ఆ లెక్కలు అబద్ధం అని చెప్పే ధైర్యముందా?

‘తమరు పచ్చినెత్తురు తాగుతున్నారు సార్’ అని ఎవరైనా ఆరోపణలు చేసినప్పుడు.. దానికి జవాబుగా ‘మీరు పలానా సందర్భంలో తాగినది లేడినెత్తురు, పలానా సమయంలో తిన్నటువంటిది కుందేలు మాంసం’ వంటి కాకమ్మ కబుర్లు చెప్పడం వలన…

‘తమరు పచ్చినెత్తురు తాగుతున్నారు సార్’ అని ఎవరైనా ఆరోపణలు చేసినప్పుడు.. దానికి జవాబుగా ‘మీరు పలానా సందర్భంలో తాగినది లేడినెత్తురు, పలానా సమయంలో తిన్నటువంటిది కుందేలు మాంసం’ వంటి కాకమ్మ కబుర్లు చెప్పడం వలన ఉపయోగం ఏమైనా ఉంటుందా?

విజయవాడ వరద బాధితులకు సాయం అందించే ముసుగులో వందల కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం స్వాహా చేసేసిందని ప్రజలు నమ్ముతూంటే.. వారు చూపిస్తున్న అధికారిక గణాంకాలన్నీ అందుకు రుజువులుగా కనిపిస్తోంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ నిశితవిమర్శలు కురిపిస్తూంటే.. చంద్రబాబు తైనాతీలు మాత్రం.. డొంకతిరుగుడు జవాబులు చెబుతున్నారు.

వరదసాయం లెక్కల్లో చూపించినట్లుగా భోజనాలకు 368 కోట్లు, నీళ్ల బాటిళ్లకు 26 కోట్లు తదితర వ్యవహారాల్లో కూడా అదే రేంజిలో ఖర్చు పెట్టామని వస్తున్న మాటలు అబద్ధాలు. అది తప్పుడు ప్రచారం అనే మాట ప్రభుత్వ పెద్దల నుంచి రావడం లేదు. అసలు వారు చేసిన పాపం గురించి నామమాత్రంగా కూడా ప్రస్తావించకుండా.. ఇతర విషయాలను మాట్లాడుతూ.. తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయడానికి దిగజారుడు రాజకీయం చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చుని అడ్డగోలు వాదనలతో నానా చెత్త మాట్లాడడానికి అలవాటు పడిన నిలయవిద్వాంసుడు కొమ్మారెడ్డి పట్టాభిరాం మాట్లాడుతూ.. పరిహారాల పంపిణీ గురించి వైసీపీ దుష్ప్రచారం చేస్తున్నదని అంటున్నారు. ఎలా దుష్ప్రచారమూ కూడా చెబితే బాగుండేది. నీళ్లకు 26 కోట్లు లెక్క రాసిన మాట అబద్ధం అని ధైర్యంగా చెబితే చాలా బాగుండేది.

ఆ సంగతులేం మాట్లాడకుండా.. గతంలో వరదలు వస్తే జగన్ కేవలం రూ.4వేల పరిహారం మాత్రమే ఇచ్చారని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి సచివాలయాలకు రంగులు వేశారు, సర్వేరాళ్లపై జగన్ బొమ్మకోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఎగ్ పఫ్ లకు మూడున్నర కోట్లు మింగేశారు.. అని నానా మాటలు అంటున్నారు. ఎగ్ పఫ్ ల విషయంలో ఏదైనా తేడా ఉంటే ఇప్పటి విమర్శలకు కనీసం ప్రతి విమర్శగా అయినా పనికి వస్తుంది. అలాకాకుండా.. ఏమాత్రం ఆధారం లేని పసలేని మాటలతో.. వైసీపీని ఆడిపోసుకోవాలని అనుకోవడం చవకబారుతనం.

తమ మీద వస్తున్న ఆరోపణలకు, తాము జవాబు చెప్పడం లేదు. గత ప్రభుత్వ కాలంలో జగన్ మీద ఉన్న ఆరోపణలు అన్నింటినీ ఏకరవు పెడుతున్నారు. దీనివల్ల ప్రయోజనం ఏముంటుంది? అధికారంలో ఉన్నవారు సుద్దపూసలని, వరదసాయంలో వారు ఒక్క పైసా కూడా కాజేయలేదని ప్రజలు అనుకుంటారా? ఇంత స్పష్టంగా లెక్కల్లో ఉన్న తేడాలని వైసీపీ చెబుతోంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో మరింతగా భ్రష్టు పట్టిపోతున్నదని పలువురు అంచనా వేస్తున్నారు.

