జ‌గ‌న్ మ‌తి అలా… వైసీపీకి ఏ గ‌తి ప‌ట్టేనో!

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న దారికే అంద‌రూ రావాల‌ని అనుకుంటుంటారు. తాను చేసిందే పాల‌న‌, చెప్పిందే వేదం అన్న‌ట్టుగా ఆయ‌న తీరు వుంది. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో ప్ర‌జాభిప్రాయానికి త‌గ్గ‌ట్టు నాయ‌కుడిగా తాను మారాల‌ని…

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న దారికే అంద‌రూ రావాల‌ని అనుకుంటుంటారు. తాను చేసిందే పాల‌న‌, చెప్పిందే వేదం అన్న‌ట్టుగా ఆయ‌న తీరు వుంది. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో ప్ర‌జాభిప్రాయానికి త‌గ్గ‌ట్టు నాయ‌కుడిగా తాను మారాల‌ని ఆయ‌న ఆలోచిస్తున్న‌ట్టుగా లేరు. ఎంత‌సేపూ సంక్షేమ ప‌థ‌కాలు, బ‌ట‌న్ నొక్క‌డం.. తానెంతో గొప్ప‌గా ప్ర‌జ‌ల‌కు ల‌బ్ధి క‌లిగించాన‌ని, కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి నాలుగు నెల‌లైనా, హామీల్ని అమ‌లు చేయ‌లేద‌ని జ‌గ‌న్ మాట్లాడ్డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

త‌న మ్యానిఫెస్టోను భ‌గ‌వ‌ద్గీత‌గా, ఖురాన్‌గా, బైబిల్ అంత‌టి ప‌విత్రంగా భావించి, ఐదేళ్ల పాటు అమలు చేశాన‌ని చెప్పుకోవ‌డం కాదు, ఎన్నిక‌ల ఫ‌లితాలు ఏంటి? అనేదే ప్ర‌శ్న‌. త‌న‌కు తానుగా గొప్ప‌గా ప్ర‌జ‌ల‌కు ల‌బ్ధి క‌లిగించాన‌ని చెప్పుకోవ‌డం ప‌క్క‌న పెడితే, ఘోరంగా ఎందుకు ఓడించారో ఇప్ప‌టికీ జ‌గ‌న్ ఆలోచించ‌డం లేదు. జ‌గ‌న్‌లోని ఈ ధోర‌ణి వైసీపీలో ఆందోళ‌న క‌లిగిస్తోంది.

రాష్ట్ర‌మంటే కేవ‌లం సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధిదారులు మాత్ర‌మేనా? ఇక ఎవ‌రూ లేరా? అనే ప్ర‌శ్న వేసుకుని, మిగిలిన వారి కోణంలో కూడా జ‌గ‌న్ ఎందుకు ఆలోచించ‌డం లేదో! సంక్షేమ ప‌థ‌కాల క్యాలెండ‌ర్‌, బ‌ట‌న్ నొక్కి నేరుగా… ల‌బ్ధిదారుల ఖాతాల్లోకి డ‌బ్బు పంపామ‌న్న జ‌గ‌న్ మాట‌లు గ‌త ఐదేళ్ల‌లో వినివిని విసిగెత్తారు. ఇప్పుడు మ‌ళ్లీ అవే మాట‌లేనా? జ‌గ‌న్‌ను గెలిపిస్తే, సంక్షేమ ప‌థ‌కాలు త‌ప్పితే, మ‌రేది అవ‌స‌రం లేద‌న్న‌ట్టు ప‌రిపాలిస్తాడ‌ని, ఆయ‌న‌కు సంప‌ద సృష్టించ‌డం అస‌లే తెలియ‌ద‌ని, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించేందుకు ప‌రిశ్ర‌మ‌లు , ఇత‌ర‌త్రా తీసుకొచ్చే ఆలోచ‌న ఉండ‌ద‌ని విద్యావంతులు, నిరుద్యోగులు ఇప్ప‌టికీ విమ‌ర్శిస్తూనే ఉన్నారు.

జ‌గ‌న్ తీరు ఎలా వుందంటే… ఎవ‌రన్నా ఏమ‌న్నా అనుకోని, తాను ఏదైతే ఆలోచిస్తున్నారో అదే మాట్లాడుతున్నారు. మ‌తి ఎంతో గ‌తి అంతే అని పెద్ద‌లు అంటుంటారు. జ‌గ‌న్ మ‌తి అంతా సంక్షేమం చుట్టూ తిరుగుతోంటోంది. సంక్షేమం క‌డుపు నింప‌ద‌ని, శాశ్వ‌త ఉపాధి క‌ల్పించాల‌ని జ‌నం కోరుకుంటున్నారు. సంక్షేమ‌మే జ‌గ‌న్ మ‌తి అయితే, త‌మ గ‌తి ఏమ‌ని పౌర స‌మాజం ప్ర‌శ్నిస్తోంది. ఇప్ప‌టికైనా జ‌గ‌న్ ఆలోచ‌న తీరులో మార్పు రావాలి.

