నాగార్జునపై, అతడి కుటుంబంపై, సమంతాపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యల్ని ఆమె వెనక్కు తీసుకున్నప్పటికీ, నాగార్జున మాత్రం చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు.
కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు స్వయంగా స్టేట్ మెంట్ ఇవ్వడానికి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు నాగార్జున. ఆయనతో పాటు సాక్ష్యులుగా సుప్రియ, వెంకటేశ్వర్లు రాగా.. నాగార్జునకు మద్దతుగా నాగచైతన్య, అమల, సుశీల కూడా కోర్టుకు వచ్చారు.
కోర్టు ముందు నాగార్జున తను చెప్పాలనుకున్నది చెప్పారు. తన లాయర్ అందించిన పేపర్ లో విషయాన్ని కోర్టుకు చదివి వినిపించారు. అలా నాగార్జున స్టేట్ మెంట్ ను కోర్టు రికార్డ్ చేయగా, దానికి సాక్ష్యంగా సుప్రియ స్టేట్ మెంట్ ను కూడా పొందుపరిచారు.
దశాబ్దాలుగా పరిశ్రమలో కొనసాగుతూ, ఎన్నో అవార్డులు పొందుతూ, సామాజిక కార్యక్రమాలు చేస్తూ… గౌరవ ప్రతిష్టలతో బతుకుతున్న తమపై మంత్రి కొండా సురేఖ, ఉద్దేశపూర్వకంగా, అత్యంత అసభ్యంగా, సభ్యసమాజం సిగ్గుపడేలా, తమ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని నాగార్జున ఆరోపించారు. తమ కుటుంబ సభ్యులు పడిన మనోవేదనను మాటల్లో వర్ణించలేమన్నారు. మంత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.
నాగార్జున స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసిన తర్వాత, స్పందించడానికి తమకు సమయం కావాలని కొండా సురేఖ తరఫున న్యాయవాదాలు కోరగా, కోర్టు అందుకు అనుమతి మంజూరు చేస్తూ, 10వ తేదీకి సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. మరో సాక్షి వెంకటేశ్వర్లు స్టేట్ మెంట్ ను కూడా 10వ తేదీన తీసుకోవాలని సూచించింది.
కోర్టు బయటకొచ్చిన తర్వాత సురేఖ తరఫు న్యాయవాదాలు మీడియాతో మాట్లాడారు. నాగార్జున పెట్టిన కేసు నిలవదంటున్నారు లాయర్లు. సురేఖ ఆల్రెడీ తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకున్నారు కాబట్టి ఈ కేసు చెల్లదని చెబుతున్నారు. నాగ్ తరఫు లాయర్లు మాత్రం తుదివరకు పోరాడతామని స్పష్టం చేశారు. కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేవరకు ఎదురుచూస్తామంటున్నారు.
Call boy works 9989793850
vc estanu 9380537747
Porata patimaa
Antey yenta maata Aina anesi simple ga sorry cheppestey saripotunda…..? Oka mantri padavilo vundi matladetapudu anta kallumusukoni matladutara…. ! Senseless vundakkarleda, adi kuda Nag lanti oka Gentleman paina ……! He never criticises anyone, he lives in his limits nd never hurt or harm anyone with his words. We strongly support Nag sir