గేమ్ ఛేంజర్: ఇలా హింట్ ఇచ్చి, అలా డిలీట్

చిరు లీక్స్ టైపులో తమన్ లీకులివ్వడు, అతడు హింట్స్ ఇస్తాడు. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ పై ముందుగా హింట్ ఇచ్చింది ఇతగాడే. ఇప్పుడు అదే సినిమాపై మరో హింట్ కూడా ఇచ్చాడు. అయితే…

చిరు లీక్స్ టైపులో తమన్ లీకులివ్వడు, అతడు హింట్స్ ఇస్తాడు. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ పై ముందుగా హింట్ ఇచ్చింది ఇతగాడే. ఇప్పుడు అదే సినిమాపై మరో హింట్ కూడా ఇచ్చాడు. అయితే ఇది మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ మాత్రం కాదు.

దసరాకు గేమ్ ఛేంజర్ టీజర్ వచ్చేది అనుమానమే అంటున్నాడు తమన్. ఈ మేరకు అతడు ట్వీట్ కూడా వేశాడు. “సపోజ్ దసరాకు టీజర్ రాకపోతే నిరాశ చెందకండి” అంటూ బాహాటంగానే చెప్పాడు. దీంతో టీజర్ పై అనుమానాలు మొదలయ్యాయి

“గేమ్ ఛేంజర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు భారీ ఎత్తున జరుగుతున్నాయి. టీజర్ వలన మా పనులకు బ్రేకులు పడుతున్నాయి. దసరాకు టీజర్ రాకపోతే దీపావళికి ఉంటుంది. ఎప్పుడొచ్చినా బ్లాస్ట్ గ్యారెంటీ.”

మరోవైపు లిరికల్ వీడియోస్ మాత్రం రెడీ అయ్యాయని, 30వ తేదీకి మూడో సాంగ్ వస్తుందని ప్రకటించాడు తమన్. అయితే ఇలా చెప్పిన 2-3 గంటలకే తన పోస్టులన్నింటినీ అతడు డిలీట్ చేశాడు.

టీజర్ పై అనుమానం వచ్చేలా ట్వీట్ పెట్టిన వెంటనే నిమిషాల వ్యవథిలో తమన్ పై ట్రోలింగ్ మొదలైంది. మెగా ఫ్యాన్స్ మొత్తం అతడిపై విరుచుకుపడ్డారు. మరి ఈ ట్రోలింగ్ తో ఇబ్బంది పడ్డాడో లేక దిల్ రాజు నుంచి ఆదేశం వచ్చిందో ఏమో.. వెంటనే తన పోస్టుల్ని డిలీట్ చేశాడు.

అయితే ఇప్పటికీ అవి వైరల్ అయిపోయాయి. పోస్టులు డిలీట్ చేసినా, ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు. నేను ఎక్కడికీ వెళ్లను, ట్విట్టర్ లోనే ఉంటానంటూ తనకుతాను ప్రకటించిన తమన్, నిమిషాల్లో అదే ట్విట్టర్ నుంచి మాయమయ్యాడు.

4 Replies to “గేమ్ ఛేంజర్: ఇలా హింట్ ఇచ్చి, అలా డిలీట్”

Comments are closed.