ప్ర‌జ‌లు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవాలి. పార్టీ నాయ‌కుల్ని ముందు పెట్టుకుని, సొంత మీడియా కెమెరాల్లో తాను చెప్పింది రికార్డు చేసి, ప్ర‌సారం చేసుకోవ‌డం గొప్ప‌కాదు. తానెందుకు ఘోరంగా ఓడిపోయానో క‌నీసం సొంత పార్టీ నాయ‌కుల్ని అడిగినా చెబుతారు. సంక్షేమం అనేది ముగిసిన అధ్యాయం. కొత్త జ‌న‌రేష‌న్ ఆలోచ‌న‌లు అభివృద్ధిని కోరుకుంటున్నాయి. అయితే ఓట్ల కోసం మోస‌పూరిత హామీల్ని ఇచ్చే నాయ‌కుల్ని ఊరికే వ‌దిలి పెట్ట‌రు. అలాగ‌ని సంక్షేమ ప‌థ‌కాలే అన్ని స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం అన్న‌ట్టుగా జ‌గ‌న్ మాట్లాడ్డం ఎబ్బెట్టుగా ఉంది.

సంక్షేమ‌మే కాకుండా, తానింకా చాలా మంచి ప‌నులు చేశాన‌ని జ‌గ‌న్ మ‌రిచిపోయిన‌ట్టున్నారు. వాటి గురించి ఎంత ఎక్కువ చెబితే, అంత‌గా ఇత‌ర వ‌ర్గాల్ని ఆక‌ట్టుకుంటారు. క‌నీసం ఆయ‌న‌కు ఎవ‌రైనా ఈ విష‌య‌మై స‌ల‌హా ఇస్తే మంచిది. లేదంటే మ‌ళ్లీమ‌ళ్లీ త‌న అజ్ఞానంతో జ‌గ‌న్ న‌ష్ట‌పోతూ వుంటారు. ఎందుకంటే మ‌న ఆలోచ‌నే మ‌న జీవితం అని ఒక మ‌హ‌నీయుడు అన్నారు. వైసీపీ భ‌విష్య‌త్‌… జ‌గ‌న్ మ‌తిపై ఆధార‌ప‌డి వుంటుంది. అందుకే జ‌గ‌న్ త‌ప్పుల్ని ఎప్ప‌టిక‌ప్పుడు స‌రిదిద్దుకుంటూ, కొత్త‌త‌రం ఆశ‌లు, ఆశ‌యాల‌కు త‌గ్గ‌ట్టు అడుగులు వేయాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. కాలంతో పాటు ప‌రుగుకు తీయ‌క‌పోతే, తాను వెనుక‌ప‌డి పోతాన‌ని జ‌గ‌న్ గుర్తిస్తే మంచిది.

34 Replies to “జ‌గ‌న్ మ‌తి అలా… వైసీపీకి ఏ గ‌తి ప‌ట్టేనో!”

  1. సంక్షేమం అనే ముష్టి పడేస్తే.. ఊరకుక్కల్లా విశ్వాసం గా పడి ఉంటారని.. ఈ కొండ గొర్రెలను చేరదీస్తుంటాడు..

    జగన్ రెడ్డి జనాలు కొండ గొర్రెలు కావొచ్చు గాని.. సాధారణ జనాలు కాదు కదా..

    అందుకే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసేసి.. బెంగుళూరు కి పార్సెల్ చేసేసారు..

    మన రెడ్డన్న.. ఈవీఎం ల మీద పడి ఏడుస్తుంటాడు..

    రేపు బాలట్ పేపర్ లో కూడా ఓడిపోతే.. ఇక జనాలందరినీ నిలబెట్టి చేతులు ఎత్తమంటాడేమో..

    వాడికి వాడు గెలవడం ముఖ్యం.. అధికారం ఉంటె.. కోర్ట్ కేసులు ఉండవు.. బెయిల్ ఉంటుంది.. అడ్డం గా సంపాదించుకోవచ్చు..

    దానికి ఈ కొండ గొర్రెలు ఇల్లు, ఒళ్ళు గుల్ల చేసుకుని.. వాడికి వత్తాసు పలుకుతుంటారు..

    ముదనష్టపు జన్మలు..

  2. సంక్షేమం అనే ముష్టి పడేస్తే.. ఊరకుక్కల్లా విశ్వాసం గా పడి ఉంటారని.. ఈ కొండ గొర్రెలను చేరదీస్తుంటాడు..

    జగన్ రెడ్డి జనాలు కొండ గొర్రెలు కావొచ్చు గాని.. సాధారణ జనాలు కాదు కదా..

    అందుకే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసేసి.. బెంగుళూరు కి పార్సెల్ చేసేసారు..

    మన రెడ్డన్న.. ఈవీఎంల మీద పడి ఏడుస్తుంటాడు..

    రేపు బాలట్ పేపర్ లో కూడా ఓడిపోతే.. ఇక జనాలందరినీ నిలబెట్టి చేతులు ఎత్తమంటాడేమో..

