త్రివిక్రమ్- సమంత.. రీ యూనియన్

సమంత- త్రివిక్రమ్ అంటే అ..ఆ, అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి వంటి సినిమాలు మనకు వెంటనే గుర్తుకొస్తాయి. వారి స్నేహం గురించి అప్పట్లో గాసిప్స్ కూడా వినిపించాయి, అయితే ఆ సంగతులు ఇప్పటికి…

సమంత- త్రివిక్రమ్ అంటే అ..ఆ, అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి వంటి సినిమాలు మనకు వెంటనే గుర్తుకొస్తాయి. వారి స్నేహం గురించి అప్పట్లో గాసిప్స్ కూడా వినిపించాయి, అయితే ఆ సంగతులు ఇప్పటికి అందరూ మరిచిపోయారు. అవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు మళ్లీ త్రివిక్రమ్- సమంత రీయూనియన్ అంటూ చర్చ మొదలైంది.

ఎందుకంటే, కారణం లేకుండా త్రివిక్రమ్ ఎప్పుడూ ఏమీ మాట్లాడరని పెద్దలు అంటారు. ఇటీవల ఓ ఫంక్షన్‌లో త్రివిక్రమ్ మాట్లాడిన మాటలు విన్నప్పుడు, సమంత త్వరలో త్రివిక్రమ్ సినిమాలో కనిపించే అవకాశం ఉందని అనిపిస్తోంది.

ముంబై నుంచి సమంత హైదరాబాద్ రావాలని, ఫ్యాన్స్ ఇందుకోసం ఒక హ్యాష్‌ట్యాగ్‌ని ట్విట్టర్‌లో ట్రెండ్ చేయాలని త్రివిక్రమ్ పిలుపునిచ్చారు. బన్నీ అయితే ఏమాయ చేసావె సినిమా నుంచి సమంతకు పెద్ద ఫ్యాన్ అని త్రివిక్రమ్ వెల్లడించారు.

“సమంత చేయదేమో అన్న భయంతో నేను ఆమె కోసం పాత్రలు రాయడం లేదు” అని త్రివిక్రమ్ అన్నారు. “రాయండి” అని సమంత సైగ చేయడం, “రాస్తా” అని త్రివిక్రమ్ అనడం ఆ ఫంక్షన్‌లో ఓ ప్రత్యేక ఆకర్షణగా మారింది.

త్వరలో బన్నీతో త్రివిక్రమ్ ఓ పాన్- ఇండియా, భారీ మైథలాజికల్ టచ్ ఉన్న సినిమా చేయబోతున్నారు. అలాంటి సినిమాలో చాలా పాత్రలు ఉంటాయి. బన్నీ పుష్ప సినిమాలో సమంత తన ప్రత్యేక గీతంతో మెరిసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సినిమా ఉత్తర భారతంలో సక్సెస్ అవడానికి సమంత కూడా ఒక ముఖ్య కారణం.

అందువల్ల, మరొకసారి త్రివిక్రమ్- బన్నీ కాంబినేషన్ సినిమాలో సమంత కనిపిస్తుందేమో అనేది ఆసక్తికరమైన ప్రశ్న. మైథలాజికల్ టచ్ ఉన్న సినిమా అంటే, సమంత లేకుండా ఎలా?.

7 Replies to “త్రివిక్రమ్- సమంత.. రీ యూనియన్”

  1. మైథలాజికల్ సినిమాలో డబ్బింగ్ చిన్మయి చేత చెప్పిస్తే బెటర్. మొన్న శాకుంతలం cinema లో ఆమె సొంత డబ్బింగ్ వినలేకపోయాం

  2. ఈ గ్రేట్ ఆంధ్ర వాడికి ఒక చిరంజీవి సినిమా చిరంజీవి కొడుకు సినిమా తప్ప అందరు సినిమాలో ఏవో వంకలు పెడుతూనే ఉంటాడు, అందులోనూ ఎన్టీఆర్ సినిమాలు అస్సలు బాగాలేవు అంటాడు, ఆయనే మూడు గంటల సినిమా కథ చెప్తాడు తల, మీసాలు రెండు నేరిసిపోయాయి అయిన కూడా బుద్ధి రావట్లే

Comments are closed.