లడ్డూకి టోపీ పెట్టించిన గొప్పోళ్లు

రాజ‌కీయ నాయకులు అందరూ కలిసి అదే తిరుపతి లడ్డూకి టోపీ పెట్టించడం చూస్తే మనసు చివుక్కు మంటోంది.

ఇన్నాళ్లు తిరుపతి లడ్డూను చూడగానే కళ్లకు మొక్కడమే తెలుసు. ఇప్పుడు రాజ‌కీయ నాయకులు అందరూ కలిసి అదే తిరుపతి లడ్డూకి టోపీ పెట్టించడం చూస్తే మనసు చివుక్కు మంటోంది. దేశంలోని ఓ పాపులర్ మాగ్ జైన్ కవర్ మీద లడ్డు బొమ్మ వేసి, దానికి పొలిటికల్ టోపీ పెట్టడం చూసి బాధనిపిస్తోంది. మరే మత చిహ్నానికి అయినా ఇలా టోపీ తగిలించి కవర్ మీద వేసే దమ్ము.. ధైర్యం మన మీడియా కు వుందా?

దీనికి కారణం టీటీడీని ఏలిన పెద్దలు.. ఇప్పుడు ఏలుతున్న చంద్రబాబు. నిబంధనలు సవరించడం, తక్కువకు కొన్నామనే పేరిట కల్తీ నెయ్యిని రప్పించడం అలనాటి సుబ్బారెడ్డో.. కరుణాకరరెడ్డినో చేస్తే.. దాన్ని గుట్టుగా విచారణ చేసి, దోషులను లోపల వేయడం మానేసి, కేవలం జ‌గన్ ను హిందువుల ముందుగా దోషిగా నిలబెట్టాలన్న తహతహ చంద్రబాబు ప్రదర్శించారు.

దీంతో పవిత్రంగా నోట్లో వేసుకునే లడ్డూ కాస్తా, దేశ వ్యాప్తంగా పదుగురి నోళ్లలో నానింది. నెయ్యి మీద అనుమానం వచ్చి వెనక్కు పంపాం. శాంపిల్స్ చూస్తే కల్తీ అని తేలిందని తిరుమల కార్య నిర్వహణాధికారి చెప్పిన మాట వెనక్కుపోయింది. కల్తీ నెయ్యి వాడారంటూ చంద్రబాబు చెప్పిన మాట ముందుకు వచ్చింది. అంటే వెనక్కు పంపడానికి ముందే వేరే ట్యాంక్ లు లొపలకు అనుమతించారు అని చంద్రబాబు చెప్పినట్లు అయింది. అంతే తప్ప అలా అనుమతించిన వారి మీద చర్యలు లేవు. ఈ లోగా సిట్ వచ్చి పడింది. అది ఎప్పటిలో తేలుతుంది.

ఈ లోగా అసలు నెయ్యి సరఫరా జంతర్ మంతర్ వ్యవహారాలు బయటకు వచ్చాయి. ఎక్కడో డైరీ, ఇక్కడ డైరీలో వాటా తీసుకుని, మరెక్కడి డైరీతోనో టెండర్ వేయించి, అక్కడి నుంచి ఇక్కడకు, ఇక్కడ నుంచి అక్కడకు నెయ్యి సరఫరా చేసిన వైనం బయటకు వచ్చింది. దీనికి ఎవరు బాధ్యులు. సుబ్బారెడ్డా? కరుణాకర్ రెడ్డినా? లేక సర్వం తానై వ్యవహరించిన ధర్మారెడ్డినా?

నిజానికి చంద్రబాబు మొదటి నుంచీ చేయాల్సింది నిజం నిగ్గు తేల్చడం అంతే తప్ప జ‌గన్ ను దోషిని చేయాలనే ప్రయత్నం కాదు. కానీ చంద్రబాబు అదే దోవలో వెళ్లడం వల్ల ఏమయింది. లడ్డూ అన్నది చర్చల్లోకి చేరింది. రాజ‌కీయ చర్చలు. ధర్మ సంరక్షణ ఇలా ఎటో వెళ్లిపోయింది.

కల్తీ నెయ్యికి ఎవరు బాధ్యులు అన్నది ఎలా కీలకమో, ఇలాంటి ప్రాపగండా జ‌రిగి భక్తుల మనోభావాలు, విశ్వాసాలను బలహీన పర్చేలా చేసింది చంద్రబాబు అన్నది అంతే కీలకం.