9 Replies to “ఆ లెక్కలు అబద్ధం అని చెప్పే ధైర్యముందా?”

  1. పనికిమాలిన ఒక బిల్డింగ్ కి 500 కోట్లు దుబారా చేసారు…వాటి తో పోలిస్తే ఇది ఎంత..జుజుబీ

    1. 5 బిల్డింగ్స్ ర.. లు tcha … వాటిలో.. చివరిది.. మొదటి మూడింటి అంత పెద్దది. Semi-circle షేప్ లో కట్టారు. గజ D0 NG @ బొల్లి గాడు.. ఒక్క Sq ఫీట్ 15000/- కి ఖర్చుపెట్టినట్టు Bramaravathi బిల్డింగ్స్ కి అది మర్చి పోయావేంటి ర.. B0 G@ ఎం K0 D @K@ మీ అమ్మగారి పువ్వు లో.. అందరి మొగ్గితేడితే.. పుట్టిన.. B0 G@ మవెధవనిజాలు మాట్లాడ ర..!!

      1. సెమి సర్కిల్ లో ఉన్న, పూర్ణ చంద్ర ఆకారం లో ఉన్న, ఎందుకు పనికిరాని వాటికి 500 కోట్లు బొక్క. ఇక స్క్వేర్ ఫీట్ కి 15000 అనేది ప్రెటం బాచ్ అలవాటు ప్రకారం అయినా ఫేక్ ప్రచారం. అసలు అయిన ఖర్చు 9500, ఇంటీరియర్ తో కలిపి. ఇక గత11 ఏళ్లుగా అక్కడ సెక్రటేరియట్ నడుస్తుంది. అసెంబ్లీ నడుస్తుంది. కోర్ట్ నడుస్తుంది.మన తుంటి నత్థి పకోడిగాడి మాదిరి ఎందుకు పనికిరాకుండా కట్టిన దెయ్యాల కొంపలు కాదుగా

  2. రాజా గారు, ఏ పార్టీని సపోర్ట్ చేయడం మీ ఇష్టం కానీ, చదువుకున్నవాళ్లం కదా, మన మనిషితనం తగ్గించుకొని, ఒక పార్టీకోసం పూర్తిగా వంగిపోవడం తగదు. జీవితం అనేది ఈ రాజకీయాలకంటే చాలా గొప్పది. మీరంతా పార్టీలో మునిగిపోయి, ఎంత మోజు పడ్డారో కాస్త ఆలోచించండి, ఇది మంచిదే కాదు!

    మీరు మతం మార్చుకున్నారేమో, అదేమో మీ వ్యక్తిగత నిర్ణయం, మన తెలుగోళ్ళం అందరినీ గౌరవించాలి కదా! మతం మార్చుకోవడం గొడవేం కాదు, మీ ఇష్టం. కాని, జగనన్నను సపోర్ట్ చేస్తూ, మీ పూర్వికుల మతం అయిన హిందూ ధర్మాన్ని తప్పు చూపడం తగదు. మన పూర్వికులు హిందువులు, వాళ్లు మనకు గౌరవం నేర్పారు, మీరు ఏ మతాన్ని ఫాలో అయినా కానీ, వాళ్ల మతం మీద ద్వేషం పెట్టుకోవడం మీకే నష్టం.

    మన ఆంధ్ర సంస్కృతి ఎప్పుడు అందర్నీ కలుపుకొని పోతూ, గౌరవం, సహనం నేర్పింది. మన రాష్ట్రాల్లో ఎంత మంది క్రైస్తవులే NDA కూటమికే ఓటు వేశారు. రాజకీయాల కోసం మతం మీద కోపం పెట్టుకోవడం, తక్కువ చేయడం అవసరం లేదు. మీరు జగనన్నను సపోర్ట్ చేయండి, మీ మతంలో సంతోషంగా ఉండండి, కానీ హిందూ మతాన్ని గౌరవించండి.

    రాజా గారు, ఈ ద్వేషం నుంచి బయటపడండి. మనిషి జీవితమే చిన్నది, అది కూడా ఈ హేట్రెడ్ మీద పెట్టుకోవడం తగదు. మన తెలుగు సంస్కృతి మనకు అందర్నీ గౌరవించాలనే నేర్పించింది. ఇది వదిలేసి, శాంతి, సత్సంబంధాలతో ఉన్న జీవితం గడపండి. అప్పుడే మీరు నిజమైన సంతోషాన్ని పొందుతారు. అదే మనందరికీ కావాల్సింది

  3. ఆరోపణలు or సాక్షం చెప్పేవాడి కారెక్టర్ కూడా చాలా important!! suppose for suppose నీ పేపర్ లో ఏదన్న నేషనల్/ ఇంటర్నేషనల్ news వేస్తే దాన్ని నమ్మలేని జనాలు ఈనాడు or Hindu పేపర్ చూసి verify చేసుకున్నట్లు, ఇదీ అంతే!!!

Comments are closed.