ను వ్య‌క్తం చేయ‌డ‌మే కాదు, ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను మార్చేశార‌ని, వ్య‌వ‌స్థ‌ల‌ను బీజేపీ వాడుకుంటూ ఉందంటూ ఆ పార్టీ అధికార ప్ర‌తినిధులు వాదిస్తున్నారు.…

హ‌ర్యానా ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై కాంగ్రెస్ పార్టీ అనుమానాల‌ను వ్య‌క్తం చేస్తూ ఉంది, అనుమానాల‌ను వ్య‌క్తం చేయ‌డ‌మే కాదు, ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను మార్చేశార‌ని, వ్య‌వ‌స్థ‌ల‌ను బీజేపీ వాడుకుంటూ ఉందంటూ ఆ పార్టీ అధికార ప్ర‌తినిధులు వాదిస్తున్నారు. కాంగ్రెస్ నేత జైరాం ర‌మేష్ హ‌ర్యానా ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై స్పందిస్తూ ఫ‌లితాల‌ను మార్చేశార‌నే వాద‌న‌ను వినిపించారు. ప్ర‌జ‌ల సెంటిమెంట్ల‌ను, దేన్నీ ప‌ట్టించుకోకుండా బీజేపీ వ్య‌వ‌స్థ‌ల‌ను వాడుకుంటూ ఉందంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు. హ‌ర్యానా ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై త‌మ‌కు అనుమానాలు ఉండ‌ట‌మే కాదు, అక్క‌డ ఫ‌లితాలు మార్చివేయ‌బ‌డ్డాయి అని జైరాం ర‌మేష్ బ‌ల్ల‌గుద్ది వాదిస్తూ ఉన్నారు.

హ‌ర్యానా ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం అంటూ ఎగ్జిట్ పోల్ స‌ర్వేలన్నీ బ‌ల్ల‌గుద్ది చెప్పాయి. హ‌ర్యానా ఎన్నిక‌ల విష‌యంలో బీజేపీ గెలుస్తుంద‌ని చెప్పిన స‌ర్వేలు చాలా చాలా తక్కువ‌. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీకి దేశంలో సొంతంగా బ‌లం ద‌క్క‌క‌పోవ‌డం, హ‌ర్యానాలో ప‌దేళ్ల నుంచి ఆ పార్టీ అధికారంలో ఉండ‌టం.. స‌హ‌జంగానే ప్ర‌జావ్య‌తిరేక‌త ఉంటుంద‌నే అంచ‌నాలో ఏమో కానీ.. వీటితో పాటు హ‌ర్యానాలో కాంగ్రెస్ కు ఇంకా పునాదులు ఉండ‌టంతో.. అక్క‌డ ఈ సారి కాంగ్రెస్ పార్టీ జ‌య‌కేత‌నం ఎగ‌రేయ‌డం ఖాయ‌మ‌నే అంచ‌నాలే స‌ర్వ‌త్రా వ్య‌క్తం అయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ మూకుమ్మ‌డిగా కాంగ్రెస్ పార్టీకి విజ‌యం ఖ‌రారు అనే ప్ర‌చారం చేశాయి.

ఫ‌లితాల వెల్ల‌డిలో తొలి రౌండ్స్ లో కూడా ఇదే ప‌రిస్థితి క‌నిపించింది. కాంగ్రెస్ పార్టీ దూసుకుపోయింది. మినిమం మెజారిటీ సీట్ల‌లో తొలి రౌండ్ల‌లో ముందంజ‌లో నిలిచింది. అయితే ఆ త‌ర్వాత ఫ‌లితాలు తిర‌గ‌బ‌డ్డాయి. అనూహ్యంగా బీజేపీ లీడ్ లోకి వ‌చ్చింది, రావ‌డ‌మే కాకుండా అదే ఆధిక్యాన్ని కొన‌సాగించి అధికారాన్ని మ‌రోసారి సొంతం చేసుకుంది. వ‌ర‌సగా మూడో ప‌ర్యాయం అక్క‌డ క‌మ‌లం పార్టీ అధికారాన్ని చేప‌డుతున్న‌ట్టుగా ఫ‌లితాలు వెల్ల‌డి అయ్యాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఆక్షేపిస్తూ ఉంది. నిస్సందేహంగా అక్క‌డ ఫ‌లితాలు మార్చేశార‌నే వాద‌న‌ను కాంగ్రెస్ వినిపిస్తూ ఉంది.

అయితే ఎన్నిక‌ల క‌మిష‌న్ ఈ వాద‌న‌ను తిర‌స్క‌రించింది. కౌంటింగ్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల స‌మ‌క్షంలో కూడా జ‌రుగుతోంద‌ని ఈసీ వాదిస్తోంది. దీనిపై బీజేపీ స్పందిస్తూ హ‌ర్యానా ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై కాంగ్రెస్ కు విశ్వాసం లేదంటే రాజ్యాగంపై కూడా విశ్వాసం లేన‌ట్టే అంటూ బీజేపీ నేత‌ల స్మృతీ ఇరానీ వాదిస్తున్నారు!

5 Replies to “ఫ‌లితాల‌ను మార్చేశారు.. కాంగ్రెస్ వాద‌న‌!”

  1. అయ్యయ్యో ఎంత పని జరిగిపోయింది …మీ లాంటి ధర్మ ప్రభువులకి ఇంత కష్టమా …పోనీ ఒక పని చెయ్యండి …వచ్చే ఎన్నికలు నుండి పోటీ చెయ్యకండి కాశ్మీర్ లోన మీరు మీ కూటమి సభ్యులు …హర్యానా లో గెలిచొన్లు అందరు రాజీనామా చేసేయడండి …రాజకీయ సన్యాసం ప్రకటించండి ..

  2. చేతి దాక వచ్చిన దాన్ని నోటి దాక తెచ్చుకులేని మీరు …ఇంకా ప్రజలు బతుకులు ఎలా ఉద్ధరిస్తారు …జనాలకి అవతల పార్టీ మీద కోపం వచ్చి వాళ్ళని ఓడించాలి కానీ మీ వల్ల ఏమి కాదు …

Comments are closed.