ఇక ఎప్పటికీ ఈ అనుమానం భక్తుల మనసుల్లోంచి పోదు. చంద్రబాబు హయాంలో మాత్రం డైరీలు శుద్దమైన నెయ్యి సరఫరా చేస్తాయనే నమ్మేయాలా? నందిని నో, మరో డైరీనో, కాంపిటీటివ్ బిడ్డింగ్ లో టెండర్ గెల్చుకున్న వాళ్లు తక్కువ రేటుకు నెయ్యి సరఫరా అంటే ఎలా వుంటుంది. ఎటొచ్చీ చంద్రబాబు చేసిన యాగీ మిగతా వాళ్లు చేసే అవకాశం లేకపోవచ్చు. ఎందుకంటే చంద్రబాబుకు వున్న మీడియా ప్లానింగ్ మిగిలిన వారికి లేదు కదా.

ఇకపై పెట్రోలు బంకులలో మాదిరిగా క్వాలిటీ చెక్ కు ట్యాంక్ వచ్చినపుడల్లా పబ్లిక్ పార్టిసిపేషన్ తో చెకింగ్ చేయించాలి. పబ్లిక్ సాక్ష్యం నమోదు చేయాలి. అప్పుడు ఏమన్నా పరిస్థితి మారొచ్చు. కానీ అలా చేయడం అన్నది రాజ‌కీయ నాయకుల ఉద్దేశం కాదు. బురద జ‌ల్లడం మాత్రమే లక్ష్యం.

30 Replies to “లడ్డూకి టోపీ పెట్టించిన గొప్పోళ్లు”

  1. ఇంతకీ.. ఆ ఫొటోలో ఉన్న లడ్డు .. గొడ్డు మాంసం కలిపిన తర్వాత లడ్డూనా.. లేక.. జగన్ రెడ్డి మోసం బయట పడిన తర్వాత చేసిన లడ్డూనా..?

    1. Nuvvu ee thokkalo comment petti jagan meedha edho pisachika Anandham pondhi devudini avamanchinandhuku nee ku jarige keede neeku kanuvippu aviddi. Chusthuvundu

  2. అవును మరి మనం ఏదన్నా చేసుకోవచ్చు బయటికి మాత్రం అవి రాకూడదు . ఏమి రా నయన కల్తీ చేసింది nijam న్యాయంగా మంచు నెయ్యి ఇస్తున్న నందిని ని తప్పించారు . ఒక్కసారి నందిని ని చెక్ చెయ్యి ఎప్పుడు ఎస్ వాల్యూ 90 దాటుతుంది ఎందుకు నువ్వు క్వాలిటీ గురించి పవిత్రత గురించి బాధ పడకు ఇది బాబు గారి.పాలన

  3. So sad…. మొన్న ELECTIONS లో AP కొట్టిన దెబ్బకు ఈ ఇండియా TOODAY గాడు బాగా UPSET ఐనట్టున్నాడు పాపం…..

  4. ఇది 100% వా*టి*క*న్ గొ*ర్రె ja*** చేసిన పనే , నో డౌట్ !! ఇండియా టుడే వేసిన టైం మ్యాగజైన్ లో వేసిన నిజం అబద్ధం అయిపోదు !! ఇదేమి హిం*దు*త్వం ఇదేమి మ*తం అన్నప్పుడే ఇది ఈ ని*కృ*ష్టు*డు పనే అని నీకు అర్థం కావాలి!!

  5. అదే హిందూ మతానికి మన దేశం లో జరుగుతున్న అన్యాయం!! ప్రతిఒక్కరికీ లోకువ !! దీనికి కల్తీ జరిగింది అని చెప్పిన CBN గారు ఎలా కారణమో నువ్వే చెప్పాలి వా*టి*క*న్ గొ*ర్రె !!

    1. జగన్ రెడ్డి ఎంట్రప్రెన్యూర్ ఎలా అయ్యాడో కూడా గూగుల్ లో వెతుక్కోమంటున్నాడు..

      గూగుల్ లో వెతికితే.. 16 నెలల జైలు శిక్ష డీటెయిల్స్ వస్తున్నాయి..

  6. The worst politics of low grade we saw for the last three weeks in Indian history. This much low of politics, journalism, manipulations……never imagined. Need to see where we end up!

