ప‌వ‌న్ ను బీజేపీ సీఎంగా చేయ‌డానికేన‌ట‌!

ఏపీలో రాజ‌కీయంపై ఎర్ర‌న్న‌లు మండిప‌డుతూ ఉన్నారు! ప్ర‌త్యేకించి ఒక‌ప్పుడు త‌మతో రాసుకుపూసుకు తిరిగిన రాజ‌కీయ స్నేహితుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయాన్ని క‌మ్యూనిస్టులు ఖండిస్తూ ఉన్నారు. త‌మ‌తో తిరిగిన‌ప్పుడు భ‌గ‌త్ సింగ్, చేగువేరా పేర్ల‌ను చెప్పిన…

ఏపీలో రాజ‌కీయంపై ఎర్ర‌న్న‌లు మండిప‌డుతూ ఉన్నారు! ప్ర‌త్యేకించి ఒక‌ప్పుడు త‌మతో రాసుకుపూసుకు తిరిగిన రాజ‌కీయ స్నేహితుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయాన్ని క‌మ్యూనిస్టులు ఖండిస్తూ ఉన్నారు. త‌మ‌తో తిరిగిన‌ప్పుడు భ‌గ‌త్ సింగ్, చేగువేరా పేర్ల‌ను చెప్పిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు త‌న‌కు ఇష్ట‌మైన నేత‌లుగా తెలుగు జ‌నాల‌కు నోళ్లు తిర‌గ‌ని ఆర్ఎస్ఎస్ నేత‌ల పేర్లు చెబుతూ ఉన్నారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే అంతే మ‌రి, ఆయ‌న అవ‌స‌రానికి అర్జెంటీనా నేత పేరునో, ర‌ష్య‌న్ పేరునో చెప్ప‌నూ గ‌ల‌రు, లేక‌పోతే తెలుగునాట తెలియ‌ని కాషాయ‌వాది పేర్ల‌నూ ప‌రిచ‌యం చేయ‌గ‌ల‌రు! స‌నాత‌న ధ‌ర్మంలో అబద్ధం చెప్ప‌కూడ‌ద‌నే నియ‌మం ఉంద‌ని ప‌వ‌న్ కు తెలుసో లేదో కానీ, ఏ పూట‌కు ఆ పాట పాడుతూ అదే స‌నాత‌నం అంటూ ప‌వ‌న్ జ‌నాల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు!

ఆ సంగ‌త‌లా ఉంటే.. ఇదంతా బీజేపీ వ్యూహం అంటున్నారు సీపీఎం నేత‌లు. అంతేకాద‌ట‌, దీని వెనుక పెద్ద స్ట్రాట‌జీనే ఉంద‌ని, చంద్ర‌బాబును సీఎం ప‌ద‌వి నుంచి దించేసి, ఆ స్థానంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఎక్కించేందుకు బీజేపీ ఈ వ్య‌వ‌హారాన్ని న‌డిపిస్తోంద‌ని వారు అంటున్నారు. హిందుత్వ‌వాదంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ ను హైలెట్ చేసి, చంద్ర‌బాబు స్థానంలో ఆయ‌న‌ను కూర్చోబెట్టాల‌నేది బీజేపీ వ్యూహం అంట‌! అందుకే ప‌వ‌న్ క‌ల్యాణ్ అలా మాట్లాడుతూ ఉన్నార‌ట‌!

మ‌రి సీపీఎం నేత‌లు ఈ మాట‌ల‌ను చంద్ర‌బాబుకు చెప్పి ఆయ‌న‌ను అల‌ర్ట్ చేసి, ఆయ‌న మ‌న్న‌నలు పొందాల్సిన అవ‌స‌రం అయితే ఉంది. ఏపీలో రాజ‌కీయం చంద్ర‌బాబుకు అర్థం అవుతోందో లేదో అని ఎర్ర‌న్న‌లు కాస్త ఆయ‌న‌కు వివ‌రించాల్సి ఉంది. మీ స్థానంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ను కూర్చోబెట్ట‌డానికే బీజేపీ ఇదంతా ఆడిస్తోంద‌ని వీరు చంద్ర‌బాబుకు హిత‌బోధ చేయాల్సి ఉంది. మ‌రి ఎర్ర‌న్న‌లు కూడా గ‌తంలో చంద్ర‌బాబుకు దోస్తులే క‌దా, అవ‌స‌రం కొద్దీ చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎర్ర పార్టీల‌తో అయినా, కాషాయ పార్టీల‌తో అయినా దోస్తీ చేయ‌గ‌ల ఘ‌ట‌నాఘ‌ట స‌మ‌ర్థులే! కాబ‌ట్టి.. ఎర్ర పార్టీ హిత‌బోధ చంద్ర‌బాబుకు చేరుతుందేమో చూడాలి!

14 Replies to “ప‌వ‌న్ ను బీజేపీ సీఎంగా చేయ‌డానికేన‌ట‌!”

  1. కధ లు బాగా రాస్తున్నారు గ మొన్నొక పొలిటికల్ థ్రిల్లర్ ..ఇవ్వాళా ఇది ….టాలెంట్ మాములుగా లేదు గ అసలు

  2. Always imaginary articles that invariably in the ridicule Pawan. Pawan was never interested in becoming CM unlike crmnl cris redy who set up the party to become CM and nothing else.

Comments are closed.