    వాడికి వాడు గెలవడం ముఖ్యం.. అధికారం ఉంటె.. కోర్ట్ కేసులు ఉండవు.. బెయిల్ ఉంటుంది.. అడ్డం గా సంపాదించుకోవచ్చు..

    దానికి ఈ కొండ గొర్రెలు ఇల్లు, ఒళ్ళు గుల్ల చేసుకుని.. వాడికి వత్తాసు పలుకుతుంటారు..

    ముదనష్టపు జన్మలు..

  3. ఈ జగన్ గారి ఫార్ములా 70 వ దశకం లో నిది అప్పుడు పేదలను ఉద్ధరిస్తామంటే నమ్మి ఓట్లేసే రోజులు వాళ్ళు అధికారంలోనికి వచ్చిన తర్వాత బాగుపడి జనాన్ని ముంచేయటం చూసేరు ఇప్పుడు మనకేమిటి ఉపాధి ఆదాయవనరులు అని చూసుకొనే విద్యావంతులు పెరిగిన కాలం ప్రతిపక్షాన్ని ఉక్కు పాదం తో అణచేస్తాను పోలీసులను రౌడీ లలాగా వాడతాను ఒకసారి ఎన్నుకొంటే నేనే శాశ్వత అధినేతను అని నమ్మేవాడికి ఎవడు వేస్తాడు సామాన్య జనాలకు రోడ్స్ లేకుండా చేసి దొరగారు బాత్రూం కి కూడా హెలికాప్టర్ లలో జనం డబ్బుతో తిరిగేడు పన్ను కట్టేటోళ్లు మనుషులు కాదన్నట్టు చూసేడు ఇష్టం లేని వ్యక్తుల ఆస్తులను నాశనం చేసేడు మల్లి ఇతగాడికి ఓట్లు పావలాకి బేడకి కక్కుర్తి పడే వాడే వెయ్యాలి చంద్రబాబు గారు కూడా పెన్షన్ లు ఫీజు రేయింబర్సుమెంట్ లు ఆరోగ్య శ్రీ కి కచ్చితం ఇస్తున్నాడు తర్వాత ఎలేచ్షన్స్ తర్వాత వైసీపీ ఉండదు

    1. 3 Capitals issue was in court but Vizag was being developed as a capital in last 5 years. Land was allotted for Railway Zone but it was put on hold for political reasons. I provided the investment link with investment amount in last 5 years and with regards to ports last 5 years saw construction of 4 ports and 9 fishing harbors of which few will be ready within next 12 months. Roads and flyovers were taken up through central government intitiatives and state government did not focus much on maintaining roads in last 5 years. Schools, government colleges, RBK centers and hospitals in villages are all part of developing government infrastructure which were taken up in last 5 years in addition to providing welfare schemes for people.

  4. Correct article. 4 months nunchi super six emi amalu cheyaledu. Ayinaa public is calm. Ante ardham emiti. no one cares about these daffa welfare programs. Create development. Not these useless welfare programs which make people lazy and lafuts.

  5. Can you please list Jagan achievements other than button pressing?

    Just asking.

    In the matters of Capital, Polavaram, Railway Zone, New Industries, Roads, Ports, and other development projects etc. etc.

    Please please….

    1. 3 Capitals issue was in court but Vizag was being developed as a capital in last 5 years. Land was allotted for Railway Zone but it was put on hold for political reasons. I provided the investment link with investment amount in last 5 years and with regards to ports last 5 years saw construction of 4 ports and 9 fishing harbors of which few will be ready within next 12 months. Roads and flyovers were taken up through central government intitiatives and state government did not focus much on maintaining roads in last 5 years. Schools, government colleges, RBK centers and hospitals in villages are all part of developing government infrastructure which were taken up in last 5 years in addition to providing welfare schemes for people.

  6. “సంక్షేమ‌మే కాకుండా, తానింకా చాలా మంచి ప‌నులు చేశాన‌ని జ‌గ‌న్ మ‌రిచిపోయిన‌ట్టున్నారు.”..joke aa?

    lol

  7. గొడవ చేసే పిల్లాడి లాగు విడదీసి , పి*ర్ర మీద తోలు బెల్టు తో టప్ మని కొట్టినట్లు , ఇలా ఎన్ని సార్లు

    ప్యాలస్ పులకేశి లా*గు విప్పదీసి కొడతావ్ , గ్రేట్ ఆంద్ర.

  8. ఏంటి రా రెండు ఆర్టికల్స్ షార్ట్ గ్యాప్ లో .. 10 వ తేదీ వచ్చిన paytm పడలేదా లేక దసరా మామ్మూళ్లు ఇవ్వలేదన్న కోపమా !

  9. జగన్ రెడ్డి చేసిన దారుణాలు, అరాచకం, అవినీతి, ఏపీ ప్రజలు 100 సంవత్సరాలు గుర్తుంచుకుంటారు

Comments are closed.