  7. ఈ India today సంగతి అందరికీ తెలిసిందె!

    వీళ్ళ ద్రుష్టిలొ మినారిటీల కి ప్రత్యెక హక్కులు అంటె అభ్యుదయం, అదె హిందువుల హక్కులు అంటె రాజకీయం.

  8. Seriously GA! Do you want the investigation to happen secretly and punish the culprits? If an investigation happens secretly and someone is found guilty, it could create a big issue if they’re arrested. The government would need to explain its actions, especially if it’s a well-known figure. Keeping things quiet might avoid immediate drama, but it can also look suspicious. It’s very important to stay transparent with managing public reactions. As usual, you are such a big hypocritical bigot.

    1. Here the point is that, do investigation secretly. But when u make a public statement, come up with strong evidences and let courts take further action. This is what happened in CBN’s arrest. Why no one was able to question Jagan’s move other than political leaders. Because he substantiated his action and produced preliminary evidences in front of Court.

      Why not the similar kind of strategy employed. It just went on like ONE LAKH CRORES waslooted by Jagan.

  9. హిందు దేవుళ్ళ మీద జోకులు… వెటకారాలు మానమనే పవన్ చెప్పుతోంది

  10. ఈ పత్రిక సంగతి అందరికీ తెలిసిందె!

    వీళ్ళ ద్రుష్టిలొ మినారిటీల కి ప్రత్యెక హక్కులు అంటె అభ్యుదయం, అదె హిందువుల హక్కులు అంటె రాజకీయం.

  11. ఇంతకీ మన వాటికన్ గొర్రె బిడ్డ ప్యాలస్ పులకేశి హిందూ దేముళ్ళ ప్రసాదం తిన్నాడ ?

    చూడగానే అదిరిపడి భయం తో చేతి కి అంటకుండా కూడా టిష్యూ పెపర్ తో టిడిచేసుకున్నా వీడియో లో ఇంటర్నెట్ లో ప్రజల దగ్గర వున్నాయి.

    దేముడి లడ్డు అంటే అంత భయం యేమిట్ని?

    ఫారిన్ నుండి వచ్చిన అసలు సిసలైన క్రైస్తవులు హిందూ దేముళ్ళ ప్రసాదం భక్తితో తింటారు కదా,

    మరి ఇక్కడి కన్వర్టెడ్ గొర్రె బిడ్డ లకి మాత్రం అంత భయం ఏమిటి?

  12. విదేశాల్లో అసలు సిసలైన క్రైస్తవులు,

    ముక్క నీ కట్ చెపించుకుంటారు అంట కదా, మరి మన గొర్రె బిడ్డ ప్యాలస్ పులకేశి కూడా ముక్క సగం కట్ చెపించుకున్నాడ ?

    అందుకేనా ముక్క పని చేయక వినాశం కి ఫుల్ డ్యూటీ పడింది?

  13. ఇంత దరిద్రానికి కారణం ఎవరు?పాలించే ప్రభువు తప్పుడు మార్గం లో వెళ్ళాడు, వందిమాగతులు తందానా పాడారు, వెరసి మఠం మంట కలిసింది

    ఈరోజు ఒక నేషనల్ మేగజైన్ ఇంత ధైర్యం చేసింది అంటే ఎవరి తప్పు?

    సగటు హిందువు గా ఆలోచించవలసిన సమయం వచ్చింది, ఇక సంఘటితం తప్పదు, లేకపోతే మన తరవాత తరాలు ఒకప్పుడు తిరుమల అనే గుడి వుండేదట అని చరిత్ర లో చదువుకుంటారు

    **మొత్తం భ్రష్టు పట్టించేస్తారు.**

  14. మరి మీ సో కాల్డ్ జగన మోహన్ రెడ్డి అండ్ కో చేసిన లడ్డు కల్తీ గురించి రాసే దమ్ము నీకుందా.. లేదు.. ఎందుకంటె నువ్వు కూడా ఆ కల్తీ రెడ్డి కాంపౌండ్ కుక్కవే కదా.

  15. Anna, chinna doubt.. pk gadu already cheppadu .. kalthi jagan Anna emi vellibcheyyadu.. middle lo unna panikimalina vallu chesuntaru ani.. naku ardham kani vishayam prasadam kalthi vishayam lo compramise avalsina avasaram enti…eh message pettina editor ki cheppu.. ela chese nasanam ayyam

Comments are closed.